Home
How to

BSNL SIM Card Activation బీఎస్‌ఎన్ఎల్‌ కొత్త సిమ్‌ కార్డును ఎలా యాక్టివేట్‌ చేయాలో తెలుసా..?

ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా జులై నెలలో మొబైల్‌ టారిఫ్‌ ఛార్జీలను భారీగా పెంచాయి. దీంతో అనేక మంది వినియోగదారులు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL కు పోర్టింగ్ అవుతున్నారు. ఇతర సంస్థలతో పోలిస్తే తక్కువ ధరకే రీఛార్జ్‌ ప్లాన్‌లు అందుబాటులో ఉండడం సహా 4G నెట్‌వర్క్ విస్తరించడం, 5G సర్వీసులను వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో BSNL కు పోర్టింగ్‌ అవుతున్నారు.

ఇప్పటికే BSNL తన యూజర్ల కోసం 4G, 5G సిమ్‌ కార్డులు అందుబాటులో ఉంచింది. అయితే బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్టింగ్‌ అయిన వినియోగదారులు సిమ్‌ కార్డులను యాక్టివేట్‌ చేయడంపై సరైన అవగాహన (BSNL SIM Card Activation) లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారి కోసం పూర్తి వివరాలతో కూడిన కథనం మీకోసం.

How to activate BSNL SIM Card in telugu

బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం లేదా సంబంధిత కార్యాలయాల్లో BSNL కొత్త సిమ్ కార్డులు తీసుకున్నాక.. నిర్దేశిత గడువు అనంతరం మొబైల్‌ ఫోన్‌ లో సిమ్ కార్డులు వేయాలి. అనంతరం ఫోన్‌ ను రీస్టార్ట్ చేయాలి. ఆ తర్వాత సిగ్నల్‌ వచ్చేంత వరకు ఎదురుచూడాలి.

BSNL సిగ్నల్ వచ్చాక 1507 నంబర్‌కు కాల్‌ చేయాలి. అనంతరం వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రతినిధితో మీ గుర్తింపు, అడ్రస్‌, భాష వివరాలను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే మీ సిమ్‌ కార్డు యాక్టివేట్‌ చేయబడుతుంది.

అనంతరం మీ ఫోన్‌ ఇంటర్నెట్‌ కు సంబంధించి వచ్చిన సెట్టింగ్స్‌ ను సేవ్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం మీ BSNL సిమ్‌ కార్డు కాలింగ్‌, డేటా వినియోగించుకొనేందుకు అనువుగా ఉంటుంది. డేటాను వినియోగించుకొనేందుకు సంస్థ నుంచి వచ్చిన సెట్టింగ్స్‌ ను కచ్చితంగా సేవ్‌ చేయాల్సి ఉంటుంది.

* బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G నెట్‌వర్క్‌ ను అక్టోబర్‌ లో ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. 4G ట్రయల్‌ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలుస్తోంది. దీంతోపాటు 5G సేవలను 2025 సంక్రాంతి నాటికి ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై BSNL ఆంధ్రప్రదేశ్‌ ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌ ధ్రువీకరించారు.

* BSNL రూ.1,999 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ తో 365 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో మొత‌్తంగా 600GB డేటాను పొందవచ్చు. ఈ డేటా వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది. రోజువారీ డేటా వినియోగంపై ఎటువంటి పరిమితి ఉండదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
How to activate BSNL SIM Cards here is the full guide in Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X