Signal యాప్ ను ల్యాప్‌టాప్ లేదా PCలో యాక్సిస్ చేయడం ఎలా??

|

ప్రపంచంలో ఎక్కువ మంది వాడుతున్న త్వరిత మెసేజ్ యాప్ ఏది అంటే అందరు చెప్పే మొదటిది వాట్సాప్. కానీ ఇటీవల ప్రకటించిన వాట్సాప్ ప్రైవసీ విధానంతో అనేక వివాదాల మధ్య సిగ్నల్ యాప్ కు ఇండియాలో ముఖ్యంగా వాట్సాప్ వినియోగదారులలో విస్తృత ప్రజాదరణ లభిస్తున్నది. దీనిని ఇప్పటికే మిలియన్ల మంది వినియోగదారులు డౌన్‌లోడ్ చేశారు. వాస్తవానికి ఇది ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు ఆపిల్ యాప్ స్టోర్‌లో ఉచితంగా లభించే యాప్ లలో టాప్ స్థానంలో ఉంది. జనాదరణ పొందిన ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ దాని ప్రైవసీ విధానాన్ని అప్ డేట్ చేయడానికి సందేశించి యూజర్లు ఇప్పుడు సిగ్నల్ లేదా టెలిగ్రామ్‌లో చేరడానికి ఇష్టపడుతున్నారు.

How to Access The Signal App on Laptop or PC

సిగ్నల్ మెసేజింగ్ యాప్ ను వాట్సాప్ వలె మొబైల్‌తో పాటు డెస్క్‌టాప్‌లో కూడా ఉపయోగించవచ్చు. వాట్సాప్ మరియు టెలిగ్రామ్‌ల రెండు ప్లాట్‌ఫారమ్‌లకు ప్రత్యేక వెబ్ వెర్షన్ ఉంది. అయితే సిగ్నల్ విషయంలో అలా కాదు. సిగ్నల్ కోసం ప్రత్యేకమైన వెబ్ వెర్షన్ ఏమి లేదు. మీరు మీ ల్యాప్‌టాప్ లేదా PCలో సిగ్నల్‌ను ఉపయోగించాలనుకుంటే మీరు మొదట యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తరువాత దాన్ని ఇన్‌స్టాల్ చేసిన తరువాత మీరు మీ పిసిలో ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించగలరు.

విండోస్ ల్యాప్‌టాప్ లేదా PCలో సిగ్నల్‌ను ఉపయోగించే విధానం

How to Access The Signal App on Laptop or PC

స్టెప్ 1: సిగ్నల్‌ను ప్రారంభించడానికి మొదట మీరు ఉపయోగించే బ్రౌజర్‌లో సిగ్నల్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి దాని పేజీని ఓపెన్ చేసి దానిని డౌన్‌లోడ్ ఎంపిక మీద క్లిక్ చేయండి: https://signal.org/download/.

స్టెప్ 2: తరువాత సిగ్నల్ యొక్క డెస్క్‌టాప్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేయడానికి మీరు "ఫర్ విండోస్ డౌన్‌లోడ్" ఎంపికపై క్లిక్ చేయవచ్చు లేదా ఈ లింక్ ను యాక్సిస్ చేయవచ్చు https://updates.signal.org/desktop/signal-desktop-win-1.39.5.exe .

స్టెప్ 3: యాప్ యొక్క డౌన్‌లోడ్ క్లిక్‌లోనే ప్రారంభమవుతుంది. మీ యొక్క డివైస్ స్థిరమైన నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయిందని నిర్ధారించుకోండి. ఈ ప్రక్రియ పూర్తి అవ్వడానికి కొన్ని నిమిషాల సమయం పడుతుంది.

స్టెప్ 4: తరువాత యాప్ ను ఇన్‌స్టాల్ చేసి మీ విండోస్ ల్యాప్‌టాప్‌లో పొందండి.

స్టెప్ 5: తరువాత మీరు మీ మొబైల్ యాప్ లోని సిగ్నల్ యాప్ ను ఓపెన్ చేసి అకౌంటును డెస్క్‌టాప్‌కు లింక్ చేయడానికి సెట్టింగుల మెనూకు వెళ్లాలి.

స్టెప్ 6: ఇందులో లింక్డ్ డివైస్ ఆప్షన్‌ను ఎంచుకోండి మరియు లాగిన్ అవ్వడానికి వెబ్ వెర్షన్‌లో చూపిన కోడ్‌ను స్కాన్ చేయండి.

స్టెప్ 7: మీరు ఇప్పుడు ల్యాప్‌టాప్ లేదా PCలో మీ సిగ్నల్ అకౌంటును విజయవంతంగా లాగిన్ అవుతారు.

Best Mobiles in India

Read more about:
English summary
How to Access The Signal App on Laptop or PC

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X