Home
How to

FASTAG Annual Pass : ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ను ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలి..?

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కొన్ని నెలల క్రితం ఫాస్టాగ్‌ వార్షిక ప్లాన్‌ పై ప్రకటన చేశారు. రూ.3 వేలు చెల్లించి జాతీయ రహదారులపై 200 ట్రిప్పులు వరకు ప్రయాణం చేయవచ్చన్నది ఈ ప్రకటన సారాంశం. ఆగస్టు 15 నుంచి ఈ ప్లాన్‌ అమల్లోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన లింక్‌.. అధికారిక యాప్‌, వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉంది. అయితే ఈ ఫాస్టాగ్‌ వార్షిక ప్లాన్‌ ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలి. ఈ ప్లాన్‌ ప్రయోజనాలు ఏంటి.. పూర్తి వివరాలు.

వీటికి మాత్రమే ఈ ఫాస్‌ వర్తిస్తుంది :
ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ (FASTAG Annual Pass) ను జాతీయ రహదారులు (NH), నేషనల్‌ ఎక్స్‌ప్రెస్‌ వే (NE) లపై ప్రయాణించే వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే వాణిజ్యేతర కార్లు, జీపులు, వ్యాన్‌ల కోసం ఈ పాస్‌ ను కొనుగోలు చేయవచ్చు. ఇతర వాహనాలు ఫాస్టాగ్ సాధారణ విధానం ద్వారానే చెల్లింపులు చేయాలి.

How to Activate FASTAG Annual Pass

ఈ యాప్‌, వెబ్‌సైట్‌ లో కొనుగోలు చేయవచ్చు :
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన లింక్‌ అందుబాటులో ఉంది. రవాణా శాఖకు చెందిన రాజ్‌మార్గ్‌ యాత్ర యాప్‌, నేషనల్ హైవే అథారిటీ, రహదారి రవాణా మరియు హైవే మంత్రిత్వ శాఖ (MoRTH) వెబ్‌సైట్‌ లో ఈ లింక్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్‌ తోనే ఈ వార్షిక పాస్‌ ను కొనుగోలు చేయవచ్చు. కొత్తగా ఫాస్టాగ్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు.

రూ.3 వేలతో రీఛార్జ్ :
ఫాస్టా్గ్‌ వార్షిక ప్లాన్ కోసం రూ.3 వేలను చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సర కాలం లేదా 200 ట్రిప్పులు (ఏది ముందైతే అదే) వరకు జాతీయ రహదారులపై ప్రయాణం చేయవచ్చు. ఈ ప్లాన్‌ లో ఒక్కో టోల్‌గేట్‌ ను ఒక్కో ట్రిప్‌ గా పరిగణిస్తారు. ప్రస్తుత అంచనా ఆధారంగా నగదు ఆదా చేయవచ్చు. ఫాస్టాగ్‌ వార్షిక ప్లాన్ పై ఆసక్తి లేని వాహనదారులు ప్రస్తుత విధానంలో టోల్‌ చెల్లించవచ్చు.

రాజ్‌మార్గ్‌ యాత్ర యాప్‌ తోపాటు ఇతర అధికారిక వెబ్‌సైట్‌ ల నుంచి ఈ పాస్‌ ను కొనుగోలు చేయవచ్చు. సంవత్సరం కాలం లేదా 200 ట్రిప్పుల అనంతరం ఫాస్టాగ్‌ ను మళ్లీ రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫాస్టాగ్‌ వార్షిక ప్లాన్‌ ను ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలి.

వార్షిక ప్లాన్‌ను ఎలా యాక్టివేట్‌ చేయాలి :

> రాజ్‌మార్గ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
> జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI), MoRTH వెబ్‌సైట్‌లో కూడా లింక్‌ అందుబాటులో ఉంది.
> ఈ యాప్‌, వెబ్‌సైట్‌ లో ఉన్న ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ లింక్‌ పైన క్లిక్ చేయాలి.
> వెహికల్ నంబర్‌, మొబైల్‌ నంబర్‌, ఫాస్టాగ్‌ వివరాలను నమోదు చేసి, లాగిన్‌ కావాల్సి ఉంటుంది.
> ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌వే ద్వారా రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
> పేమెంట్‌ పూర్తయిన రెండు గంటల్లో ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ యాక్టివేట్‌ అవుతుంది.
> చివరగా మీ ఫోన్‌కు SMS వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
How to Activate FASTAG Annual Pass
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X