ఇవి పాటిస్తే తక్కువు వెళుతురులోనూ బెస్ట్ క్వాలిటీ ఫోటోస్ మీ సొంతం

|

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే ప్రతి ఒక్కరూ క్యాజువల్ ఫోటోగ్రాఫర్స్‌గా మారిపోతున్నారు. ఇందుకు కారణం బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లలోనూ ఓ మోస్తరు క్వాలిటీ పాయిండ్ షూట్ కెమెరా వ్యవస్థలను ఏర్పాటు చేస్తుండటమే. క్యాజువల్ ఫోటోగ్రఫీకి మాత్రమే ఉపయోగపడుతున్న స్మార్ట్‌ఫోన్ కెమెరాల నుంచి కొన్ని చిట్కాలను ప్రయోగించటం ద్వారా ప్రొఫెషనల్ గ్రేడ్ ఫోటోగ్రఫీని ఆస్వాదించవచ్చు. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా తక్కువు వెళుతురు కండీషన్స్‌లోనూ హై-క్వాలిటీ ఫోటోలను క్యాప్చుర్ చేసుకునేందుకు అవసరమైన టిప్స్ అండ్ ట్రిక్స్‌ను మీకు సూచించటం జరుగుతోంది..

 

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా గురించి తెలుసుకోండి..

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా గురించి తెలుసుకోండి..

స్మార్ట్‌ఫోన్ కెమెరా ద్వారా బెస్ట్ క్వాలిటీ ఫోటోలను క్యాప్చుర్ చేయాలనుకునే యూజర్లు ముందుగా తమ స్మార్ట్‌ఫోన్ కెమెరా పట్ల పూర్తి అవగాహనను కలిగి ఉండాలి. వాస్తవానికి ప్రతి స్మార్ట్‌ఫోన్ కెమెరాకు కొన్ని బలాలు, బలహీనతలు అనేవి ఉంటాయి. అవేంటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవల్సి ఉంటంది. ఇదే సమయంలో మీరు డ్యుయల్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నట్లయితే లెన్స్ పట్ల పూర్తి అవగాహనను ఏర్పరచుకోవాలి.

డ్యుయల్ కెమెరా సెటప్‌తో వచ్చే ఫోన్‌లలో ఒక కెమెరా లెన్స్ ఉండాల్సిన స్థానంలో రెండు కెమెరా లెన్సులు ఉంటాయి. వీటిలో ఒకటి ప్రైమరీ లెన్స్ కాకా, మరొకటి సెకండరీ లెన్స్. ఫోటోలను చిత్రీకరించుకునే సమయంలో ప్రైమరీ లెన్స్ మేజర్ లిఫ్టింగ్ పై దృష్టిసారిస్తే, సెకండరీ లెన్స్ అదనపు లైట్ ఇంకా ఫీల్డ్ డెప్త్ పై పనిచేస్తుంది. స్మార్ట్ ఫోన్ ఫోటోగ్రఫీ పై పట్టు సాధించాలనుకునే యూజర్లు ప్రతిసారి కెమెరా సెట్టింగ్‌లను కూడా చెక్ చేసుకోవల్సి ఉంటుంది.

ప్రో-మోడ్ పట్ల పూర్తి అవగాహన అవసరం..
 

ప్రో-మోడ్ పట్ల పూర్తి అవగాహన అవసరం..

తక్కువు వెళుతురులో క్వాలిటీ ఫోటోలను క్యాప్చుర్ చేయాలనుకునే వారు ముందుగా ప్రో-మోడ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వాస్తవానికి ప్రో-మోడ్ అనేది ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అవుతోన్న అన్ని స్మార్ట్‌ఫోన్‌లలోనూ అందుబాటులో ఉంటుంది. ఈ యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్ ద్వారా షట్టర్ స్పీడ్, ఐఎస్ఓ, వైట్ బ్యాలన్స్, మీటరింగ్ వంటి ముఖ్యమైన సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేసుకునే వీలుంటుంది. లో-లైట్‌లో ఫోటోలను క్యాప్చుర్ చేస్తున్నపుడు ఐఎస్ఓను 400-800 మధ్య, షట్టర్ స్పీడ్‌ను 1/5 లేదా 1 సెకనుకు అడ్జస్ట్ చేసుకుంటే మంచిది. వెళుతురు కొంచం ఉన్నట్లయితే షట్టర్ స్పీడ్ సెకనుకు 1/20 నుంచి 1/15 మధ్య ఉంటే సరిపోతుంది.

RAW మోడ్‌లో షూట్ చేయండి...

RAW మోడ్‌లో షూట్ చేయండి...

లో-లైట్ షాట్స్ క్యాప్చుర్ చేసుకునేటపుడు మీ స్మార్ట్‌ఫోన్‌లో RAW మోడ్ అందుబాటులో ఉన్నట్లయితే దానిని ఆన్ చేసుకోండి. వన్‌ప్లస్ 5టీ, హానర్ వ్యూ 10, గూగుల్ పిక్సల్ 2 వంటి స్మార్ట్‌ఫోన్‌లు పూర్తిస్థాయి RAW మోడ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. RAW మోడ్‌లో ఫోటోలను క్యాప్చుర్ చేయటం వల్ల పోస్ట్ ప్రొడక్షన్‌లో ఫోటో క్వాలిటీని మరింత మెరుగుపరుచుకునే వీలుంటుంది. RAW మోడ్‌లో ఫోటోను క్యాప్చుర్ చేసినపుడు ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ అనేది ఫోటోను ఏ మాత్రం ప్రాసెస్ చేయదు. దీంతో కావల్సిన విధంగా ఫోటోను ఎడిట్ చేసుకునే స్వేచ్చ ఉంటుంది.

Tripodను వినియోగించండి...

Tripodను వినియోగించండి...

తక్కువు వెళుతురు కండీషన్స్‌లో ఫోటోలను షూట్ చేసేటపుడు షట్టర్ స్పీడ్ స్లో మోషన్‌లో ఉంటుంది కాబట్టి ఎక్కువు సేపు హోల్డ్ చేయవల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో చెయ్యి వొణికే ప్రమాదం ఉంది. చెయ్యి వొణకటం వల్ల ఫోటో మొత్తం పూర్తిగా బ్లర్ అయి పోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే లో-లైట్‌లో ఫోటోలను క్యాప్చుర్ చేసేటపుడు Tripodను వినియోగించటం మంచిది. ఇలా చేయటం వల్ల ఫోటో బ్లర్ అయ్యేందుకు ఏమాత్రం ఆస్కారం ఉండదు.

జియోఫోన్లు ఎన్ని అమ్ముడుపోయాయి,మార్కెట్లో వాటి రిజల్ట్ ఏంటీ ?జియోఫోన్లు ఎన్ని అమ్ముడుపోయాయి,మార్కెట్లో వాటి రిజల్ట్ ఏంటీ ?

జూమ్ చేయకండి..

జూమ్ చేయకండి..

తక్కువు వెళుతురులో ఫోటోలను క్యాప్చుర్ చేస్తునపుడు జూమ్ ఫీచర్‌ను అస్సలు వాడకండి. జూమ్ చేయటం వల్ల ఫోటో క్లారిటీ పూర్తిగా దెబ్బతింటుంది. జూమ్ ఫీచర్‌ను ఉపయోగించుకునే బదులు ఫోటోను దగ్గర నుంచి క్యాప్చుర్ చేయటం ఉత్తమం.

Best Mobiles in India

English summary
How to take good photographs under low-light using your smartphone. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X