మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో మల్టిపుల్ ఫేస్‌బుక్ ఆకౌంట్‌లను ఓపెన్ చేయటమేలా..?

Posted By:

ఉత్తమ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంగా గుర్తింపు తెచ్చుకున్న ఆండ్రాయిడ్ లక్షలాది అప్లికేష న్‌లను సపోర్ట్ చేయటమే కాదు బెస్ట్ ఫీచర్లతో కూడిన యూజర్ ఫ్రెండ్లీ మొబైలింగ్‌ను చేరువచేస్తుంది. మొబైల్ ద్వారా ఫేస్‌బుక్ చాటింగ్ థ్రిల్లింగ్ అనిపిస్తుంది. నేటి హౌటూ శీర్షికలో భాగంగా ఒకే ఆండ్రాయిడ్ మొబైల్‌లో రెండు వేరు‌వేరు ఫేస్‌బుక్ అకౌంట్‌లను ఓపెన్ చేసుకునేందుకు ఓ ఆండ్రాయిడ్ అప్లికేషన్ దోహద పడుతుంది. ఆ అప్లికేషన్ వివరాలతో పాటు ఇన్సస్టాలేషన్ విధానాన్ని మీ ముందుంచుతున్నాం.

- ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘ఫ్రెండ్‌కాస్టర్ ఫర్ ఫేస్‌బుక్' అనే అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆండ్రాయిడ్ డివైజ్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవాలి.
- ఇన్స్‌స్టాలేషన్ ప్రక్రియ విజయవంతమైన తరువాత ‘యాడ్ అకౌంట్' అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఫేస్‌బుక్ యూజర్ ఐడీ అలానే పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేయాలి.
- తరువాత వచ్చే గ్రాంట్ పర్మిషన్ ఆప్షన్‌ను ఓకే చేసినట్లయితే ఫ్రెండ్‌కాస్టర్ అప్లికేషన్ ద్వారా ఫేస్‌బుక్ సేవలను నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు.
- ఇలా ఒక అకౌంట్‌ను విజయవంతంగా జత చేసిన తరువాత మళ్లి ‘యాడ్ అకౌంట్' ఆప్షన్ పై క్లిక్ చేసి వేరొక ఫేస్‌బుక్ అకౌంట్‌ను జత చేసుకోవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో మల్టిపుల్ ఫేస్‌బుక్ ఆకౌంట్‌లను ఓపెన్ చేయటమేలా..?

ఫ్రెండ్ కాస్టర్ ఫర్‌ ఫేస్‌బుక్ అప్లికేషన్ ప్రత్యేకతలు:

ఏకకాలంలో రెండు ఫేస్‌బుక్ ఆకౌంట్‌లను ఓపెన్ చేసుకోవచ్చు. ఫోటోలు, సందేశాలు ఇంకా స్టేటస్ అప్ డేట్‌లను సౌకర్యవంతంగా నిర్వహించుకోవచ్చు . ఈ అప్లికేషన్ ఫేస్‌బుక్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌తో పోలిస్తే వేగవంతంగా స్పందిస్తుంది. నోటిఫికేషన్ బార్ పై తక్షణ ప్రకటన. ఆకర్షణీయమైన కస్టమైజబుల్ తీమ్స్. దఆండ్రాయడ్ పోర్టల్ డాట్ కామ్‌చే సిఫార్స్ చేయబడిన అప్లికేషన్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot