ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతోందా..?

Posted By:

ఈ రోజుల్లో దాదాపుగా ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్‌ఫోన్ కనిపిస్తోంది. ఎక్కవ బడ్జెట్ ఫోన్‌లు మొదలకుని తక్కువ బడ్జెట్ ఫోన్‌ల మార్కెట్లో వందలాది మోడళ్లలో లభ్యమవుతున్నాయి. మనిషి ఆధునిక జీవనశైలిలో ఫోన్ నిత్యవసర సాధనంలా మారిన నేపధ్యంలో మొబైల్ ఫోన్ ఒక్కనిమిషం చేతిలో లేకపోతే గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

స్మార్ట్‌ఫోన్‌లో ఏదైన ముఖ్యమైన పనిలో నిమగ్నమైనపుడు ఆకస్మాత్తుగా ఫోన్ హ్యాంగ్ లేదా ఫ్రీజ్ అయితే మీరు ఏంచేస్తారు..?, ఫోన్ హ్యాంగ్ అవటానికి చాలా కారణాలే ఉంటాయి. ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైనపుడు సమాయాన్ని ఏ మాత్రం వృధా కాకుండా ఫోన్‌లో తలెత్తిన సమస్యను కనిపెట్టి ఫోన్‌ను తిరిగి సాధారణ స్థాయికి తీసుకువచ్చే మార్గాలను మీ ముందుకు తీసుకువచ్చాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతోందా..?

పనికొస్తాయి కదా అని అనేక రకాల యాప్‌లను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తుంటాం. ఈ యాప్‌లు డివైస్‌లో ఎక్కువ స్టోరేజ్ స్పేస్‌ను ఆక్రమించేసి ఫోన్ వేగాన్ని పూర్తిగా తగ్గించి వేస్తాయి. ఫోన్‌లు హ్యాంగ్ అవటానికి కూడా ప్రధాన కారణం ఇవే. కాబట్టి మీ ఫోన్‌ను ఎప్పటికప్పుడు సురక్షితంగానూ అదే సమయంలో క్లీన్‌‍గా ఉంచేందుకు ప్రయత్నం చేయండి.

 

ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతోందా..?

ముందుగా స్విచాఫ్ లేదా బ్యాటరీని తొలగించండి

మీ ఫోన్ హ్యాంగ్ అయిందన్న విషయాన్ని ఖచ్చితంగా నిర్థారించుకున్న తరువాత ముందుగా చేయవల్సిన పని ఫోన్‌ను స్విచాఫ్ చేయండి. ఫోన్ స్విచాఫ్‌కు సహకరించని పక్షంలో బ్యాటరీని తొలగించండి. ఓ నిమిషం తరువాత బ్యాటరీని ఎదా స్థానంలో ఉంచి ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి. చాలా సందర్భాల్లో ఈ ట్రిక్ పనిచేస్తుంది.

 

ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతోందా..?

ఆ అప్లికేషన్‌ను తొలగించండి...

ఓ అప్లికేషన్‌ను వినియోగిస్తోన్న సమయంలో మీ ఫోన్ స్తంభించినట్లయితే ప్రధాన సమస్య ఆ యాప్‌లో ఉన్నట్లే. యాప్‌లో తలెత్తిన ఎర్రర్ లేదా వైరస్ వంటి హానికరమైన కోడింగ్ కారణంగా అలా జరిగి ఉండవచ్చు. కాబట్టి ఆ యాప్‌ను వెంటనే uninstall చేయండి.

 

ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతోందా..?

అనవసర ఫైళ్లను తొలగించండి:

మీ ఫోన్.. అప్లికేషన్‌లు అలానే మీడియా ఫైళ్లతో నిండి ఉన్నట్లయితే డివైస్ ఆన్ బోర్డ్ మెమరీ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఫోన్ హ్యాంగ్ అయ్యేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఫోన్‌లో పేరుకుపోయిన అనవసర ఫైళ్లను తొలగించండి.

 

ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతోందా..?

ఫోన్ రీస్టోర్ చేయండి:

పైన సూచించిన చిట్కాలు పాటించినప్పటికి ఫలితం లేకపోయినట్లయితే ఫోన్‌ను రీస్టోర్ చేయండి. మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నట్లయితే Settingsలోకి వెళ్లి Backup & Reset ఆప్షన్‌ను సెలక్ట్ చేయండి. ఫోన్ రీస్టోర్ అవుతుంది.

 

ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతోందా..?

ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయండి

మీ ఫోన్ తరచూ హ్యాంగింగ్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే లోపం ఫోన్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్నట్టు గుర్తించండి. ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
How to Rectify Hanging problems in Mobile Phones. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot