మీ ఫోన్‌లోని ఆండ్రాయిడ్ యాప్‌లను ఇతరులు యాక్సెస్ చేసుకోకుండా ఉండాలంటే..?

Posted By:

మిత్రులన్నాక స్మార్ట్‌ఫోన్‌లను షేర్ చేసుకోకుండా ఉండరు. కొంత మంది ఇతరుల ఫోన్‌‍లతో ఎంత వరకు ప్రవర్తించాలో అంతవరకే ప్రవర్తిస్తారు. కొందరు మాత్రం ఆ ఫోన్ మనది కాదని తెలిసినా ఆ ఫోన్‌లోని వ్యక్తగత డేటాను తెలుసుకోవాలన్న కుతూహలంతో యజమాని ప్రమేయం లేకుండానే ఫోన్‌ను మొత్తం జల్లెడపట్టేస్తారు. ఇలాంటి వాళ్లి చేతికి మన ఫోన్ ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

అంటే మన ఫోన్‌లోని ముఖ్యమైన ఫోల్డర్‌లు ఇంకా అప్లికేషన్‌లకు శక్తివంతమైన లాక్ వ్యవస్థ‌ను ఏర్పాటు చేసుకోవటం మంచిది. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని ముఖ్యమైన అప్లికేషన్‌లకు పాస్‌వర్డ్ లాక్‌ను ఏర్పాటు చేసేందుకు స్మార్ట్‌యాప్ లాక్ అత్యుత్తమమైనది. గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతోన్న ఈ యాప్‌ను మీరు కూడా ఓ సారి ట్రై చేసి చూడండి మరి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌యాప్ లాక్ ను ఫోన్ లో సెటప్ చేసుకోవాలంటే..?

ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి స్మార్ట్‌యాప్ లాక్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

 

స్మార్ట్‌యాప్ లాక్‌ను ఫోన్‌లో సెటప్ చేసుకోవాలంటే..?

యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న వెంటనే పాస్‌వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. డీఫాల్డ్ పాస్‌వర్డ్ 7777. యాప్‌ను ఓపెన్ చేసేందుకు ఈ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

స్మార్ట్‌యాప్ లాక్‌ను ఫోన్‌లో సెటప్ చేసుకోవాలంటే..?

ఇప్పుడు యాప్ లాక్ ట్యాబ్ మీకు కనిపస్తుంది. ట్యాబ్ క్రింద కనిపించే గ్రీన్ + బటన్‌ను టాప్ చేసి గోప్యంగా ఉంచాల్సిన అప్లికేషన్‌లను సెలక్ట్ చేసుకుని వాటిని పాస్‌వర్డ్‌తో లాక్‌డౌన్ చేయండి. ఒక్కొక్క యాప్‌ను జత చేసుకునేందుకు ADD బటన్‌ను టాప్ చేస్తుండండి,

 

స్మార్ట్‌యాప్ లాక్‌ను ఫోన్‌లో సెటప్ చేసుకోవాలంటే..?

ఫేక్ యాప్ క్రాస్ మెసేజ్‌ను ఎనేబుల్ చేసుకునేందకు ఫేక్ లేబుల్ బటన్‌ను ప్రెస్ చేయండి. ఈ ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకోవటం వల్ల ఇతరులు ఎవరైనా మీ ఫోన్‌లోని యాప్‌లను ఓపెన్ చేయాలని చూసినట్లయితే ఫేక్ యాప్ క్రాస్ మెసేజ్ స్ర్కీన్ పై డిస్‌ప్లే అవుతుంది.

స్మార్ట్‌యాప్ లాక్‌ను ఫోన్‌లో సెటప్ చేసుకోవాలంటే..?

యాప్ సెట్టింగ్స్ ట్యాబ్ ఎడమ వైపు స్వైప్ చేయండి.

స్మార్ట్‌యాప్ లాక్‌ను ఫోన్‌లో సెటప్ చేసుకోవాలంటే..?

Password & Pattern Settingsను టాప్ చేయండి.

స్మార్ట్‌యాప్ లాక్‌ను ఫోన్‌లో సెటప్ చేసుకోవాలంటే..?

పాస్‌వర్డ్ ఆప్సన్ పై టాప్ చేసి కొత్త న్యూమరిక్ కోడ్ ను సెట్ చేసుకోండి. లాక్ టైప్ విభాగంలోకి వెళ్లి లాక్‌ను మీరు కావల్సినట్టుగా మార్చుకోవచ్చు.

స్మార్ట్‌యాప్ లాక్‌ను ఫోన్‌లో సెటప్ చేసుకోవాలంటే..?

ముందుగా స్మార్ట్‌లాక్ యాప్‌ను ఓపెన్ చేసి సెట్టింగ్స్ విభాగంలోకి వెళ్లండి.

స్మార్ట్‌యాప్ లాక్‌ను ఫోన్‌లో సెటప్ చేసుకోవాలంటే..?

మల్టీపుల్ పాస్‌వర్డ్స్ ఆఫ్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

స్మార్ట్‌యాప్ లాక్‌ను ఫోన్‌లో సెటప్ చేసుకోవాలంటే..?

ఆ తరువాత Add Password ఆప్షన్‌ను టాప్ చేయండి. ఇక్కడ మీరు ఒక్క యాప్‌కు ఒక్కో రకమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Stop Others From Accessing Your Android Apps. Read more in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot