Home
How to

రోజంతా ఇన్‌స్టాగ్రామ్‌లోనే గడిచిపోతుందా.. అయితే ఈ రెండు ఫీచర్‌ల గురించి తెలుసుకోవాల్సిందే..!

మెటాకు (Meta) చెందిన ఇన్‌స్టాగ్రామ్‌ ఎంత పాపులర్‌ ప్లాట్‌ఫామో అందరికీ తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌ ప్రస్తుతం 350 మిలియన్‌ల యాక్టివ్‌ యూజర్లను కలిగి ఉంది. ప్రస్తుతం అనేక మంది రోజుల గంటల తరబడి ఇన్‌స్టా ను ఉపయోగిస్తున్నారు. రీల్స్‌, పోస్ట్‌లు చూస్తూ గడిపేస్తున్నారు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌ను ఎక్కువ సమయం వినియోగించకుండా ఉండేందుకు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఏదో మెసేజ్‌ లేదా రీల్‌ కోసం ప్లాట్‌ఫాం లోకి వచ్చి.. అలానే సమయం వృథా చేసుకుంటున్నారు.

అయితే ఇన్‌స్టాగ్రామ్‌ లో సమయాన్ని కట్టడి చేసేందుకు ప్లాట్‌ఫాంలోనే ఇన్‌బిల్ట్‌ ఫీచర్‌లను అందిస్తోంది. ఈ రెండు ఫీచర్‌ల ద్వారా డైలీ టైం లిమిట్‌ పెట్టేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు స్లీప్‌ మోడ్‌ ఫీచర్‌ ను కూడా యాక్టివేట్‌ చేసుకోవచ్చు. ఈ రెండు ఫీచర్‌ల ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌ స్క్రీన్‌ టైం ను గణనీయంగా తగ్గించుకొనేందుకు అవకాశం ఉంటుంది.

insta tips

డైలీ టైం లిమిట్‌ : ఇన్‌స్టాగ్రామ్‌లో డైలీ టైం లిమిట్‌ ఫీచర్‌ను (Instagram Daily Time Limit Feature) యాక్టివేట్‌ చేసుకోవడం ద్వారా.. స్క్రీన్‌ టైంను గణనీయం తగ్గించుకోవచ్చు. ఈ సమయం దగ్గర పడే కొద్దీ.. రిమైండర్‌ల రూపంలో యూజర్‌లను అలెర్ట్‌ చేస్తుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రోజూ ఎక్కువ సమయం గడిచిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేసే యూజర్లకు ఈ ఫీచర్‌ కచ్చితంగా ఉపయోగపడుతుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో డైలీ టైం లిమిట్‌ ఫీచర్‌ ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలి :
స్టెప్‌ 1 : ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి, ప్రొఫైల్‌ పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 2 : అక్కడ కనిపించిన మెనూ ఐకాన్‌ పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 3 : అనంతరం Time Management మరియు Daily Time Limit పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్ 4 : ఆ ఆప్షన్‌లో 15 నిమిషాల నుంచి గరిష్ఠంగా 2 గంటల వరకు లిమిట్‌ విధించుకోవచ్చు.
స్టెప్‌ 5 : ఈ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకున్న నుంచి మీకు అలెర్ట్‌ నోటిఫికేషన్‌లను రానున్నాయి.

Take a Poll

డైలీ టైం లిమిట్‌ ఆప్షన్‌తోపాటు స్లీప్‌ మోడ్ ఆప్షన్ (Instagram Sleep Mode) కూడా అందుబాటులో ఉంటుంది. స్లీప్‌ మోడ్ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకున్న అనంతరం మీరు ఎంచుకున్న టైం ఫ్రేమ్‌ లో ఎటువంటి నోటిఫికేషన్‌లు రాకుండా నియంత్రిస్తుంది. దీంతోపాటు మీరు స్లీప్‌ మోడ్ యాక్టివేట్‌ చేసినట్లు మీ స్నేహితులకు కూడా తెలియజేస్తుంది.

స్టెప్‌ 1 : ఇన్‌‌స్టాగ్రామ్‌ యాప్‌ ఓపెన్‌ చేసి, ప్రొఫైల్‌ పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 2 : మెనూ ఐకాన్‌ పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్ 3 : అనంతరం టైమ్ మేనేజ్‌మెంట్‌ ఆప్షన్‌ పైన ట్యాప్‌ చేసి స్లీప్‌ మోడ్‌ పైన క్లిక్ చేయాలి.
స్టెప్‌ 4 : అనంతరం అక్కడ టైమ్‌ లిమిట్‌ పెట్టుకోవాల్సి ఉంటుంది.
స్టెప్‌ 5 : ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకున్నాక.. నిర్దేశించిన సమయాల్లో నోటిఫికేషన్‌లు ఆటోమేటిక్‌గా మ్యూట్‌ కానున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
how to activate sleep mode and daily time limit features on instagram here is the guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X