మీ ఇంట్లో మూలన పడి ఉన్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఏం చేస్తున్నారు

ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను విలువైన వనరులతో తయారు చేస్తున్నారు. సాంకేతిక ఉత్పత్తుల నిర్మాణంలో భాగంగా మెటల్, ప్లాస్టిక్స్ ఇంకా గ్లాస్ వంటి పదర్థాలను వినియోస్తున్నారు. నిరుపయోగంగా మారి మీ ఇంట్లో మూలన పడి ఉన్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను రీసైకిలింగ్ లేదా వేరొకరికి దానం చేసినట్లయితే ప్రకృతిని అనేక రకాలైన కాలుష్యాల నుంచి సంరక్షించినవారవుతారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఉపయోగపడేదైతే మీ వద్దనే ఉంచుకోండి

మీ పాత కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌ను రీసైకిలింగ్ లేదా వితరణ నిమిత్తం వేరొకరికి అందజేసే ముందు సదరు గాడ్జెట్స్ పనితీరును క్షుణ్నంగా పరిశీలించండి. ఒకవేళ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతో ఆ గాడ్జెట్ మరలా ఉపయోగపడేదైతే మీ వద్దనే ఉంచుకోండి.

రిసైకిలింగ్ నిమిత్తం

గాడ్జెట్ తయారీ కంపెనీలతో పాటు ఆన్‌లైన్ రిటైలర్‌లు పాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను రిసైకిలింగ్ నిమిత్తం సేకరించేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అవకాశముంటే అలాంటి చోట మీ పాత ఎలక్ట్రానిక్ వస్తువులను అమ్మేయండి.

3500 ఇళ్లు ఏడాది పాటు విద్యుత్‌ను ఆదా చేసినంత

10లక్షల ల్యాప్‌టాప్‌లను రిసైకిల్ చేయటం ద్వారా వచ్చే ఫలితం, అమెరికాలో 3500 ఇళ్లు ఏడాది పాటు ఉపయోగించే విద్యుత్‌ను ఆదా చేసినంత సమానమట.

75 పౌండ్ల బంగారం

10మిలియన్‌ల సెల్‌ఫోన్‌లను రీసైకిల్ చేయటం ద్వారా 35వేల పౌండ్ల రాగి, 772 పౌండ్ల, వెండి, 75 పౌండ్ల బంగారం, 33 పౌండ్ల పల్లాడియంను తిరిగి పొందవచ్చట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Recycle Our Old Electronics. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting