టెక్నాలజీ, అనేక రోగాల మయం..?

టెక్నాలజీ అన్ని రంగాలలోనూ విపరీతమైన వేగంతో ప్రవేశిస్తున్న కొద్దీ లాభాలతో పాటు నష్టాలు కూడా పెరిగిపోతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, టెక్నాలజీ వాడకంలో నియంత్రణ, విచక్షణ అనేవి ఎంతో ముఖ్యం. అవి లేకపోతే ప్రమాదాలు తప్పవు. టెక్నాలజీ మీద అతిగా ఆధారపడి పనిచేయడం వల్ల చేకూరే ప్రయోజనాల మాట అలా ఉంచితే, శారీరకంగా అనేక ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందిని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read More : Jio ఎందుకంత బెస్ట్..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విపరీతమైన ఒత్తిడి...

స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువుగా వినియోగించడం వల్ల మనిషి విపరీతమైన ఒత్తిడికి గురవుతాడని డాక్టర్లు చెబుతున్నారు. మీ ఫోన్ ఎప్పుడూ సైలెంట్ లో పెట్టుకుంటే ఈ బాధ నుంచి కాస్తైనా విముక్తి లభిస్తుందని వారంటున్నారు.

ఎన్నో రకాల బ్యాక్టీరియాలు..

ఫోన్ పై ఎన్నో రకాల బ్యాక్టీరియాలు వ్యాప్తి చెందుతుంటాయి. వాటివల్ల మనకు అనేర రోగాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ వ్యాధులు ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు తీసుకురావచ్చు. ఫోన్‌తో అలర్జీ భారీన పడి ఇప్పటికే చాలామంది డాక్టర్లను కూడా సంప్రదించారు.కాబట్టి, ఫోన్‌ను తాకినప్పుడు చేతులను శుభ్రంగా కడక్కువటం మంచది. అదే విధంగా ఫోన్‌ను చెవికి దగ్గరగా పెట్టుకోకుండా, స్పీకర్ ఆన్ చేసి లేకుంటే ఇయర్ ఫోన్స్ పెట్టి మాట్లాడ్డం మంచిది.

రేడియేషన్ సమస్య..

స్మార్ట్‌ఫోన్ వాడకం వల్ల రేడియేషన్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఫోన్ లేకుంటే ఓ రకమైన డిప్రెషన్ లోకి కూడా వెళతారు.కాబట్టి ఫోన్ వీలయినంత తక్కువగా వాడటం మంచిది.

కంప్యూటర్ ముందు అదేపనిగా కూర్చుంటే..?

కంప్యూటర్ ముందు కూర్చుని అదేపనిగా టైప్ చేయడం వల్ల మణికట్టు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. వీటితోపాటు వెన్నుపూస నొప్పి, అలాగే మొడనొప్పులనేవి సర్వసాధారణమే. అదే పనిగా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయడం వల్ల మీకు తలనొప్పి వచ్చే ప్రమాదం కూడా ఉంది.

ఫేస్‌బుక్ వాడకం ఎక్కువయితే..

ఫేస్‌బుక్ వాడకం ఎక్కువయితే వారికి బ్రెయిన్ దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కామెంట్లు అలాగే లైకులు ఇవి వారిని విపరీతమైన ఒత్తిడికి గురిచేస్తాయని చెబుతున్నారు.

నిర్లక్ష్యం...

గత ఎనిమిది సంవత్సరాల కాలంలో దాదాపు 108 మంది ఇలా హెడ్‌ఫోన్స్ పెట్టుకుని ఎదురుగా వెనక నుంచి ఏం వస్తున్నాయో తెలియక చనిపోయారని నివేదికలు చెబుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How Technology Is Damaging Your Physical and Mental Health. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot