2జీ ప్లాన్‌లో 3జీ స్పీడ్‌‌ను పొందటం ఎలా? ఇలా చేస్తే ఇంటర్నెట్ 80% ఆదా

2జీ డేటా ప్లాన్‌లో ఉన్నారా..? నెమ్మదైన బ్రౌజింగ్ మిమ్మల్ని విసిగిస్తోందా..? 2జీ డేటా ప్యాక్‌లో 3జీ బ్రౌజింగ్ స్పీడ్‌ను అందుకునేందుకు, ఈ సింపుల్ ట్రిక్ అప్లై చేయండి.

Read More : రెడ్మీ నోట్ 3 యూజర్లకు Airtel బంపర్ ఆఫర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి..

ముందుగా మీ ఫోన్ సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి Wireless and Network విభాగంలో More Optionsను సెలక్ట్ చేసుకోండి. అందులో Mobile Networks సెలక్ట్ చేసుకోండి.

డ్యుయల్ సిమ్ ఫోన్ వాడుతున్నట్లయితే..

మీరు డ్యుయల్ సిమ్ ఫోన్ వాడుతున్నట్లయితే 2జీ యాక్టివ్ డేటా ప్లాన్‌తో ఉన్న సిమ్‌ను  సెలక్ట్ చేసుకోండి. ఆ సిమ్ తాలుకా Network Mode ఆప్షన్ పై క్లిక్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి..

ఇప్పుడు మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటి వివరాలు.. GSM only, WCDMA only, WCDMA/GSM.వాటిలో WCDMA only ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని, ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ లోని 2జీ డేటా ప్యాక్ 3జీ బ్రౌజింగ్ స్పీడ్‌ను అందుకుంటుంది.

పాఠకులకు ముఖ్య గమనిక..

ఈ ట్రిక్‌ను అప్లై చేయటం ద్వారా, మీ ఫోన్ బ్రౌజింగ్ వేగం మాత్రమే పెరుగుతుంది. డౌన్‌లోడింగ్ వేగం మాత్రం 2జీ స్పీడ్‌లోనే ఉంటుంది. మేము సూచించిన సెట్టింగ్స్ కొన్ని నెట్‌‌వర్క్‌ ప్రొవైడర్స్ పరిధిలో పని చేయటం లేదు. కొన్నింటిని మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. గమనించగలరు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రోజువారీ అవసరాలకు

స్మార్ట్‌ఫోన్‌లను రోజువారీ అవసరాలకు ఉపయోగించుకునే వారు మనలో చాలా మందే ఉన్నారు. కమ్యూనికేషన్ అవసరాల నిమిత్తం ఇంటర్నెట్‌ను తప్పనసరిగా వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫోన్‌లో ఇంటర్నెట్ బ్యాలన్స్ ఉందంటే చాటింగ్, బ్రౌజింగ్, గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ ఇలా అనేక రకాల కార్యకలాపాలకు పాల్పడుతుంటాం.

ప్రయాణ సమయాల్లో..

ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో  ఎక్కువ ఇంటర్నెట్ డేటాను మనం ఖర్చు చేస్తుంటాం. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకంటూ ఒక నిర్థిష్టమైన అవగాహనతో ఫోన్ ఇంటర్నెట్ డేటాను 80% మేర ఆదా చేసుకునేందుకు 10 ముఖ్యమైన సూచనలు...

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అప్‌లోడ్ చేయకండి..

ప్రయాణ సమయంలో ఫోటోలు, వీడియోలను అప్‌లోడ్ చేయకండి. గూగుల్ మ్యాప్స్‌ను ఆఫ్‌లైన్‌లో మాత్రమే వాడుకోండి.

డేటా సేవర్ ఆప్షన్‌..

ఫేస్‌బుక్ ఆండ్రాయిడ్ వర్షన్ యాప్‌తో పోలిస్తే వెబ్ వర్షన్ యాప్ తక్కువ ఇంటర్నెట్ డేటాను ఖర్చు చేసుకుంటుంది. క్రోమ్ బ్రౌజర్ మీకు డీఫాల్ట్ బ్రౌజర్‌గా ఉన్నట్లయితే బ్రౌజర్‌లోని డేటా సేవర్ ఆప్షన్‌ను ఆన్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల వెబ్ పేజెస్ కంప్రెస్ కాబడతాయి.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆఫ్‌‌లైన్ గేమ్స్ ట్రై చేయండి

ఆన్‌లైన్ గేమ్స్‌కు బదులుగా ఆఫ్‌‌లైన్ గేమ్స్ ట్రై చేయండి. గూగుల్ ప్లే స్టోర్ యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Auto-Updating Apps ఆప్షన్‌ను డిసేబుల్ చేయండి. ఇలా చేయటం వల్ల మీకు అవసరమైనపుడు మాత్రమే యాప్స్‌ను అప్‌డేట్ చేసుకునే వీలుంటుంది. తద్వారా బోలెడంత మొబైల్ డేటా ఆదా అవుతుంది.

ఆఫ్‌‌లైన్ మ్యూజిక్‌కు ప్రిఫరెన్స్ ఇవ్వండి

ఆన్‌లైన్ మ్యూజిక్‌కు బదులుగా ఆఫ్‌‌లైన్ మ్యూజిక్‌కు ప్రిఫరెన్స్ ఇవ్వండి. డేటాను ట్రాక్ చేయండి మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్‌లో ఏఏ అప్లికేషన్ ఎంతెంత డేటాను ఖర్చు చేస్తుందో ట్రాక్ చేయండి. తద్వారా మీ మొబైల్ డేటా పై అవగాహనకు రావచ్చు. అవసరం లేని యాప్‌ను డిసేబుల్ చేయటం ద్వారా డేటా వినియోగాన్ని కొంత మేర ఆదా చేసుకోవచ్చు

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆటో - డౌన్‌లోడ్ ఫీచర్‌ను డిసేబుల్ చేయండి

వాట్సాప్‌లోని ఆటో - డౌన్‌లోడ్ ఫీచర్‌ను డిసేబుల్ చేయండి చాలా మంది వాట్సాప్ యూజర్లు ఇతర గ్రూప్ లలో భాగంగా ఉండటం వల్ల తరచూ ఫోటోలు, వీడియోలు, ఆడియోలను రిసీవ్ చేసుకుంటుంటారు. అయితే వీటిలో వాళ్లకు అవసరంలేనివి చాలానే ఉంటాయి. ఈ మల్టిఫుల్ ఫార్వర్డ్‌లను రిసీవ్ చేసుకోవటం వల్ల డేటా ఖర్చవుతూనే ఉంటుంది. కాబట్టి మీ వాట్సాప్‌ అకౌంట్‌లోని ఆటో - డౌన్‌లోడ్ ఫీచర్‌ను డిసేబుల్ చేసుకోవటం వల్ల డేటా వినియోగాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

అప్లికేషన్‌లను పరిమితం చేయండి

మీ ఫోన్‌లో ఎక్కువ డేటాను ఖర్చు చేస్తున్న అప్లికేషన్‌లను పరిమితం చేయండి. Settingsలోకి వెళ్లి Data usageను చూసినట్లయితే ఏ యాప్ ఎంతంత డేటాను ఖర్చు చేస్తుందో అర్థమవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
how to Access Internet browsing in 3G speed with 2G data pack. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot