మీ పీసీకి టైం సెట్ చేయవచ్చు!
మీకు కావల్సిన సమయంలో పీసీ షట్ డౌన్, రీస్టార్ట్ చేసుకోవచ్చు.
మనలో చాలా మంది కంప్యూటర్లను మ్యానువల్ గా షట్ డౌన్ చేస్తారు. మీరు కావాలనుకున్నట్లుగా స్పెసిఫిక్ టైంలో షట్ డౌన్ చేసినా లేదా ...లేదా రీస్టార్ట్ చేయడానికి టాస్క్ షెడ్యూలర్ అనే ఒక ఆప్షన్ను ఉపయోగించవచ్చు. విండోస్ MacOSమరియు Linuxలతో సహా చాలా ఫ్లాట్ ఫాంలు షెడ్యూల్ చేసిన బూట్-అప్స్, షట్ -డౌన్లతోపాటు వేక్ -అప్స్ చేయడానికి అనుమతిస్తాయి.

విండోస్....
విండోస్ OS ద్వారా మీరు టాస్క్ షెడ్యూలర్ ద్వారా బూట్-అప్, షట్ డౌన్ టైమ్స్ ను సెట్ చేయవచ్చు. మీ కంప్యూటర్ స్లీప్, షట్ డౌన్ , రీస్టార్ట్ చేయడానికి మీరు కమాండ్ చేయడం ద్వారా కూడా దీన్ని చేయవచ్చు.
షట్ డౌన్ : షట్ డౌన్ exe-s-t 00
హైబర్ నెట్ : rundll32.ex powerprof.dll,setsupendstate
స్లీప్: rundll32.ex powerprof.dll,setsuspendstate 0,1 0

మీరు టాస్క్ షెడ్యూలర్ ద్వారా దీన్ని చేయాలనుకున్నట్లయితే....
స్టెప్ 1: స్టార్ట్ మెనూ క్లిక్ చేసి task scheduler అని టైప్ చేసి సెలక్ట్ చేసుకోండి.
స్టెప్ 2: రైట్ సైడ్ ఉన్న క్రియేట్ టాస్క్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక పేరుతో సెలక్ట్ చేసుకుని హైయెస్ట్ ప్రివిలైజ్ తో రన్ చేయి చెక్ చేయండి. యూజర్ లాగిన్ లేదా లాగవుట్ చెక్ చేయండి
స్టెప్ 3: ఇప్పుడు సెట్టింట్స్ ట్యాప్ కు వెళ్లండి. దీని కంటే ఎక్కువ సమయం పూర్తయితే...వర్క్ ను ఆపండి. 1గంట సెట్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీ కంప్యూటర్ పనిని ఇంకా చేసుకునే అవకాశం ఉందని ఊహిస్తుంది.
స్టెప్ 4: ఇప్పుడు యాక్షన్స్ ట్యాబ్ కు వెళ్లి..న్యూ క్లిక్ చేయండి. మీ టాస్క్ ప్రొగ్రామ్ను స్టార్ట్ చేయండి అనే ఆప్షన్ను సెలక్ట్ చేయండి. దీంతో ప్రోగ్రాం షట్ డౌన్ తోపాటు ఆర్య్గూమెంట్స్ -Sకు సెట్ చేయండి.
స్టెప్ 5: ట్రిగ్గర్స్ ట్యాబ్ క్లిక్ చేసి న్యూ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ టైమింగ్ ను బట్టి షెడ్యూల్ను మార్చండి. (ఉదాహరణకు డైలీ 12:00AM) అని క్లిక్ చేయండి.

Mac OS X...
Mac OS గురించి చర్చించినట్లయితే...మీరు సిస్టమ్ ఫెర్ఫామెన్స్ కు వెళ్లి ఎనర్జి సేవర్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు ఎనర్జీ సేవర్ ఫెర్ఫామెన్స్ కిందున్న షెడ్యూల్ బటన్ను క్లిక్ చేయండి.
మీ మాక్ కోసం స్టార్ట్ అప్ లేదా రీస్టార్ట్ షెడ్యూల్ చేయడానికి కొన్ని ఆప్షన్స్ ఉపయోగించండి.దీంతో మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. మీ షెడ్యూల్ ప్రకారం షట్ డౌన్ చేసుకోవచ్చు. అంతేకాదు రీస్టార్ట్, వేక్ అప్ తో పాటు మరిన్ని ఫెర్పామెన్స్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

Linux..
ఇది Linuxకు వచ్చినప్పుడు rtcwake అనే కమాండ్ యూజర్ లైన్ బాక్స్ లో వెక్ అప్స్ షెడ్యూల్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ కమాండ్ మీ కంప్యూటర్ను స్లీమ్ మోడ్ లో ఉంచుతుంది. హైబర్నేట్ చేయడంతోపాటు మళ్లీ వేక్ అప్ చేయాల్సిన సమయాన్ని నిర్దేశిస్తుంది.


Click it and Unblock the Notifications








