Home
How to

స్మార్ట్‌ఫోన్‌ దొంగిలించబడిందా.. ఇలా చేస్తే మీకు సగం టెన్షన్ తగ్గుతుంది..!

స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం అనేక మంది జీవితంలో భాగంగా మారిపోయాయి. కాలింగ్‌, డేటా అవసరాలతోపాటు పేమెంట్లను కూడా సులభంగా చేయగలుగుతున్నాం. దీంతోపాటు వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, వీడియోలు సహా ఇతర ప్రైవేట్‌, సున్నితమైన సమాచారాన్ని భద్రపరుచుకుంటున్నాం. అయితే ఏదైనా పరిస్థితుల్లో స్మార్ట్‌ఫోన్ పొగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా అందులోకి డేటా దుర్వినియోగం అవుతుందేమో అనే ఆందోళన చెందుతుంటాం. అయితే ప్రస్తుతం అనేక ఫీచర్‌లు స్మార్ట్‌ఫోన్‌లోని డేటా దుర్వినియోగం జరగకుండా నియంత్రిస్తున్నాయి.

ఈ ఫీచర్‌లలో Theft Protection ఫీచర్‌ ఒకటి. ఏదైనా సందర్భంలో ఫోన్ దొంగిలించబడినా.. అందులోని డేటాను ఇతరులు యాక్సెస్‌ చేయకుండా నియంత్రిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్ 10 సహా లేటెస్ట్‌ OS వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. అయితే ఈ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్ చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

how to activate theft protection

స్మార్ట్‌ఫోన్‌ను దొంగతనం చేశాక.. ఆ డివైజ్‌లోని డేటాను యాక్సెస్‌ చేసేందుకు ప్రయత్నం చేస్తే ఈ ఫీచర్‌ ఆటోమేటిక్‌గా ఫోన్‌ను లాక్‌ చేస్తుంది. ఫలితంగా ఫోన్‌లోని సెన్సిటివ్‌ డేటా దుర్వినియోగం జరగకుండా ఉంటుంది. దీంతోపాటు ఈ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసేందుకు గూగుల్‌ అకౌంట్‌ను కలిగి ఉండాలి. మరియు డివైజ్‌లో లాగిన్‌ చేసి ఉండాలి.

థెఫ్ట్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌లను ఎలా యాక్టివేట్ చేయాలి :
- థెప్ట్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసేందుకు ఆండ్రాయిడ్ ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
- అనంతరం కిందకు స్క్రోల్‌ చేసి గూగుల్‌ ఆప్షన్‌ పైన క్లిక్ చేయాలి.
- తర్వాత ఆల్‌ సర్వీసెస్‌ ట్యాబ్‌ పై ట్యాప్‌ చేయాలి.
- పర్సనల్‌ డేటా మరియు డివైజ్‌ సేఫ్టీ ఆప్షన్‌ పైన క్లిక్‌ చేసి థెప్ట్‌ ప్రొటెక్షన్ ఫీచర్‌ను ఎంచుకోవాలి.
- థెప్ట్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌ను అక్కడే యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
- దీంతోపాటు ఆఫ్‌లైన్‌ డివైజ్‌ లాక్‌ ఆప్షన్‌ను కూడా యాక్టివేట్‌ చేసుకోవాలి.

థెఫ్ట్ ప్రొటెక్షన్‌ ఫీచర్‌తోపాటు ఫైండ్‌ మై డివైజ్‌ (Find My Device) ఫీచర్‌ ద్వారా కూడా ఫోన్‌లోని ప్రైవేట్‌ లేదా సెన్సిటివ్‌ డేటాను దుర్వినియోగం కాకుండా నియంత్రించవచ్చు. ఈ ఫీచర్‌ అన్ని ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లకు సపోర్టు చేస్తుంది. అయితే పొగొట్టుకున్న ఫోన్‌లో వినియోగించిన గూగుల్ అకౌంట్‌ వివరాలు మీకు తెలియాల్సి ఉంది. ఈ ఫీచర్‌ ద్వారా మీ ఫోన్‌లోని డేటాను డిలీట్‌ చేయవచ్చు.

- కంప్యూటర్‌ లేదా వేరే స్మార్ట్‌ఫోన్‌లో బ్రౌజర్‌ను ఓపెన్‌ చేయాలి.
- అనంతరం android.com/find ను బ్రౌజర్‌లో ఎంటర్‌ చేయాలి.
- మీ ఫోన్‌ను ఎంపిక చేసుకోవాలి.
- Factory Reset ఆప్షన్‌ పైన క్లిక్ చేయాలి. అనంతరం గూగుల్ అకౌంట్‌ వివరాలు నమోదు చేయాలి.
- లాగిన్ చేశాక.. Reset ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- మీ స్మార్ట్‌ఫోన్‌లోని పూర్తి డేటా డిలీట్‌ అవుతుంది.

స్మార్ట్‌ఫోన్‌ దొంగిలించబడినా.. డేటాను ఎవరు వినియోగించకుండా నియంత్రించవచ్చు.
పైన తెలిపిన రెండు ఫీచర్‌ల ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌లోని డేటాను ఇతరులు యాక్సెస్‌ చేయడం లేదా దుర్వినియోగం చేయకుండా కాపాడుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ రికవరీ చేయలేకపోయినా.. డేటా ఇతరుల చేతికి వెళ్లకుండా కాపాడుకోవచ్చు. అయితే స్మార్ట్‌ఫోన్‌లు పొగొట్టుకున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం సంచార్‌ సాథీ వెబ్‌సైట్‌/ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

ఈ యాప్‌ ద్వారా స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌లను కూడా బ్లాక్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ యాప్‌ ఆండ్రాయిడ్‌, ఐఫోన్ యూజర్‌లకు అందుబాటులో ఉంది. ఈ యాప్‌ ద్వారానే మీ పేరు మీద ఎన్ని మొబైల్‌ నంబర్‌లు ఉన్నాయో కూడా తెలుసుకొనేందుకు వీలుంది. మీకు సంబంధం లేని నంబర్‌లను బ్లాక్‌ చేసేందుకు కూడా అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
how to activate theft protection and find my device features on android here is the guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X