ఫేస్ బుక్ సరికొత్త ఫీచర్ స్నూజ్!

Posted By: Madhavi Lagishetty

మీరు ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేయగానే..అవసరంలేని పోస్టులు మీ టైంలైన్లో నిండిపోతున్నాయా? పోస్టులను హైడ్ చేయలేక...వారిని అన్ ఫ్రెండ్ చేయలేక సతమతం అవుతున్నారా. అయితే మీకో గుడ్ న్యూస్. ఈ సమస్యకు పరిష్కారం ఫేస్ బుక్ యొక్క స్నూజ్ బటన్ను ఉపయోగించి....చిరాకు పెడుతున్న వ్యక్తులను వదిలించుకోవచ్చు.

ఫేస్ బుక్ సరికొత్త ఫీచర్ స్నూజ్!

ఫేస్ బుక్ ఈమధ్యే స్నూజ్ అనే ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా ఫ్రెండ్స్, పేజీలు, గ్రూప్స్ ను తాత్కాలికంగా మ్యూట్ చేయవచ్చు. ఈ ఫీచర్లో 30రోజుల వరకు పోస్టులను కనిపించకుండా ఆపేందుకు బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. 30రోజులు దాటిన తర్వాత...ఆటోమెటిగ్గా సాధారణ స్థితికి వెళ్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్ బుక్ స్నూజ్ ఫీచర్ను ఎలా ఉపయోగించాలి?

స్నూజ్ బటన్ను ద్వారా ఫేస్ బుక్ అకౌంట్లో కనిపించే న్యూస్ ఫీడ్ ఉంటుంది. అందులో మనం ఫ్రెండ్స్ కు సంబంధించిన ఫాలో పేజీలు, గ్రూపుల నుంచి వస్తున్న పోస్టులు ఎన్నో ఉంటాయి. వీటితో మన టైంలైన్ అంతా కూడా పోస్టులతోనే నిండిపోతుంది. అయితే మీరు మీ ఫ్రెండ్ లేదా...పేజీ నుంచి ఒక పోస్ట్ చూసినప్పుడు...మీరు చేయాల్సిందల్లా పోస్ట్ యొక్క రైట్ సైడ్ కనిపించే మూడ్ చుక్కలపై క్లిక్ చేయండి. ఇప్పుడు డ్రాప్ డౌన్ మెను ఓపెన్ అవుతుంది.

ఇప్పుడు స్నూజ్ ఫర్ 30డేస్ బటన్ను చూస్తారు. దీంతో స్నూజ్ పీరియడ్ను యాక్టివేట్ చేయడానికి బటన్ పై క్లిక్ చేయండి. దీంతో 30రోజుల పాటు స్నూజ్ కొనసాగుతుంది. దీంతో మీ ఫ్రెండ్స్ నుంచి లేదా పేజీల నుంచి ఎలాంటి కొత్త వార్తలను చూడలేరు.

స్నూజ్ బటన్ను ఎందుకు హిట్ చేయాలి.

మీరు పేజీని అన్ ఫాలో చేసినప్పుడు...మీరు ఆ పేజిని చూడలేరు. మీరు ఫాలో కావద్దని అనుకున్నప్పుడు లేదా...ఫ్రెండ్ గా ఉండాలనుకున్నప్పుడు కూడా ఇలా చేయవచ్చు. అభ్యంతరకమైన పోస్టులనుంచి తప్పించుకోవచ్చు. దీనికి బెస్ట్ ఆప్షన్ స్నూజ్. దీంతో మీకు ఎలాంటి పోస్టులు వచ్చే అవకాశం ఉండదు.

Wrap up

ఆప్షన్ ద్వారా తక్కువ పోస్టులను చూసే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ మంది కోసం ఫేస్ బుకు ఈ ఆప్షన్ పనిచేయలేదు. తక్కువ పదాలతో గందరగోళమైన అర్థం కలిగి ఉంది. అలాంటి అస్పష్టతను తొలగించేందుకు ఫేస్ బుక్ స్నూజ్ అనే ఐడియాతో ముందుకు వచ్చింది.

ప్రమాదంలో ఎలాన్ మస్క్ రాకెట్ కారు, ప్రయోగం విజయవంతమైన రెండో రోజే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Are you tired of a friend who can’t just stop posting about his new car or his fancy vacation? Do you want to get rid of it? If yes, then there is good news for you. You can get rid of this frustration by using the Snooze button of Facebook.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot