Home
How to

వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్‌... ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లను లింక్‌ చేసుకోవచ్చు..!

వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. సాధారణంగా మనం వాట్సాప్‌లో చాట్ చేస్తున్నప్పుడు ఎవరికైనా మన ఇన్‌స్టాగ్రామ్ (Instagram), ఫేస్‌బుక్ (Facebook) అకౌంట్‌ వివరాలు షేర్‌ చేయాలంటే.. ఆ యాప్‌లోకి వెళ్లి, లింక్ కాపీ చేసి, మళ్లీ వాట్సాప్‌లో పేస్ట్ చేయాల్సి వచ్చేది. అయితే వాట్సాప్‌ ఈ కష్టాలకు చెక్ పెట్టింది. సోషల్ మీడియా ప్రొఫైల్ లింకింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది.

ఫీచర్ ఏంటి?
వాట్సాప్ ప్రొఫైల్‌ను డిజిటల్ విజిటింగ్ కార్డ్‌లా మారుస్తుంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాలను సులభంగా, శాశ్వతంగా.. వాట్సాప్‌ ప్రొఫైల్‌కు యాడ్ చేసుకోవచ్చు. ఎవరైనా వాట్సాప్ వివరాలు (Info) చూసినప్పుడు, అక్కడే ఉన్న లింక్‌లపై క్లిక్ చేసి నేరుగా మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌కు వెళ్లొచ్చు. అంటే ప్రతీసారి ఐడీలు, లింక్స్ షేర్ చేయాల్సిన అవసరం ఉండదు.

How to Add Your Instagram and Facebook Profiles to WhatsApp

ఈ ఫీచర్‌ను వినియోగించుకొనేందుకు ముందుగా మీ ఫోన్‌లోని వాట్సాప్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి లేటెస్ట్ వెర్షన్‌కు అప్డేట్ చేసుకోండి. అలాగే మీరు లింక్ చేయాలనుకుంటున్న ఫేస్‌బుక్, ఇన్‌స్టా అకౌంట్స్ మీ ఫోన్‌లో లాగిన్ కావాల్సి ఉంటుంది.

ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను లింక్ చేయడం ఎలా? :
వాట్సాప్ ఓపెన్ చేసి, కుడివైపు పైన ఉన్న మూడు చుక్కల మెనూపై క్లిక్ చేసి సెట్టింగ్స్ ఎంచుకోండి. మీ ప్రొఫైల్ ఫోటో, పేరు ఉన్న చోట క్లిక్ చేయండి. మీ ఫోన్ నంబర్ కింద Links అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ Add Link పై టాప్ చేయండి.

అనంతరం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఐకాన్లు కనిపిస్తాయి. ఇన్‌స్టాగ్రామ్ ఎంచుకోండి. వాట్సాప్ మీకు రెండు ఆప్షన్లు ఇస్తుంది. అవి Add Verified Link, Add Unverified Link వంటి రెండు ఆప్షన్‌లు ఉంటాయి. సాధారణ యూజర్లకు అన్‌ వెరిఫైడ్ లింక్ సరిపోతుంది.

అక్కడ మీ ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌నేమ్ టైప్ చేసి Verify Link ఆప్షన్‌పైన క్లిక్‌ చేయాలి. @ సింబల్ అవసరం లేదు. ఇది మిమ్మల్ని ఇన్‌స్టాగ్రామ్ యాప్‌కి తీసుకెళ్తుంది. అక్కడ Allow లేదా Yes, finish adding అనే ఆప్షన్‌ పైన క్లిక్ చేయాలి.

ఫేస్‌బుక్‌ కూడా :
ఫేస్‌బుక్ ప్రొఫైల్ ను కూడా ఇదే విధంగా లింక్‌ చేయాల్సి ఉంటుంది. ఇన్‌స్టా తరహలోనే లింక్ చేసుకోవచ్చు. వాట్సాప్ సెట్టింగ్స్ > ప్రొఫైల్ > లింక్స్ లోకి వెళ్లాలి. Add Link క్లిక్ చేసి, ఫేస్‌బుక్ ఐకాన్ ను ఎంచుకోవాలి. స్క్రీన్ మీద వచ్చే డేటా షేరింగ్ ప్రాంప్ట్‌కు 'కంటిన్యూ' పై క్లి్క్‌ చేయాలి.

అనంతరం మిమ్మల్ని ఫేస్‌బుక్ యాప్‌కి తీసుకెళ్తుంది. ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు ఉంటే, ఏ అకౌంట్‌ను లింక్‌ చేయాలో ఎంచుకోవాలి. చివరగా Add బటన్ క్లిక్‌ చేయాలి. దీంతో మీ ఫేస్‌బుక్ లింక్ కూడా వాట్సాప్ ప్రొఫైల్‌లో కనిపిస్తుంది.

అయితే ఈ విధానంలో లింక్ చేసిన ప్రొఫైల్స్‌ ఎవరికి కనిపించాలో, ఎంచుకొనే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా లింక్ మీద క్లిక్ చేస్తే Visibility సెట్టింగ్స్ వస్తాయి. అందులో Everyone అనే ఆప్షన్ ఆన్ చేస్తే, అందరికీ కనిపిస్తుంది. My Contacts ఎంపిక చేసుకుంటే, మీ ఫోన్‌లో సేవ్‌ చేసిన నంబర్లకు మాత్రమే కనిపిస్తుంది. Nobody సెలెక్ట్ చేసుకుంటే ఎవరికీ కనిపించదు.

More from GizBot

Best Mobiles in India

English summary
How to Add Your Instagram and Facebook Profiles to WhatsApp A Complete Step-by-Step Guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X