Android స్మార్ట్‌ఫోన్‌లలో Wi-Fi కాలింగ్‌ను యాక్టివేట్ చేయడం ఎలా?

|

కరోనావైరస్ కారణంగా అందరు ఇంటివద్ద ఉండడం వల్ల చాలా మంది వారి యొక్క స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడాలని ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ఇంటి వద్ద నుండి పని చేసే వారు తమ యొక్క సహోద్యోగులతో కమ్యూనికేట్ చేయడానికి వారి స్మార్ట్‌ఫోన్‌లను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ప్రస్తుత సమయంలో వాయిస్ కాల్స్ యొక్క లోడ్ విపరీతంగా పెరిగింది. దీని కారణంగా వాయిస్ కాల్ డ్రాప్స్ ఇప్పుడు సాధారణం అయ్యాయి.

 

వై-ఫై కాలింగ్‌

వై-ఫై కాలింగ్‌

మీరు వాయిస్ కాల్స్ లాంటి సమస్యను ఎదుర్కొంటుంటే మరియు కస్టమర్ కేర్‌కు కాల్ చేయడం మరియు దీనికి సంబంధించి ఫిర్యాదు చేయడం వంటివి కాకుండా కొత్తగా వచ్చిన వై-ఫై కాలింగ్‌ను ఒకసారి ప్రయత్నించండి. వై-ఫై కాలింగ్ అనేది మీ వద్దనున్న వై-ఫై కనెక్షన్‌ను ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం. ఇది అదనపు ఛార్జీలు లేకుండా మీ యొక్క ప్రస్తుత ఫోన్ నంబర్‌ను ఉపయోగించి వై-ఫై ద్వారా కాల్స్ చేయడానికి మరియు స్వీకరించడానికి అనుమతి ఉంటుంది.

 

 

 

Google Meet premium వీడియో మీటింగ్ యాప్ ఇప్పుడు ఉచితం...Google Meet premium వీడియో మీటింగ్ యాప్ ఇప్పుడు ఉచితం...

ఆవశ్యకతలు
 

ఆవశ్యకతలు

Wi-Fi కాలింగ్‌ను ప్రస్తుతానికి ఎయిర్టెల్ మరియు జియో కస్టమర్లు మాత్రమే ఉపయోగించగలరు.

*** ఎయిర్టెల్ లేదా రిలయన్స్ జియో యాక్టివ్ సిమ్.

*** Wi-Fi కాలింగ్‌కు మద్దతిచ్చే స్మార్ట్‌ఫోన్ .

*** స్మార్ట్‌ఫోన్‌ను వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయాలి.

*** మీ యొక్క నెంబర్ ఏదైనా క్రియాశీల వాయిస్ ప్లాన్ తో యాక్టీవ్ లో ఉండాలి.

*** అలాగే మీ యొక్క సిమ్ 4 G కి సెట్ చేయబడిందని మరియు VoLTE ఆన్ చేయబడిందని నిర్ధారించుకోండి.

 

 

Reliance Jio data pack తో రోజువారీ 2GB డేటా ఉచితం... మీకు వచ్చిందా??Reliance Jio data pack తో రోజువారీ 2GB డేటా ఉచితం... మీకు వచ్చిందా??

 

Android స్మార్ట్‌ఫోన్‌లలో Wi-Fi కాలింగ్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి

Android స్మార్ట్‌ఫోన్‌లలో Wi-Fi కాలింగ్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి

*** మీ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్‌లను ఓపెన్ చేయండి.

*** అందులో కనెక్షన్ల మీద నొక్కండి.

*** ఇప్పుడు వై-ఫై కాలింగ్ ఎంపిక కోసం చూడండి మరియు టోగుల్ ఆన్ చేయండి

 

వై-ఫై కాలింగ్ ఉపయోగించి కాల్స్ ఎలా చేయాలి

వై-ఫై కాలింగ్ ఉపయోగించి కాల్స్ ఎలా చేయాలి

వై-ఫై కాలింగ్ ఫీచర్ అనేది స్మార్ట్‌ఫోన్‌ యొక్క అంతర్నిర్మిత ప్రత్యేక ఫీచర్. ఇది పని చేయడానికి మీకు ఎటువంటి అదనపు యాప్ అవసరం లేదు. కాబట్టి వై-ఫై కాలింగ్ ఫీచర్ ఉపయోగించి కాల్స్ ను ఉచితంగా చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా స్మార్ట్‌ఫోన్ డిఫాల్ట్ డయలర్ యాప్ ను ఉపయోగించడం మరియు నంబర్‌ను డయల్ చేయడం. నెట్‌వర్క్ మీకు తగినంతగా లభించనప్పుడు స్మార్ట్‌ఫోన్ స్వయంచాలకంగా వై-ఫై కాలింగ్‌కు మారుతుంది.

Best Mobiles in India

English summary
How to Activate Wi-Fi Calling Feature on Android Phones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X