ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన వస్తువులను రిటర్న్ చేయటం ఏలా
ఆన్‌లైన్ షాపింగ్‌కు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఏ వస్తువు కొనాలన్నా గంటల తరబడి షాపింగ్‌మాల్స్‌లో గడిపేయడం బొత్తిగా నచ్చనివారికి ఆన్‌లైన్ షాపింగ్ చక్కగా ఉపయోగపడుతోంది. కావాల్సిన వస్తువులను, వాటి ధరను ఇంట్లోనే కూర్చుని సెలక్ట్ చేసుకోవడం ద్వారా షాపింగ్‌మా ల్స్‌లో కాలయాపన తప్పుతోందని ఆన్‌లైన్ షాపింగ్ వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఇంట్లో కంప్యూటర్ కామన్ వస్తువుగా మారడంతో ఆన్‌లైన్ షాపింగ్‌కు సహజంగానే డిమాండ్ పెరుగుతోందనే భావన నిర్వహకుల నుంచి సైతం వినిపిస్తోంది.
కొన్ని సందర్భాల్లో ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా మనం ఎంపిక చేసుకున్న వస్తువు మన అంచనాలకు అందటంలో విఫలమవుతుంది. అలాంటి సమయంలో ఆ వస్తువను నిర్ణేత గడవు లోపు రిటర్న్ చేసే వెసలుబాటులను దాదాపు అన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు కల్పిస్తున్నాయి. కాబట్టి ఈ అవకశాన్ని ఆన్‌లైన్ షాపర్లు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లకు ఆన్‌లైన్ షాపర్ల తాకిడి రోజురోజుకు పెరుగుతోన్నట్లు తెలుస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన వస్తువులను రిటర్న్ చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం...

ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన వస్తువులను రిటర్న్ చేయటం ఏలా
ముందుగా ఫ్లిప్‌కార్డ్ ఆర్డర్స్ పేజీలోకి వెళ్లండి.

ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన వస్తువులను రిటర్న్ చేయటం ఏలా
మీరు చేసిన ఆర్డర్‌లను సంబంధించిన జాబితా అక్కడ కనిపిస్తుంది. వస్తువు మీకు డెలివరీ అయిన తేదీ నుంచి 30 రోజుల లోపు ఆ వస్తువును రిటర్న్ చేసే అవకాశం ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన వస్తువులను రిటర్న్ చేయటం ఏలా
మీరు రిటర్న్ చేయాలనుకుంటున్న వస్తువును సెలక్ట్ చేసుకుని కుడి వైపు భాగంలో కనిపించే రిటర్న్ బటన్ పై క్లిక్ చేయండి.

ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన వస్తువులను రిటర్న్ చేయటం ఏలా
ఆ తరువాత ఓపన్ EASY RETURNS పేజీలో కనింపించే 1. Reason for Return డ్రాప్ డౌన్ మెనూలో మీరు ఆ వస్తువును ఎందుకు రిటర్న్ చేయాలనుకుంటున్నారో కారణం తెలపవల్సి ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన వస్తువులను రిటర్న్ చేయటం ఏలా
కారణాన్ని సెలక్ట్ చేసుకున్న తరువాత క్రింద కనిపించే కామెంట్ బాక్సులో మీరు ఆ వస్తువును ఎందుకు రిటర్న్ చేయాలనుకుంటున్నారో లిఖిత పూర్వకంగా తెలపండి.

ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన వస్తువులను రిటర్న్ చేయటం ఏలా
ఆ క్రింద కనిపించే Request Return మెనూలో request a new pieceను సెలక్ట్ చేసుకుని క్రింద కనిపించే REQUEST RETURN బటన్ పై క్లిక్ చేయండి.

ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన వస్తువులను రిటర్న్ చేయటం ఏలా
అంతే, మీ రిటర్న్‌ను ధృవీకరించేందుకు ఫ్లిప్‌కార్ట్ సిబ్బంది మీకు కాల్ చేస్తారు. వాళ్లు సూచనలను అనసురించి మీ వస్తువును విజయవంతంగా రిటర్న్ చేయండి.

ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన వస్తువులను రిటర్న్ చేయటం ఏలా
రీప్లేస్‌మెంట్ వస్తువు మీకు అందేంత వరకు మీ మెయిల్‌కు ఫోలోఅప్ అప్‌డేట్‌లు వస్తూనే ఉంటాయి.

Click it and Unblock the Notifications