మీ కంప్యూటర్‌లోని ఫోల్డర్‌లకు వివిధ రంగులను సెట్ చేయటం ఏలా..?
సాధారణంగా మన పీసీలో ఫైళ్లను భద్రపరుచుకునే ‘ఫోల్డర్' కొన్ని సంవత్సరాల కాలంగా పసుపురంగులోనే కనిపిస్తోంది. ఫోల్డర్‌లకు సంబంధించి పరిమాణం ఇంకా ఆకారంలో మార్పులు వచ్చినప్పటికి రంగులో మాత్రం ఏ మార్పు రాలేదు. పీసీలో కనిపించే వందల ఫోల్డర్లు ఒకే రంగును కలిగి ఉండటంతో ముఖ్యమైన ఫోల్డర్‌ను వెతికిపట్టుకోవటం చాలా కష్టమవుతోంది.

ఈ పరిస్థితుల్లో ఫోల్డర్ ఐకాన్‌లకు వివిధ రంగులను ఎంచుకునే వెలసబాటును కల్పించినట్లయితే వెతుక్కునే బెడద తప్పుతుంది. ఇదే తరహా సౌలభ్యత విండోస్ ఆధారిత పీసీలకు అందుబాటులోకి వచ్చింది. ఫోల్డర్ కలరైజర్ (Folder Colorizer) అనే అప్లికేషన్‌ను విండోస్ పీసీలో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా ఫోల్డర్ ఐకాన్‌లకు వివిధ రంగులను సెట్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్:
కెమెరా పోయిందా వెతికిపట్టుకుందాం రండి!!!
విహారానికి వెళ్లిన సమయంలో మీ కెమెరా చోరీకి గురైందా..?, ఎన్ని ప్రయత్నాలు చేసినా కెమెరా జాడ తెలియరాలేదా..?, మీ కెమెరాను దొంగిలించిన వ్యక్తి అదే కెమెరాతో ఫోటోలను చిత్రీకరించి ఆన్‌లైన్‌లో పెట్టినట్లయితే మీకు దొరికిపోయినట్లే. అది ఏలానో.. మేం తెలపబోయే స్మార్ట్ చిట్కా ద్వారా తెలసుకోండి. స్టోలెన్ కెమెరా ఫైండర్ అనే ఆన్‌లైన్ అప్లికేషన్ కెమెరా జాడను కనుగొనటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ‘EXIF' డేటా సాయంతో ఈ అప్లికేషన్ మీ కెమెరా జాడను పసిగట్టగలదు.


Click it and Unblock the Notifications