Home
How to

స్పామ్ కాల్స్‌ విసిగిస్తున్నాయా, Do Not Disturbతో తరిమేయండి, సింపుల్ ట్రిక్స్

ఈ రోజుల్లో అనేకమంది మొబైల్ వినియోగదారులు స్పామ్ కాల్స్ తో బాగా విసుగుచెందుతున్నారన్న సంగతి అందిరీ తెలిసిందే. ఏదో మన పనిలో మనం బిజీలో ఉంటే ఈ స్పామ్ కాల్స్ మనల్ని చాలా ఇబ్బందిపెడుతుంటాయి.

By Hazarath

ఈ రోజుల్లో అనేకమంది మొబైల్ వినియోగదారులు స్పామ్ కాల్స్ తో బాగా విసుగుచెందుతున్నారన్న సంగతి అందిరీ తెలిసిందే. ఏదో మన పనిలో మనం బిజీలో ఉంటే ఈ స్పామ్ కాల్స్ మనల్ని చాలా ఇబ్బందిపెడుతుంటాయి. అది కొనండి ఇది కొనడం అంటూ సతాయిస్తుంటాయి. అయితే వీటికి పుల్ స్టాప్ ఎలా పెట్టాలో తెలియక చాలామంది సతమతమవుతుంటారు. ఆ స్పామ్ కాల్స్ తో సతమతమయ్యే వారు ఈ కింది సింపుల్ ట్రిక్స్ పాటించడం ద్వారా మీరు వాటిని తరిమేయవచ్చు.వివిధ రకాల కంపెనీల నుంచి వచ్చే స్పామ్ కాల్స్ ని కోడ్ ఎంటర్ చేయడం ద్వారా వాటిని బ్లాక్ చేయవచ్చు.ఈ సర్వీసు Aircel, Airtel, BSNL, Tata DoCoMo, Idea Cellular, Loop Mobile, MTNL, Reliance Communications, MTS India, Tata Indicom, Uninor, Vodafone, Jio లాంటి అన్ని నెట్‌వర్క్‌లకు పనిచేస్తుంది.

ట్రిక్ 1

ట్రిక్ 1

1. మీరు మీ మొబైల్ నుండి 1909కి కాల్ చేయడం ద్వారా కాని లేక START 0 అని టైప్ చేసి 1909కి మెసేజ్ చేయడం ద్వారా కాని వీటిని బ్లాక్ చేయవచ్చు.
2. మీరు మీ మొబైల్ నుండి START 1 అని టైప్ చేసి 1909కి ఎసెమ్మెస్ చేస్తే Insurance - Financial Products - Credit Cards లాంటి స్పామ్ కాల్స్ మీకు రాకుండా బ్లాక్ చేస్తారు.
3. మీరు మీ మొబైల్ నుండి START 2 అని టైప్ చేసి 1909కి ఎసెమ్మెస్ చేస్తే Real Estate నుంచి ఎటువంటి స్పామ్ కాల్స్ మీకు రాకుండా బ్లాక్ చేస్తారు.

ట్రిక్ 2

ట్రిక్ 2

4. మీరు మీ మొబైల్ నుండి START 3 అని టైప్ చేసి 1909కి ఎసెమ్మెస్ చేస్తే Education నుంచి ఎటువంటి స్పామ్ కాల్స్ మీకు రాకుండా బ్లాక్ చేస్తారు.
5. మీరు మీ మొబైల్ నుండి START 4 అని టైప్ చేసి 1909కి ఎసెమ్మెస్ చేస్తే Health నుంచి ఎటువంటి స్పామ్ కాల్స్ మీకు రాకుండా బ్లాక్ చేస్తారు.

ట్రిక్ 3

ట్రిక్ 3

6. మీరు మీ మొబైల్ నుండి START 5 అని టైప్ చేసి 1909కి ఎసెమ్మెస్ చేస్తే Consumer Goods & Automobiles నుంచి ఎటువంటి స్పామ్ కాల్స్ మీకు రాకుండా బ్లాక్ చేస్తారు.
7. మీరు మీ మొబైల్ నుండి START 6 అని టైప్ చేసి 1909కి ఎసెమ్మెస్ చేస్తే Communication - Broadcasting - Entertainment - ITల నుంచి ఎటువంటి స్పామ్ కాల్స్ మీకు రాకుండా బ్లాక్ చేస్తారు.
8. మీరు మీ మొబైల్ నుండి START 7 అని టైప్ చేసి 1909కి ఎసెమ్మెస్ చేస్తే Tourism నుంచి ఎటువంటి స్పామ్ కాల్స్ మీకు రాకుండా బ్లాక్ చేస్తారు.

వీటిని యాక్టివేట్ చేసుకోవాలంటే..

వీటిని యాక్టివేట్ చేసుకోవాలంటే..

మీరు మళ్లీ వీటిని యాక్టివేట్ చేసుకోవాలంటే మీరు సేమ్ నెంబర్ కి STOPఅని టైప్ చేసి ఎసెమ్మెస్ ద్వారా పంపిస్తే వాళ్లు వాటిని మళ్లీ యాక్టివేట్ చేస్తారు.లేదంటే అదే నంబర్ కి కాల్ చేసి మీరు బ్లాక్ చేసిన వాటిని తిరిగి పొందవచ్చు.

కొన్నింటిని బ్లాక్ చేయడం కుదరదు

కొన్నింటిని బ్లాక్ చేయడం కుదరదు

అయితే కొన్నింటిని బ్లాక్ చేయడం కుదరదు. bank SMS alerts, bank communications, online bookings, third party personal callingలాంటి వాటిని మీరు బ్లాక్ చేయించుకోలేరు.

దాదాపు 7 రోజులు సమయం ..

దాదాపు 7 రోజులు సమయం ..

అయితే ఈ ప్రాసెస్ కి దాదాపు 7 రోజులు సమయం తీసుకుంటుంది. కాగా మీరు సర్వీసు రిక్వెస్ట్ కోసం ఓ సారి అప్లయి చేస్తే మళ్లీ మూడు నెలల తరువాతనే అప్లయి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మొత్తంగా ఉచితంగా జరుగుతుంది. దీని కోసం మీనుంచి ఎటువంటి ఛార్జీలు తీసుకోబడవు.

Best Mobiles in India

English summary
How To Activate Do Not Disturb in Indian Mobile Networks More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X