క్రాష్ అయిన SD Cardను రిపేర్ చేయటం ఎలా..?

Posted By: BOMMU SIVANJANEYULU

డేటా స్టోరేజ్ అవసరాలను తీర్చటంలో SD Cards అనేవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. మార్కెట్లోకి అనేక క్లౌడ్ స్టోరేజ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చినప్పటికి సాంప్రదాయ ఎస్డీ కార్డ్స్‌కు మాత్రం ఆదరణ తగ్గటం లేదు. స్మార్ట్‌ఫోన్‌లతో విడదీయలేని బంధాన్ని ఏర్పరుచుకున్న మెమరీ కార్డ్‌లు కాలానుగుణంగా అప్‌డేట్ అవుతు వస్తున్నాయి.

క్రాష్ అయిన SD Cardను రిపేర్ చేయటం ఎలా..?

కొన్ని సందర్భాల్లో మెమరీ కార్డులు అర్థంతరంగా పనిచేయటం మానేస్తుంటాయి. వీటికి అనేక కారణాలు ఉన్నప్పటికి ఎక్కువ శాతం యూజర్ నిర్లక్ష్యం కారణంగా చోటు చేసేుకునేవే. క్రాష్ అయిన ఎస్డీ కార్డ్స్‌ను పలు సింపుల్ ట్రిక్స్‌ ద్వారా రిపేర్ చేసుకునే ప్రొసీజర్‌ను ఇప్పుడు తెలుసుకుందాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్లీన్ చేయటం ద్వారా ఫలితం కనిపించవచ్చు...

ఎస్డీ కార్డు పై దుుమ్ము పేరుకుపోవటం వల్ల కూడా అది క్రాష్ అయ్యే ప్రమాదముంది. కార్డును మొత్తని క్లాత్‌తో ఫిజికల్‌గా క్లీన్ చేయటం ద్వారా అది తిరిగి పనిచేసే అవకాశం ఉంటుంది. క్లాత్‌తో క్లీన్ చేస్తున్న సమయంలో తడి అనేది కాపర్ ఎలిమెంట్స్‌కు తగలకుండా చూసుకోవాలి.

ఫార్మాట్ చేయటం ద్వారా ఫలితం కనిపించవచ్చు..

క్రాష్ అయిన మెమెురీ కార్డును ఫార్మాట్ చేయటం ద్వారా ఫలితం కనిపించవచ్చు. కార్డును ఫార్మాట్ చేయటం ద్వారా వైరస్ లు పూర్తిగా తొలిగిపోతాయి. ఇదే సమయంలో లోపలి డేటా కూడా పూర్తిగా క్లియర్ అయిపోతుంది.

Wrong Format కూడా ఓ కారణం...

కొన్ని సందర్భాల్లో మైక్రోఎస్డీ కార్డ్‌లలో కంటెంట్ ఫుల్‌గా ఉన్నప్పటికి బ్లాంక్ అని చూపిస్తుంటాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం Wrong Format. ఒకే మైక్రోఎస్డీ కార్డ్‌ను వేరు వేరు డివైసుల్లో ఉపయోగించటం వల్ల, ఈ ఫార్మాటింగ్ సమస్యలు తెలెత్తే అవకాశముంది. కాబట్టి, మైక్రోఎస్డీ కార్డ్‌ను ఒకే డివైస్ లో ఉపయోగించుకోవటం మంచిది.

మీ గూగుల్ క్రోమ్‌ బ్రౌజర్ ఎప్పుడూ Incognito Modeలో ఓపెన్ అవ్వాలా..?

సేఫ్‌గా రిమూవ్ చేయండి..

కొంత మంది తమ ఎస్డీ కార్డ్‌లను సరైన ప్రికాషన్స్ ఫాలో అవకుండా Eject చేసేస్తుంటారు. పర్యావసానంగా కార్డ్ లోపలి డేటా కరప్ట్ అయ్యే ప్రమాదముంది. ఇటువంటి అనర్థాల భారి నుంచి మీ ఎస్డీ కార్డ్‌ను రక్షించుకోవాలంటే సరైన ప్రికాషన్స్ ఫాలో అవుతూ సేఫ్‌గా రిమూవ్ చేయవల్సి ఉంటుంది.

పొరపాటున లాక్ పడిందేమో చూడండి..

కొంత మంది ఎస్డీ కార్డ్‌లను రఫ్‌గా హ్యాండిల్ చేసేస్తుంటారు. ఇలా చేయటం వల్ల కార్డులు ఫిజికల్‌గా డామేజ్ అవుతుంటాయి. ఫలితంగా కొత్త కేసింగ్‌ను మార్చుకోవల్సి ఉంటుంది. కొంత మంది అనుకోకుండా తమ ఎస్డీ కార్డ్‌లను లాక్ చేసేస్తుంటారు. కార్డ్ లాక్ చేయబడి ఉన్నందు వల్ల కార్డ్ సిస్టంలోకి తీసుకోదు. ఇది కూడా ఒక కారణంగా భావించవచ్చు. లాక్ తీయటం వల్ల యదావిధిగా పనిచేస్తుంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
We are going to state some of the steps that you could follow so as to get your SD card repaired. Please check all of the different steps given below.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot