VoWiFi సర్వీసును షియోమి ఫోన్‌లలో యాక్టివేట్ చేయడం ఎలా?

|

షియోమి సంస్థ యొక్క పోకో F1, రెడ్‌మి K20 మరియు రెడ్‌మి K 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన VoWiFi కాలింగ్ సర్వీసుకు మద్దతు ఇస్తున్నాయి. డిల్లీ NCR ప్రాంతంలో ఎయిర్టెల్ సేవలను ప్రారంభించిన తరువాత స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు వాయిస్ ఓవర్ వైఫైని యాక్టివేట్ చేస్తున్నట్లు ప్రకటించింది.

VoWiFi

ఈ మూడు పరికరాలు సంస్థ నుండి VoWiFiని ప్రారంభించబడిన స్మార్ట్‌ఫోన్‌ల మొదటి బ్యాచ్. ప్రస్తుతం ఎయిర్‌టెల్ VoWiFi కు మద్దతు ఇచ్చిన 24 డివైస్ లలో ఈ మూడు ఫోన్లు కూడా ఉన్నాయి.

 

VoWiFi ఫీచర్ ను మొదలుపెట్టిన రిలయన్స్ జియోVoWiFi ఫీచర్ ను మొదలుపెట్టిన రిలయన్స్ జియో

ఎయిర్‌టెల్ VoWiFi
 

భారతి ఎయిర్‌టెల్ గత వారం డిల్లీ NCR ప్రాంతంలో VoWiFi సర్వీసును అధికారికంగా ప్రారంభించింది. ఇది సాధారణంగా అందుబాటులోకి రాకముందే ఈ సర్కిల్‌లోని తక్కువ సంఖ్యలో వున్న వినియోగదారులతో ఇది ఇప్పటికే పరీక్షించబడుతోంది. దీనిని అధికారికంగా ఎయిర్‌టెల్ వాయిస్ ఓవర్ వైఫై కాలింగ్ ఫీచర్ అని పిలుస్తారు. దీనికి ఆపిల్, శామ్‌సంగ్, షియోమి మరియు వన్‌ప్లస్ వంటి బ్రాండ్ల పరికరాలు మద్దతు ఇస్తున్నాయి. VoWiFi అనేది ఫోన్ కాల్స్ కోసం వైర్‌లెస్ ట్రాన్స్మిషన్‌ను ఉపయోగించే VoIP సర్వీస్ యొక్క ఒక రూపం. ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్ సేవతో దాని వినియోగదారులు వైఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించి ఫోన్ కాల్స్ మరియు టెక్స్ట్‌లను చేయగలరు మరియు స్వీకరించగలరు.

 

సరసమైన ధర వద్ద లాంగ్ టర్మ్ ప్లాన్‌లను అందిస్తున్న నెట్‌ఫ్లిక్స్సరసమైన ధర వద్ద లాంగ్ టర్మ్ ప్లాన్‌లను అందిస్తున్న నెట్‌ఫ్లిక్స్

షియోమి రెడ్‌మి కె 20, రెడ్‌మి కె 20 ప్రో మరియు పోకో ఎఫ్ 1 లలో VoWiFi సర్వీసును ఎలా యాక్టివేట్ చేయాలి

షియోమి రెడ్‌మి కె 20, రెడ్‌మి కె 20 ప్రో మరియు పోకో ఎఫ్ 1 లలో VoWiFi సర్వీసును ఎలా యాక్టివేట్ చేయాలి

VoWiFi అనేది నెట్‌వర్క్ ప్రొవైడర్ ఆధారిత సర్వీస్ అని గమనించడం ముఖ్యం. దాన్ని పొందడానికి మీ ఆపరేటర్ మీ సర్కిల్‌లో దీనిని యాక్టివేట్ చేయాలి. మీరు డిల్లీ ఎన్‌సిఆర్ ప్రాంతంలో ఎయిర్‌టెల్ యూజర్ అయితే మీరు ప్రస్తుతం ఈ సర్వీసును పొందవచ్చు. పైన పేర్కొన్న డివైస్ లలో VoWiFi ను ప్రారంభించడానికి ఈ క్రింది తెలిపే పద్దతులను పాటించండి.

స్టెప్1: ఇందులో మొదటి స్టెప్ మీ స్మార్ట్‌ఫోన్‌ను తాజా MIUI 11 వెర్షన్‌కు అప్డేట్ చేయాలి.

స్టెప్2: మీకు ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉండాలి.

స్టెప్3: మీ ఎయిర్‌టెల్ సిమ్‌లో VoLTE సర్వీస్ ప్రారంభించబడిందని నిర్ధారించుకోండి. దీన్ని ప్రారంభించడానికి సెట్టింగ్స్ >> సిమ్ కార్డ్ & నెట్‌వర్క్స్ >> ఎయిర్‌టెల్ సిమ్ >> యూస్ VoLTE >> ఆన్ చేయండి.

స్టెప్ 4: ఇప్పుడు వైఫై కాల్ సెట్టింగులను యాక్టివేట్ చేయండి. అలా చేయడానికి సెట్టింగ్స్ >> సిమ్ కార్డ్ & నెట్‌వర్క్‌లు >> ఎయిర్‌టెల్ సిమ్ >> మేక్ కాల్స్ యూసింగ్ వైఫై >> టర్న్ ఆన్.

 

VoWiFi ఎలా పనిచేస్తుంది

VoWiFi ఎలా పనిచేస్తుంది

మీరు పై దశలను అనుసరించిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి. మీరు ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ వైఫై నెట్‌వర్క్‌లో ఉన్నట్లు ఫోన్ యొక్క స్టేటస్ పట్టీలో VoWiFi చిహ్నాన్ని చూపిస్తుంది. VoWiFi తో మీరు వేగంగా కాల్ కనెక్షన్ మరియు నాణ్యతను కూడా ఆశించవచ్చు.

 

 

Best Mobiles in India

English summary
How to Activate VoWiFi Service on Xiaomi Redmi K20, Redmi K20 Pro and Poco F1

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X