వెనక్కి తగ్గిన వాట్సాప్, మళ్లీ అందుబాటులోకి old status సదుపాయం

వాట్సాప్ అకౌంట్‌లలోని వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే క్రమంలో రకరకాల పద్ధతులను హ్యాకర్లు ఉపయోగిస్తున్నారు. వాటి నుంచి మిమ్మల్ని జాగృతపరుస్తూ చేస్తూ ఈ కథనం..

|

వినియోగదారుల నుంచి వ్యక్తమైన తీవ్ర నిరసనల నేపథ్యంలో వాట్సాప్ తన old status ఫీచర్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చింది. నిత్యం కొత్త అప్‌డేట్‌లతో దూసుకుపోతున్న వాట్సాప్ కొద్ది నెలల క్రితమే తన text-based 'Status' featureను నిలిపి వేసి, దాని స్థానంలో సరికొత్త ఫోటో ఇంకా వీడియో ఆధారిత స్టేటస్ ఫీచర్‌ను వాట్సాప్ లాంచ్ చేసింది. ఈ స్టేటస్ ఫీచర్ అంతగా ఉపయోగకరంగా లేకపోవటంతో వాట్సాప్ కు ప్రపంచవ్యాప్తంగా ఫిర్యాదులు అందాయి.

 
How to set up the new Status feature on WhatsApp

దీని పై పునరాలోచించిన వాట్సాప్ తిరిగి టెక్స్ట్ బేసిడ్ స్టేటస్ ఫీచర్‌ను మార్కెట్లో రీఇంట్రడ్యూస్ చేసింది. టెక్స్ట్ బేసిడ్ స్టేటస్ ఫీచర్‌లో భాగంగా ప్రొఫైల్ పిక్షర్ మార్చిన ప్రతిసారి స్టేటస్‌ను అప్‌డేట్ చేసుకునే సదుపాయం ఉంటుంది. బిజీగా ఉన్నామనో, అందుబాటులో ఉన్నామనో లేకుంటే మనకు నచ్చిన వాక్యాలను స్టేటస్ క్రింద పెట్టుకునే వీలుంటుంది.

 

కొత్తగా తీసుకువచ్చిన స్టేటస్ అప్‌డేట్ ఫీచర్‌లో భాగంగా స్టేటస్ కాస్తా హోమ్ స్ర్కీన్ మీదకు వచ్చిచేరింది. ఈ కొత్త ఫీచర్‌లో భాగంగా యూజర్ పెట్టిన ఫోటో లేదా వీడియో స్టేటస్ 24 గంటల తరువాత ఆటోమెటిక్‌గా మాయమైపోతుంది. దీంతో ఈ స్టేటస్ ఫీచర్ చాలామందికి నచ్చలేదు.

ఈ నేపధ్యంలో పాత ఫీచర్ ను కూడా వాట్సాప్ తిరిగి అందుబాటులోకి తీసుకురావల్సి వచ్చింది. టెక్స్ట్ బేసిడ్ స్టేటస్ ఫీచర్‌ ను తిరిగి పొందాలనుకునే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు వాట్సాప్ 2.17.107 వర్షన్ కు అప్ గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది.

వాట్సాప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన చైనావాట్సాప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన చైనా

ఆండ్రాయిడ్ యూజర్లు టెక్స్ట్ బేసిడ్ స్టేటస్ ఫీచర్‌‌ను ఫోన్‌లో సెటప్ చేసుకునేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

స్టెప్ 1

యాప్ ఓపెన్ చేసిన తరువాత టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే three-dot icon పై క్లిక్ చేసినట్లయితే సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది.

స్టెప్ 2

సెట్టింగ్స్‌లోకి వెళ్లిన తరువాత ప్రొఫైల్ పిక్షర్ పై టాప్ ఇచ్చినట్లయితే ప్రొఫైల్ పిక్షర్ క్రింద 'About and phone number' అనే ఆప్షన్ కనిపిస్తుంది.

స్టెప్ 3

ఈ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే text message టాబ్ కనిపిస్తుంది. ఈ టాబ్ పక్కన కనిపించే పెన్సిల్ ఐకాన్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన స్టేటస్ మెసేజ్‌ను టైప్ చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్‌లో మాదిరిగానే ఇక పై వాట్సాప్‌లో కూడా 'coloured status' అనుభూతులను మనం ఆస్వాదించవచ్చు. ప్రస్తుతానికి బేటా దశలో ఉన్నఈ ఫీచర్ త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతోంది. ఫైనల్ వర్షన్‌లోకి ఈ Coloured Text Status సదుపాయాన్ని తీసుకురావటం ద్వారా వాట్సాప్ యూజర్లు తన స్టేటస్ అప్‌డేట్‌లను రంగురంగుల ఫాంట్లతో పోస్ట్ చేసే వీలుంటుంది.

స్టేటస్ ట్యాబ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ పెన్సిల్ ఐకాన్ పై క్లిక్ చేయటం ద్వారా Coloured Text స్టేటస్‌ను సెట్ చేసుకునే వీలుంటుంది. ఈ ఐకాన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా నచ్చిన ఫాంట్లను ఎంపిక చేసుకోవటంతో పాటు emojis అలానే బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ను సెలక్ట్ చేసుకునే వీలుంటుంది. కలర్ డిజైనింగ్ పూర్తి అయిన తరువాత బోటమ్ రైట్‌లో కనిపించే Green Arrow Button పై క్లిక్ చేసినట్లయితే ఆ స్టేటస్ అప్‌డేట్‌ను అన్ని కాంటాక్ట్స్‌కు పోస్ట్ చేసే వీలుంటుంది.

Best Mobiles in India

English summary
Miss old status in WhatsApp? Here's how to set it up in new WhatsApp. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X