Home
How to

SBI YONO యాప్‌లో లబ్ధిదారులను జోడించడం ఎలా?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చాలా కాలంగా SBI YONO (యు ఓన్లీ నీడ్ వన్) మరియు SBI YONO లైట్ యాప్ వంటి స్మార్ట్‌ఫోన్ యాప్‌లను అందుబాటులోకి తీసుకొనివచ్చింది. వీటి ద్వారా వినియోగదారులు ఆన్‌లైన్‌లో చాలా రకాల సేవలను పొందడానికి అనుమతిస్తుంది. ఈ రెండు యాప్‌లు డబ్బును పంపడం మరియు స్వీకరించడం, బిల్లులను చెల్లించడం మరియు రీఛార్జ్ చేయడం వంటి మరిన్ని అనేక ఫీచర్లను అందిస్తాయి. వినియోగదారులు తమ బ్యాంక్ బ్యాలెన్స్‌లను తనిఖీ చేయడానికి మరియు ఎలక్ట్రానిక్‌గా రూపొందించిన పాస్‌బుక్‌ను చూడటానికి కూడా అనుమతిస్తుంది.

How to Add Beneficiary in SBI YONO/ SBI YONO Lite App: Here are Full Details

SBI YONO యాప్‌ మీ అకౌంటుకు లబ్ధిదారులను జోడించడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది. అంతేకాకుండా వారి అకౌంట్ నంబర్‌ను సులభంగా సేవ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఆ తర్వాత తక్షణమే నిధులను పంపడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే దీన్ని ఎలా చేయాలి అని మీరు ఆలోచిస్తుంటే కనుక కింద తెలిపే విధానాలను అనుసరించి సులభంగా చేయవచ్చు.

SBI YONO యాప్‌లో లబ్ధిదారులను జోడించే విధానం

ముందుగా మీ యొక్క ఫోన్ లో SBI YONO యాప్ యొక్క తాజా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసినట్లు నిర్ధారించుకోండి. తర్వాత కింద తెలిపే దశలను అనుసరించండి.

How to Add Beneficiary in SBI YONO/ SBI YONO Lite App: Here are Full Details

(గమనిక: SBI యోనో మరియు SBI యోనో లైట్ యాప్‌లు రెండూ ఒకేలా ఉంటాయి. అయితే లైట్ యాప్ కొన్ని ఫీచర్లు లేని లోయర్-ఎండ్ పరికరాల కోసం మాత్రమే.)

1. మీ స్మార్ట్‌ఫోన్‌లో SBI YONO యాప్‌ని ఓపెన్ చేయండి.

2. మీ MPIN లేదా 'యూజర్ నేమ్' మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి యాప్‌ని లాగిన్ చేయండి.

3. ఇప్పుడు 'YONO pay ' ఎంపికపై ట్యాప్ చేయండి > బ్యాంక్ అకౌంటుపై నొక్కండి. (YONO లైట్ వినియోగదారులు 'ఫండ్ ట్రాన్స్‌ఫర్' ఎంపికపై క్లిక్ చేయండి.)

4. 'యాడ్/మేనేజ్ బెనిఫిషియరీ' ఎంపికపై నొక్కండి.

5. మీరు ముందుకు కొనసాగించడానికి మీ 'SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్‌వర్డ్'ని మళ్లీ జోడించాలి. మీరు అలా చేసిన తర్వాత 'సబ్మిట్' ఎంపికపై క్లిక్ చేయండి.

6. ఇప్పుడు లబ్ధిదారుని జోడించడానికి మీరు అతనికి చేసే పేమెంట్ ప్రక్రియ ద్వారా వెళ్లాలి. కాబట్టి దీనిని ప్రారంభించడానికి మీరు లబ్ధిదారు రకాన్ని ఎంచుకోవాలి. ఇందుకోసం 'సెలెక్ట్ బెనిఫిషియరీ టైప్' డ్రాప్-డౌన్ బటన్‌పై నొక్కండి.

How to Add Beneficiary in SBI YONO/ SBI YONO Lite App: Here are Full Details

7. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఇతర బ్యాంక్ అకౌంటుల మధ్య ఎంచుకోండి మరియు కొనసాగండి.

8. తరువాత ట్రాన్సఫర్ పరిమితి ఎంపికలో లబ్ధిదారుని అకౌంట్ యొక్క అన్ని వివరాలను జోడించండి. యాప్ లో మీకు చూపే గరిష్ట పరిమితిని ఎంచుకోండి. ఉదాహరణకు: రూ.10,00,000 ఎంపికను ఎంచుకొని తరువాత 'నెక్స్ట్' ఎంపిక మీద నొక్కండి. ఇప్పుడు మీరు ఈ లబ్ధిదారుని అకౌంటుకు కొంత మొత్తాన్ని పంపవలసి ఉంటుంది. మీరు రూ.1 ఎంచుకొని పే బటన్‌పై నొక్కండి.

9. తరువాత నిర్ధారణ కోసం OTP ని టైప్ చేయమని మీకు చెబుతుంది. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో ఇప్పుడే అందుకున్న OTPని జోడించి, నెక్స్ట్ ఎంపిక మీద నొక్కండి.

10. ఇప్పుడు 24 గంటలలోపు మీ లబ్ధిదారుని అకౌంట్ SBI యోనో/SBI యోనో లైట్ యాప్‌కి జోడించబడుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
How to Add Beneficiary in SBI YONO/ SBI YONO Lite App: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X