Home
How to

ఆన్‌లైన్‌ ద్వారా కలర్ ఓటరు ఐడి కార్డును పొందడం ఎలా??

భారతదేశంలో నివసించే వారికి ప్రతి ఒక్కరికి తమ గుర్తింపును తెలిపే డాక్యుమెంట్లలో ఓటరు ఐడి కార్డు అనేది అతి ముఖ్యమైన వాటిలో మొదటి వరుసలో ఉంటుంది. 18 ఏళ్లు పైబడిన ఎవరైనా సరే దీనిని దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది వినియోగదారులకు ఎన్నికల సమయంలో తమకు నచ్చిన వారికి ఓటును వేసే హక్కును ఇస్తుంది. ఈ కార్డును ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. అలాగే దీనిని ఎలక్టోరల్ ఫోటో ఐడి కార్డ్ (EPIC) అని కూడా పిలుస్తారు.

How to Apply Colour Voter ID Card Through online

మీరు ఇప్పటికే ఓటరు ఐడి కార్డును కలిగి ఉంటే కనుక అది ఖచ్చితంగా మీ యొక్క ఓటరు ఐడి ఫోటో, పేరు, చిరునామా, ఓటరు ఐడి నంబర్ మరియు ఇతర వివరాలను లామినేటెడ్ పేపర్ మీద ఉందని మీరు స్పష్టంగా గుర్తుంచుకోవచ్చు. భారత ఓటరు కమిషన్ వారి ఓటరు ఐడి కార్డు వివరాలను సరిదిద్దాలని కోరుకున్న వారికి మరియు ప్రస్తుత కొత్త ఓటర్లకు కలర్ ఓటరు ఐడి కార్డును ఇవ్వడం ప్రారంభించింది. మీ యొక్క బ్లాక్ అండ్ వైట్ వెర్షన్‌ ఐడి కార్డును కలర్ ఐడిగా మార్చాలని చూస్తున్న వారికి ప్రభుత్వం గొప్ప అవకాశం ఇస్తున్నది. కింద ఉన్న సాధారణ దశలను పాటించి సులభంగా కలర్ ఓటరు ఐడి కార్డ్ ను పొందవచ్చు,

How to Apply Colour Voter ID Card Through online

అవసరమైన డాక్యుమెంట్స్

** అడ్రస్ ప్రూఫ్

** వయస్సు రుజువు డాక్యుమెంట్ (మీరు 18 నుండి 21 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే)

** మీ ఫోటో

ఆన్‌లైన్‌లో కలర్ ఓటరు ఐడి కార్డును పొందే విధానం

*** Nvsp.in లో సందర్శించడం ద్వారా జాతీయ ఓటరు సేవా పోర్టల్ (NVSP) వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.

*** హోమ్‌పేజీ నుండి ఓటరు పోర్టల్ బాక్స్‌పై క్లిక్ చేయండి. అది మిమ్మల్ని https://voterportal.eci.gov.in పోర్టల్‌కు మళ్ళిస్తుంది

*** కొత్త వెబ్ పేజీలో "క్రీయేట్ న్యూ అకౌంట్" మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద తదుపరి స్టెప్ లను అనుసరించండి. లేదా ప్రత్యామ్నాయంగా మీరు పోర్టల్‌లో సైన్ అప్ చేయడానికి గూగుల్ అకౌంట్, ఫేస్‌బుక్ అకౌంట్, ట్విట్టర్ మరియు లింక్‌డిన్ అకౌంటును కూడా ఉపయోగించవచ్చు.

*** తరువాత ఫారం 6 ని పూరించండి. ఇందులో మీ ఫోటో మరియు మీ యొక్క ఇతర పూర్తి వివరాలను అప్‌లోడ్ చేసి సమర్పించండి

Best Mobiles in India

English summary
How to Apply Colour Voter ID Card Through online
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X