Home
How to

Google Tez ద్వారా డబ్బులు పంపడం ఎలా..?

By Bommu Sivanjaneyulu

డిజిటైజేషన్ వైపు ప్రపంచం పరుగులు తీస్తోంది. భారత్ వంటి అభివృద్ది చెందుతోన్న దేశాల్లో దీని ప్రభావం మరింత ఎక్కువుగా కనిపిస్తోంది. నోట్ల రద్దు అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, నగదురహిత లావాదేవీలకు మరింత ఊతమిచ్చినట్లయింది. వాస్తవానికి నోట్ల రద్దు ముందు వరకు మొబైల్ డిజిటల్ పేమెంట్స్ యాప్స్ గురించి చాలా మందికి తెలియదు.

How to set up and make payments with Google Tez?

ఒకవేళ తెలిసినా వాటిని అంతగా ఉపయోగించుకునేవారు కాదు. కరెన్సీ కష్టాలు మొదలైన మరుక్షణం నుంచి ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్స్ వైపు అడుగులు వేయవల్సి వచ్చింది. దీంతో ఈ విధమైన పేమెంట్ సర్వీసులకు ఊహించని రీతిలో ఆదరణ పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన సరికొత్త మొబైల్ పేమెంట్ సర్వీస్ తేజ్ (Tez)ను ఇటీవల భారత్‌లో లాంచ్ చేసింది. ఈ UPI ఆధారిత పేమెంట్స్ అప్లికేషన్‌లో అనేక ఆసక్తికర ఫీచర్లు ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు Google Tez యాప్‌ను ట్రై చేయినట్లయితే, ఈ కధనం ద్వారా యాప్ వినియోగం గురించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

మందుగా ఇనీషియల్ సెటప్ ప్రాసెస్...

మందుగా ఇనీషియల్ సెటప్ ప్రాసెస్...

స్టెప్ 1 : ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి Google Tez యాప్‌ను, మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీరు యాపిల్ ఐఫోన్‌ను వినియోగిస్తున్నట్లయితే ఐఓఎస్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను పొందవల్సి ఉంటుంది.

స్టెప్ 2 : Google Tez యాప్‌ మీ ఫోన్‌లో విజయవంతంగా ఇన్‌స్టాల్ అయిన తరవాత యాప్‌ను ఓపెన్ చేసి ముందుగా భాషను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ ఆప్షన్‌ను కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. భాషను ఎంపిక చేసుకున్న తరువాత టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే Arrow మార్క్ పై టాప్ చేసినట్లయితే తరువాతి మెనూలోకి వెళతారు.

స్టెప్ 3 : ఈ మెనూలో మీ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటంది. (ముఖ్య గమనిక : మీరు ఎంటర్ చేసే మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయి ఉండాలి).

స్టెప్ 4 : తరువాతి స్టెప్‌లో భాగంగా Tez యాప్‌‌తో లింక్ చేయవల్సిన గూగుల్ అకౌంట్ తాలుకా వివరాలకు యాప్ అడుగుతుంది. మీ గూగుల్ అకౌంట్‌ను లింక్ చేసి యాప్ రిక్వెస్ట్‌లకు యాక్సెస్ ఇచ్చినట్లయితే OTP వెరిఫికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది.

స్టెప్ 5 : OTP వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి అయిన తరువాత Google Tez యాప్‌ సెక్యూరిటీకి సంబంధించి డివైస్ లాక్ లేదా సపరేట్ గూగుల్ పిన్‌ను క్రియేట్ చేసుకోవల్సి ఉంటుంది. దీంతో యాప్‌కు సంబంధించిన ఇనీషియల్ సెటప్ ప్రాసెస్ పూర్తవుతుంది.

Google Tez యాప్‌కు బ్యాంక్ అకౌంట్‌ను యాడ్ చేయటం ఎలా..?

Google Tez యాప్‌కు బ్యాంక్ అకౌంట్‌ను యాడ్ చేయటం ఎలా..?

స్టెప్ 1 : Google Tez యాప్‌కు సంబంధించి ఇనీషియల్ సెటప్ ప్రాసెస్ విజయంతంగా పూర్తి అయిన తరువాత, యూజర్ ప్రొఫైల్ నేమ్ క్రింద 'Add Bank Account' అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది.

స్టెప్ 2 : Google Tez యాప్‌ భారత్‌లోని అన్ని ప్రముఖ బ్యాంక్‌లను సపోర్ట్ చేస్తుంది. వాటిలో మీ బ్యాంక్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే, మీరిచ్చిన మొబైల్ నెంబర్ నుంచి, ఆ బ్యాంక్ స్టాండర్డ్ ఆపరేటర్‌కు ఓ వెరిఫికేషన్ ఎస్ఎంఎస్ పంపబడుతుంది. ఆ మొబైల్ నెంబర్‌తో మీ అకౌంట్ లింక్ అయి ఉన్నట్లయితే ఆ వివరాలు వెంటనే యాప్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతాయి.

