WhatsApp Payలో బ్యాంక్ అకౌంటును జోడించడం & తీసివేయడం ఎలా?

|

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యొక్క ప్లాట్‌ఫారమ్ లో పేమెంట్ ఫీచర్ ని కూడా తీసుకొనివస్తున్నది. దేశంలో వాట్సాప్ పే ను ఎక్కువ మంది వినియోగదారులు వినియోగించే దిశగా కృషి చేస్తున్నది. ఈ సర్వీస్ అందుబాటులోకి రావడంతో వినియోగదారులు తమ యొక్క స్నేహితులతో చాటింగ్ చేస్తున్న సమయంలోనే వారికి డబ్బును పంపడం మరియు స్వీకరించడం మరింత సులభం చేస్తుంది. ఈ మెసేజింగ్ యాప్ నుండి బయటకు రాకుండానే కస్టమర్‌లు కొనుగోలు చేయాలనుకుంటున్న ఉత్పత్తిని ఎంచుకుని దాని కోసం ఆన్ లైన్ పద్దతిలో చెల్లింపులు చేయడం ద్వారా ఈ ఫీచర్ ఆన్ లైన్ బిజినెస్లను మరింత సులభతరం చేసింది. కాబట్టి మీరు వాట్సాప్ పేకి కొత్త అయితే కనుక మీరు దీనికి బ్యాంక్ అకౌంటును ఎలా జోడించాలి మరియు ఇప్పటికే మీ అకౌంటులో ఉన్న బ్యాంక్‌ను తీసివేయడం ఎలా అన్న విషయం తెలియకుంటే కనుక ఈ దశల వారీ గైడ్ ను అనుసరించండి.

WhatsApp Payలో సెట్టింగ్స్ ద్వారా బ్యాంక్ అకౌంటును జోడించే విధానం

WhatsApp Payలో సెట్టింగ్స్ ద్వారా బ్యాంక్ అకౌంటును జోడించే విధానం

స్టెప్ 1: WhatsApp ఓపెన్ చేసి సెట్టింగ్‌ల విభాగానికి వెళ్లండి.

స్టెప్ 2: ఇప్పుడు పేమెంట్స్ విభాగానికి వెళ్లి ఆపై యాడ్ పేమెంట్ మెథడ్ ఎంపికను ఎంచుకోండి. 'కంటిన్యూ' బటన్‌పై నొక్కండి.

స్టెప్ 3: తర్వాత వాట్సాప్ పే కోసం నిబంధనలు మరియు గోప్యతా విధానాన్ని ఆమోదించడానికి అంగీకరించు బటన్‌ను నొక్కండ. ఆపై కొనసాగించు ఎంపిక మీద నొక్కండి.

స్టెప్ 4: ఇప్పుడు మీరు వాట్సాప్ పేతో లింక్ చేయగల బ్యాంకుల జాబితాను చూస్తారు. వీటిలో మీరు ఉపయోగిస్తున్న బ్యాంక్ పేరును ఎంచుకొని ఆపై SMS ద్వారా ధృవీకరించు ఎంపిక మీద నొక్కండి.

స్టెప్ 5: ధృవీకరణ కోడ్‌తో ముందే పూరించిన SMS మీ ఫోన్‌లో ఓపెన్ చేయబడుతుంది. ఈ మెసేజ్ ని పంపడానికి మరియు మీ అకౌంటును ధృవీకరించడానికి 'సెండ్' ఎంపిక మీద నొక్కండి.

స్టెప్ 6: తర్వాత వాట్సాప్ తో పేమెంట్లను పంపడానికి మరియు స్వీకరించడానికి మీరు జోడించాలనుకుంటున్న బ్యాంక్ అకౌంటును నొక్కండి.

స్టెప్ 7: పేమెంట్ పంపండి లేదా 'done' ఎంపిక మీద నొక్కండి.

 

చాట్‌ల నుండి వాట్సాప్ పేలో బ్యాంక్ అకౌంటును జోడించే విధానం

చాట్‌ల నుండి వాట్సాప్ పేలో బ్యాంక్ అకౌంటును జోడించే విధానం

స్టెప్ 1: WhatsAppని ఓపెన్ చేసి మీరు డబ్బును పంపాలనుకుంటున్న వ్యక్తి యొక్క చాట్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 2: ఇప్పుడు పేమెంట్ చిహ్నం ఎంపిక మీద నొక్కండి.

స్టెప్ 3: మీరు పంపాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి. నెక్స్ట్ ఎంపికపై నొక్కండి ఆపై స్టార్ట్ ఎంపిక మీద నొక్కండి.

స్టెప్ 4: ఇప్పుడు అంగీకరించు బటన్‌ను నొక్కండి. ఆపై కంపెనీ సర్వీస్ యొక్క నిబంధనలను ఆమోదించడానికి కంటిన్యూ ఎంపిక మీద నొక్కండి.

స్టెప్ 5: WhatsApp Payతో కనెక్ట్ చేయాలనుకుంటున్న మీ యొక్క బ్యాంక్ పేరును బ్యాంకుల జాబితా నుండి ఎంచుకోండి. ఆపై SMS ద్వారా ధృవీకరించు ఎంపిక మీద నొక్కండి.

స్టెప్ 6: ఇప్పుడు మీరు మీ ఫోన్‌లో ధృవీకరణ కోడ్‌తో కూడిన SMSని చూస్తారు. ఈ మెసేజ్ ని పొందడానికి మీ అకౌంటును ధృవీకరించడానికి పంపు అనే ఎంపిక మీద నొక్కండి.

స్టెప్ 7: WhatsAppతో పేమెంట్లను పంపడానికి మరియు స్వీకరించడానికి మీరు జోడించాలనుకుంటున్న బ్యాంక్ అకౌంటును ఎంచుకోండి. ఆపై కొనసాగించు ఎంపిక మీద నొక్కండి.

స్టెప్ 8: ఇప్పుడు మీ డెబిట్ కార్డ్ వివరాలను ధృవీకరించండి మరియు మీ పేమెంట్ మెసేజ్ కి తిరిగి రావడానికి నెక్స్ట్ ఎంపిక మీద నొక్కండి.

 

WhatsApp Payలో బ్యాంక్ అకౌంటును తొలగించే విధానం

WhatsApp Payలో బ్యాంక్ అకౌంటును తొలగించే విధానం

స్టెప్ 1: మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి.

స్టెప్ 2: సెట్టింగ్‌ల విభాగానికి వెళ్లి ఆపై పేమెంట్ విభాగానికి వెళ్లండి.

స్టెప్ 3: ఇప్పుడు మీరు తొలగించాలనుకుంటున్న బ్యాంక్ అకౌంట్ ను ఎంచుకోండి.

స్టెప్ 4: చివరగా WhatsApp Pay నుండి తీసివేయడానికి బ్యాంక్ అకౌంటును తీసివేయి ఎంపిక మీద నొక్కండి.

 

Best Mobiles in India

English summary
How to Add and Remove Your Bank Account in WhatsApp Pay

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X