Home
How to

Firefox Sendతో ఫైల్ ట్రాన్స్‌ఫర్ మరింత సులువు

ఉచిత సాఫ్ట్‌వేర్ కమ్యూనిటీ 'మొజిల్లా’, Firefox Send పేరుతో సరికొత్త ఫైల్ షేరింగ్ సర్వీసును ఇంటర్నెట్‌లో లాంచ్ చేసింది.

By Bommu Sivanjaneyulu

ఉచిత సాఫ్ట్‌వేర్ కమ్యూనిటీ 'మొజిల్లా’, Firefox Send పేరుతో సరికొత్త ఫైల్ షేరింగ్ సర్వీసును ఇంటర్నెట్‌లో లాంచ్ చేసింది. ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ అభివృద్ది చేయబడిన ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా 1జీబి వరకు ఫైల్‌ను షేర్ చేసుకునే వీలుంటుంది. send.firefox.com వెబ్‌సైట్ నుంచి షేర్ చేసే ప్రతి లింక్ పూర్తిగా ఎన్‌క్రిప్ట్ కాబడి ఉంటుంది.

How to Securely Send Large Files to Anyone With Firefox

ఫైర్‌ఫాక్స్ సెండ్ ద్వారా పంపే ఫైల్ లింక్‌ను అవతలి వ్యక్తి రిసీవ్ చేసుకుని డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే లింక్ ఆటోమెటిక్‌గా డిలీట్ అయి పోతుంది.

Firefox Send అంటే ఏంటి..?

Firefox Send అంటే ఏంటి..?

ఫైర్‌ఫాక్స్ సెండ్ అనేది సెక్యూర్డ్ ఫైల్ షేరింగ్ సర్వీస్. ఈ సర్వీస్ ద్వారా ఫైల్స్‌ను చాలా స్పీడుగా, రహస్యంగా షేర్ చేసుకునే వీలుంటుంది. 1జీబి లోపు ఫైల్స్‌ను మాత్రమే ఫైర్‌ఫాక్స్ సెండ్ ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతుంది.

ప్రతి ఫైల్ పూర్తిగా ఎన్‌క్రిప్ట్ కాబడి ఉంటుంది. ఫైర్‌ఫాక్స్ సెండ్ వెబ్‌సైట్‌లో యూజర్ అప్‌లోడ్ చేసే ఫైల్‌కు సంబంధించి ఓ యూనిక్ షేరింగ్ లింక్ జనరేట్ అవుతుంది. ఈ లింక్ 24 గంటల మాత్రమే పనిచేస్తుంది. ఆ తరువాత ఆటోమెటిక్‌గా డిలీట్ కాబడుతుంది.

 Firefox Send ఎలా పని చేస్తుంది..?

Firefox Send ఎలా పని చేస్తుంది..?

send.firefox.comలో యూజర్ అప్‌లోడ్ చేసే అన్ని ఫైల్స్‌ ముందుగా ఫైర్‌ఫాక్స్ సెండర్ సర్వర్‌లోకి వెళతాయి. ఇక్కడ ఆ ఫైల్స్ పూర్తిగా ఎన్‌క్రిప్ట్ కాబడి, డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుగా యూనిక్ షేరింగ్ లింక్స్‌ రూపంలో కన్వర్ట్ కాబడతాయి. ఈ విధంగా జనరేట్ అయ్యే లింకును యూజర్ కాపీ చేసుకుని అవతలి వ్యక్తికి పంపాల్సి ఉంటుంది.

లింక్ అవతలి వ్యక్తికి చేరిన వెంటనే, ఆ లింక్‌లోని ఫైల్ ఆటోమెటిక్ డీక్రిప్ట్ కాబడుతుంది. దీంతో లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఫైల్ ఒరిజినల్ కంటంట్ డౌన్‌లోడింగ్‌కు సిద్ధంగా ఉంటుంది. ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే ఫైర్‌ఫాక్స్ సెండర్ ఆ లింక్‌ను డిలీట్ చేసేస్తుంది.

Firefox Sendను ఉపయోగంచుకోవటం ఎలా..?

Firefox Sendను ఉపయోగంచుకోవటం ఎలా..?

ముందుగా send.firefox.comలోకి వెళ్లండి. ఈ వెబ్‌సైట్ ఏ బ్రౌజర్‌లోనైనా వర్క్ అవుతుంది. వెబ్‌సైట్ ఓపెన్ అయిన తరువాత ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్న ఫైల్‌ను అందులో అప్‌లోడ్ చేయండి. దీంతో ఫైల్ ఆటోమెటిక్‌గా ఎన్‌క్రిప్ట్ కాబడి అప్‌లోడింగ్ పూర్తి అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తరువాత, మీరు అప్‌లోడ్ చేసిన ఫైల్‌కు సంబంధించి యూనిక్ షేరింగ్ లింక్ ఒకటి జనరేట్ అవుతుంది. ఈ లింక్‌నే మీరు అవతలి వ్యక్తికి పంపాల్సి ఉంటుంది. పంపిన లింక్ 24 గంటల తరువాత Expire కాబడుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్‌ను కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఫైర్‌ఫాక్స్ సెండ్ సర్వీసును ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
How to Securely Send Large Files to Anyone With Firefox Send. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X