Home
How to

Instagram డైరెక్ట్ మెసేజ్(DM)లకు స్పెషల్ ఎఫెక్ట్‌లను జోడించడం ఎలా?

సోషల్ మీడియాలో చురుకుగా ఉండే వారికి ఇన్‌స్టాగ్రామ్ గురించి ప్రత్యేకంగా తెలుపవలసిన అవసరం లేదు. ఫేస్‌బుక్ యాజమాన్యంలో పనిచేసే ఇన్‌స్టాగ్రామ్ యాప్ తన యొక్క వినియోగదారులకు ఇప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందించడానికి అప్ డేట్ లను అందిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ యొక్క DMs లలో కొత్త కొత్త స్పెషల్ ఎఫెక్ట్‌లను జోడించింది.

How to Add Special Effects on Instagram Direct Messages

ఈ స్పెషల్ ఎఫెక్ట్‌లను ఉపయోగించవచ్చని మీకు తెలుసా? ఇటీవల కొత్త సాఫ్ట్‌వేర్ అప్ డేట్ తో ఫేస్‌బుక్ మెసెంజర్‌ను ఇన్‌స్టాగ్రామ్ DMలతో విలీనం చేసింది. అప్పటినుండి కస్టమ్ చాట్ కలర్, వానిష్ మోడ్, కస్టమ్ ఎమోజి రియాక్షన్స్ వంటి కొన్ని కొత్త ఫీచర్లను అదనంగా అందుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Instagram డైరెక్ట్ మెసేజ్ లకు స్పెషల్ ఎఫెక్ట్‌లను జోడించే విధానం

ఇన్‌స్టాగ్రామ్ యొక్క డైరెక్ట్ మెసేజ్‌లలో ప్రత్యేకమైన స్పెషల్ ఎఫెక్ట్‌లను జోడించే అద్భుతమైన అవకాశాన్ని అందిస్తున్నది. మీకు నచ్చిన వారికి కొన్ని ప్రత్యేకతలతో ప్రత్యుత్తరం ఇవ్వాలి అని ఆలోచిస్తున్న వారికి ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ ఎఫెక్ట్‌లను ప్రారంభించడానికి ఈ కింది దశలను అనుసరించండి.

How to Add Special Effects on Instagram Direct Messages

*** మొదటగా మీ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ యొక్క తాజా వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి లేదా అప్ డేట్ చేసుకోవాలి.

*** Instagramలో మీకు నచ్చిన వారి యొక్క చాట్ ఓపెన్ చేసి మీరు పంపవలసిన మెసేజ్ ను టైప్ చేయండి.

*** టెక్స్ట్ ఎంట్రీ ఫీల్డ్ పక్కన ఎడమ వైపున ఉన్న మాగ్నిఫైయర్ ను నొక్కండి.

*** తరువాత మీరు ఎంచుకోవడానికి నాలుగు కొత్త ఎఫెక్ట్‌లను చూస్తారు.

*** తరువాత ఇందులో మీకు నచ్చినదాన్ని ఎంచుకోండి.

అతి వేగంగా ప్రత్యుత్తరాలను ఇవ్వడానికి మెసేజ్ లను సేవ్ చేసే విధానం

How to Add Special Effects on Instagram Direct Messages

** మీరు ఇంతకు ముందు పంపిన మెసేజ్ ను సేవ్ చేయడానికి దానిపై ఎక్కువసేపు నొక్కి "సేవ్" ఎంపిక మీద నొక్కండి.

** సత్వరమార్గాన్ని(షార్ట్ కట్) కేటాయించమని మిమ్మల్ని అడుగుతారు దాన్ని ఎంటర్ చేసి సేవ్ నొక్కండి.

** మరొకరు పంపిన మెసేజ్ ను సేవ్ చేయడానికి దానిపై ఎక్కువసేపు నొక్కండి> మోర్ ఎంపిక మీద నొక్కండి> సేవ్ ఎంపిక మీద నొక్కండి. దానికి కూడా సత్వరమార్గం ఆదేశాన్ని కేటాయించండి.

** ఇది పూర్తిఅయిన తరువాత మీరు వేగంగా ప్రత్యుత్తరం పంపాలనుకున్నప్పుడు పూర్తి పదబంధాన్ని టైప్ చేయడానికి బదులుగా సత్వరమార్గాన్ని ఉపయోగించవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
How to Add Special Effects on Instagram Direct Messages
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X