ఐఫోన్...ఇప్పుడు అందరికీ ఒక నిత్యావసర వస్తువులాంటింది. యూత్ ఐఫోన్ కు బానిసగా మారుతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్లంటూ చాలా సమయం ఐఫోన్లతోనే గడుతుపుతున్నారు. చీకట్లో ఎక్కువగా ఐఫోన్ వినియోగించేవారు...జాగ్రత్తగా ఉండాలి.
లేదంటే మీ కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉంది. చీకట్లో ఫోన్ ఎక్కువగా ఉపయోగించేవారు కొన్ని చిట్కాలు పాటించాలి. ఐఫోన్ స్క్రీన్ బ్రైట్నేస్ ను ఐఓఎస్ కంటే తక్కువగా ఉంచేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో చూడండి.
మీ ఐఫోన్ బ్రైట్ నెస్ ఎలా తగ్గించాలి?
మీ ఐఫోన్ యొక్క బ్రైట్ నెస్ మరింత తగ్గించడానికి..థర్డ్ పార్టీకి చెందిన ఎలాంటి యాప్స్ ను డౌన్ లోడ్ చేయాల్సిన పనిలేదు. సెట్టింగ్స్ లో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది. మీరు చేయాల్సిన కొన్ని దశలు ఉన్నాయి ఫాలో అవ్వండి.
స్టెప్ 1...హోం స్క్రీన్ నుంచి సెట్టింగ్స్ ఓపెన్ చేసి జనరల్ ట్యాప్ నొక్కండి.
స్టెప్ 2. ఇప్పుడు యాక్సెస్ బిలిటి సెలక్ట్ చేసుకోండి.
స్టెప్ 3...విజన్ సెట్టింగ్స్ కింద డిస్ ప్లే అకమాండేషన్స్ నొక్కండి.
స్టెప్ 4..టోగుల్ వైట్ పాయింట్ తగ్గించండి. ఇది ప్రకాశవంతమైన రంగుల తీవ్రతను తగ్గిస్తుంది.
స్టెప్ 5.. స్లయిడ్ శాతం ఇప్పుడు వైట్ పాయింట్ రెడ్యూస్ ఆప్షన్ కింద కనిపిస్తుంది. మీరు రెండు స్క్రీన్లకు లాగండి. దీంతో మీ స్క్రీన్ యొక్క బ్రైట్ నెస్ ను తగ్గిస్తుంది. డార్క్ నెస్ స్క్రీన్ను పొందడానికి వంతం వరకు దాన్ని స్లయిడ్ చేయవచ్చు.
చివరగా..
ఇప్పుడు మీకు కావాల్సిన స్క్రీన్ బ్రైట్ నెస్ ఉంటుంది. హోం స్క్రీన్ సెటప్ తో అస్పష్టతను తగ్గించవచ్చు. మీ చుట్టుపక్కల ఉన్న ఉన్న వాతావరణాన్ని బట్టి మళ్లీ బ్రైట్ నెస్ పెంచుకోవచ్చు. దానికి యాక్సెస్ బిలిటి సెట్టింగ్స్ లోకి వెళ్లి యాక్సెస్ షార్ట్ కట్ పై నొక్కండి. ఇప్పుడు వైట్ పాయింట్ తగ్గించు అనే ఆప్షన్ను సెలక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ హోం స్క్రీన్ కు తిరిగి వెళ్లండి. బ్రైట్ నెస్ ఉన్న ఫీచర్ను ఆన్, ఆఫ్ చేయడం కోసం టోగులు బటన్ ద్వారా మీ హోం స్క్రీన్ ట్రిపుల్ చేయవచ్చు.
మీ ఫోటోలను అందమైన కార్టూన్లుగా మార్చేయవచ్చు
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.