Netflix లో 'డౌన్‌లోడ్ ఫర్ యూ' కొత్త ఫీచర్‌ను యాక్టివేట్ చేయడం ఎలా?
ప్రస్తుతం వినియోగదారులు అధిక వినోదం కోసం ఉపయోగించే OTTలలో నెట్‌ఫ్లిక్స్ ఒకటి. ఈ OTT యాప్ తన యొక్క వినియోగదారులకు అందించే వినోద ప్రయోజనాలపై మరింత నియంత్రణను అందించడానికి ప్రయత్నిస్తుంది. అలాగే బ్రౌజింగ్ అనుభవాన్ని కూడా మరింత పెంచడానికి అనేక ఫీచర్లను అందిస్తుంది. ఇటీవల ఈ స్ట్రీమింగ్ దిగ్గజం 'డౌన్‌లోడ్ ఫర్ యు' అని పిలువబడే సరికొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఇది వినియోగదారుల వాచ్ హిస్టరీ ప్రకారం సిఫార్సు చేసిన షోలు లేదా సినిమాలను స్వయంచాలకంగా డౌన్‌లోడ్ చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్ యొక్క స్మార్ట్ డౌన్‌లోడ్ ఫీచర్ వినియోగదారులు చూసిన వెబ్ లేదా టీవీ సిరీస్ ఎపిసోడ్‌లను స్వయంచాలకంగా తొలగిస్తుంది మరియు తదుపరి ఎపిసోడ్‌ను డౌన్‌లోడ్ చేస్తుంది. ఈ కొత్త అప్ డేట్ తో నెట్‌ఫ్లిక్స్ సినిమాలు మరియు కొత్త షోలను కవర్ చేస్తుంది. డౌన్‌లోడ్ ఫర్ యూ కొత్త ఫీచర్ ను ఎలా ఉపయోగించాలో వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డౌన్‌లోడ్ ఫర్ యూ కొత్త ఫీచర్‌ను యాక్టివేట్ చేసే విధానం
** నెట్‌ఫ్లిక్స్ డౌన్‌లోడ్ ఫర్ యూ కొత్త ఫీచర్‌ను యాక్టివేట్ చేయడానికి మొదట మీ మొబైల్ లో నెట్‌ఫ్లిక్స్ ను ఓపెన్ చేయండి.
** నెట్‌ఫ్లిక్స్ ను ప్రారంభించిన తరువాత డౌన్‌లోడ్ విభాగానికి టోగుల్ చేయండి.
** డౌన్‌లోడ్ టాబ్ కింద మీరు డౌన్‌లోడ్ ఫర్ యూ వంటి కొత్త ఎంపికను చూస్తారు.
** తదుపరి స్క్రీన్‌లో మీ ఫోన్ యొక్క స్టోరేజ్ ను కేటాయించే ఎంపిక మీకు లభిస్తుంది. మీరు ఇందులో 1GB నుండి 5GB మధ్య ఎంచుకోవచ్చు.
** వినియోగదారులు 12 సినిమాలు మరియు టీవీ షోలను డౌన్‌లోడ్ చేయడానికి 3GB స్టోరేజ్ సరిపోతుందని నెట్‌ఫ్లిక్స్ సిఫారసు చేస్తుంది.
** మీరు స్టోరేజ్ ను ఎంచుకున్న తర్వాత 'ఆన్ ఆన్' బటన్‌ను నొక్కడం ద్వారా కొత్త ఫీచర్‌ను ఆస్వాదించవచ్చు.
డౌన్‌లోడ్ ఫర్ యూ ఫీచర్‌ను డియాక్టివేట్ చేసే విధానం

నెట్‌ఫ్లిక్స్ యొక్క 'డౌన్‌లోడ్ ఫర్ యూ' కొత్త ఫీచర్‌తో సంతోషంగా లేకుంటే లేదా స్టోరేజ్ కొరత సమస్యను ఎదుర్కొంటు ఉంటే కనుక మీరు ఎప్పుడైనా ఈ ఫీచర్‌ను ఆపివేయవచ్చు. దీనిని డియాక్టివేట్ చేయడానికి నెట్‌ఫ్లిక్స్ యాప్ ను ఓపెన్ చేసి డౌన్‌లోడ్ విభాగంలో డౌన్‌లోడ్ ఫర్ యూ డియాక్టివేట్ ఎంపికను ఎంచుకోండి.


Click it and Unblock the Notifications