స్టెప్ 3 : తరువాతి స్టెప్‌లో భాగంగా మీ బ్యాంక్ అకౌంట్ తాలుకూ UPI IDని ఎంటర్ చేయమని యాప్ అడుగుతుంది. మీరు గతంలోనే UPI IDని కలిగి ఉన్నట్లయితే మళ్లీ అదే ఐడీని వెరిఫికేషన్ నిమిత్తం ఎంటర్ చేయవల్సి ఉంటుంది. 'Enter UPI PIN' ఆప్షన్ పై టాప్ చేసి 4-అంకెల పిన్‌ను ఎంటర్ చేసినట్లయితే, ఆ UPI IDతో లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ యాప్‌లో యాడ్ అవుతుంది.

స్టెప్ 4 : ఒకవేళ మీ వద్ద UPI ID అందుబాటులో లేనట్లయితే కొత్తది క్రియేట్ చేసుకోవటం చాలా సులువు. యూపీఐ ఐడీని క్రియేట్ చేసుకునేందుకు స్టెప్ 2లో కనిపించే bank and mobile number ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని 'Proceed' బటన్ పై టాప్ చేయవల్సి ఉంటుంది.

స్టెప్ 5 : ఇక్కడ మీ నెంబర్‌తో లింక్ అయి ఉన్న డెబిట్ కార్డ్ వివరాలను ఎంటర్ చేసినట్లయితే వెరిఫికేషన్ నిమిత్తం ఓ OTP మీకు అందుతుంది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత మీకు నచ్చిన 4-అంకెల UPI పిన్‌ను సెట్ చేసుకునే వీలుంటుంది. ఆ తరువాత నుంచి Google Tez యాప్‌ ద్వారా విజయవంతగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.

Google Tez యాప్ అనేక రకాల నగదు లావాదేవీలను అనుమతిస్తోంది. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

అకౌంట్ నెంబర్ ఆధారిత నగదు లావాదేవీలు..

అకౌంట్ నెంబర్ ఆధారిత నగదు లావాదేవీలు..

Google Tez యాప్ ద్వారా అకౌంట్ నెంబర్ ఆధారిత నగదు లావాదేవీలను నిర్వహించుకునే వీలుంటుంది. ఈ విధమైన లావాదేవీలను నిర్వహించుకోవాలనుకునే వారు యాప్‌లోని పేమెంట్స్ సెక్షన్‌లోని 'Account Number' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని అందులో రిసిప్టెంట్ పేరు, వారి అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ వివరాలతో పాటు పంపాల్సిన నగదును ఎంటర్ చేసి ప్రొసీడ్ బటన్ పై ప్రెస్ చేసినట్లయితే మీ బ్యాంక్ UPI PINను అడుగుతుంది. ఈ నాలుగు అంకెలు పిన్‌ను ఎంటర్ చేసినట్లయితే నగదు బదిలి విజయవంతంగా పూర్తవుతుంది.

యూపీఐ ఐడీ (UPI ID)

యూపీఐ ఐడీ (UPI ID)

Google Tez యాప్ ద్వారా UPI ID ఆధారిత నగదు లావాదేవీలను నిర్వహించుకునే వీలుంటుంది. ఈ విధమైన లావాదేవీలను నిర్వహించుకునే సమయంలో నగదు చేరాలనుకుంటున్న వ్యక్తికి సంబంధించి UPI ID చాలా కీలకం. ఈ ఐడీ ద్వారానే నగదు ట్రాన్స్‌ఫర్ అనేది జరుగుతుంది.

క్యూఆర్ కోడ్ (QR Code)

క్యూఆర్ కోడ్ (QR Code)

Google Tez యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత నగదు లావాదేవీలను నిర్వహించుకునే వీలుంటుంది. రిసిప్టెంట్‌కు సంబంధించిన QR Codeను స్కాన్ చేయటం ద్వారా నగదు బదిలీ చేసే వీలుంటుంది. 'Scan QR Code' ఆప్షన్‌లోకి వెళ్లాలంటే యాప్ మెయిన్ స్ర్కీన్‌లోని three dot మెనూ పై టాప్ చేయాల్సి ఉంటుంది.

ఫోన్ నెంబర్ (Phone)

ఫోన్ నెంబర్ (Phone)

Google Tez యాప్ ద్వారా ఫోన్ నెంబర్ ఆధారిత నగదు లావాదేవీలను కూడా నిర్వహించుకోవచ్చు. ఈ విధమైన నగదు లావాదేవీలు విజయవంతంగా పూర్తవ్వాలంటే నగదు రిసీవ్ చేసుకునే అవతలి వ్యక్తి కూడా యక్టివ్ Google Tez యూజర్ అయి ఉండాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
How to set up and make payments with Google Tez?. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X