ఆన్‌లైన్‌లో Driving License అప్లై చేయ‌డం ఎలా! ఇది చ‌ద‌వండి!

|

ఇండియాలో ప్ర‌తి ఒక్క‌రూ ఏదైనా వాహ‌నం డ్రైవ్ చేస్తూ బ‌య‌ట‌కు రావాలంటే.. డ్రైవింగ్‌ లైసెన్స్ త‌ప్ప‌నిస‌రి. ఎందుకంటే.. ఇది మీరు ఒక వాహనాన్ని రోడ్ల‌పై నడపడానికి చట్టబద్ధంగా మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే ఈ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి చాలా మంది తిప్ప‌లు ప‌డుతుంటారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసే ప్ర‌క్రియ తెలియ‌క కార్యాల‌యాల చుట్టు తిరుగుతూ తంటాలు ప‌డుతుంటారు. కొన్ని సుల‌భ‌మైన స్టెప్స్ ఫాలో అయితే ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌కుండానే ల‌ర్నింగ్ లైసెన్స్ కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

 
ఆన్‌లైన్‌లో Driving License అప్లై చేయ‌డం ఎలా! ఇది చ‌ద‌వండి!

మీరు ఇంటిని వదిలి బ‌య‌టికి వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ మేము వివరిస్తాము. మీరు లెర్నర్స్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ, మీ లైసెన్స్ పొందడానికి మాత్రం మీరు ఆఫ్‌లైన్‌లో ప్రాసెస్ చేయవలసి ఉంటుందని గుర్తుంచుకోండి. అలాగే, కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండటం మరియు ట్రాఫిక్ నియమాలు మరియు నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ వయస్సు మరియు ఇతర అవసరాలను అందించడానికి మీరు చెల్లుబాటు అయ్యే పత్రాలను కూడా కలిగి ఉండాలి.

ఆన్‌లైన్‌లో Driving License అప్లై చేయ‌డం ఎలా! ఇది చ‌ద‌వండి!

ఇండియ‌లో ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి:
* ముందుగా ప్ర‌భుత్వ అధికారిక వెబ్‌సైట్ (https://parivahan.gov.in/parivahan/) లోకి వెళ్లాలి.
* వెబ్‌సైట్ ఓపెన్ అయిన త‌ర్వాత ఆన్‌లైన్ స‌ర్వీసెస్ సెక్ష‌న్ ఓపెన్ చేసి అందులో డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవ‌ల‌ను ఎంపిక చేసుకోవాలి.
* ఆ త‌ర్వాత మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారో ఎంపిక చేసుకోవాలి.
* ఇప్పుడు లెర్న‌ర్ లైసెన్స్ అప్లికేష‌న్ అనే ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి.
* అనంత‌రం అక్క‌డ పేర్కొన్న గైడ్‌లైన్స్ అన్ని పూర్తిగా చ‌దివి మీ వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను న‌మోదు చేయాలి.
* ఆ త‌ర్వాత మీ ఆధార్ మ‌రియు మొబైల్ నంబ‌ర్ ల‌ను న‌మోదు చేయాలి.
* ఇలా లెర్న‌ర్ లైసెన్స్ అప్లికేష‌న్ ఫారం పూర్తి చేసిన త‌ర్వాత అవ‌స‌ర‌మైన ధ్రువ‌ప‌త్రాల‌ను అప్‌లోడ్ చేయాలి.
* ఇక చివ‌ర‌గా మీ డ్రైవింగ్ టెస్ట్‌కి ఎప్పుడు వెళ్లాల‌నుకుంటున్నారో డేట్ ఎంపిక చేసుకుని పేమెంట్‌ను పూర్తి చేయాలి.
* ఈ ప్ర‌క్రియ పూర్తి చేసిన‌ట్ల‌యితే.. రు లెర్నింగ్ లైసెన్స్ ఆన్‌లైన్ ప్ర‌క్రియ అయిపోయింద‌ని నిర్దారించుకోవాలి.

ఈ స్టెప్స్ ఫాలో అవ‌డం ద్వారా మీరు లెర్నర్స్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి RTO వద్దకు వెళ్లవలసిన అవసరం లేదు. ముఖ్యంగా, యూపీ స‌హా ప‌లు రాష్ట్రాల్లో మీరు RTOను సందర్శించకుండానే లెర్నర్ లైసెన్స్ పొందవచ్చు మరియు పరీక్షను కూడా ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయ‌వ‌చ్చు.

ఆన్‌లైన్‌లో Driving License అప్లై చేయ‌డం ఎలా! ఇది చ‌ద‌వండి!

అదేవిధంగా, మ‌న ఆధార్ కార్డు పోగొట్టుకుపోయిన‌ప్పుడు ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు ఎలా పొందాల‌నే ప్ర‌క్రియ‌ను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం:
Aadhaar Card డౌన్‌లోడ్ చేసే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌:
* ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. లింక్: (https://uidai.gov.in/my-aadhaar/get-aadhaar.html)
* UIDAI వెబ్‌సైట్లోకి ఎంట‌ర్ అయిన త‌ర్వాత "మై ఆధార్‌" సెక్ష‌న్‌పై క్లిక్ చేయాలి.
* మై ఆధార్ సెక్ష‌న్‌లో కింద కొన్ని ఆప్ష‌న్‌లు క‌నిపిస్తాయి. వాటిలో డౌన్‌లోడ్ ఆధార్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని ఎంపిక చేసుకోవాలి.
* ఇప్పుడు మీకు లాగిన్ విత్ ఆధార్ అండ్ ఓటీపీ అని ఒక బ‌ట‌న్ క‌నిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
* అనంత‌రం మీ ఆధార్ నంబ‌ర్ టైప్ చేసిన త‌ర్వాత, రిజిస్ట‌ర్‌డ్ మొబైల్ నంబ‌ర్‌కు వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేసి లాగిన్ బ‌ట‌న్ క్లిక్ చేయాలి.
* లాగిన్ విజ‌య‌వంతం అయిన త‌ర్వాత మీకు మీ డౌన్‌లోడ్ ఆధార్ కార్డు ఆప్ష‌న్ క్లిక్ చేస్తే మీకు కార్డు ఓపెన్ అవుతుంది.
* అక్క‌డే డౌన్‌లోడ్ ఆధార్ కార్డు అనే ఆప్ష‌న్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీ ఆధార్ కార్డును మీరు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
* అయితే, ఇక్క‌డ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. డౌన్‌లోడ్ అయిన ఆధార్ ఫైల్ ను మీరు ఓపెన్ చేయ‌డానికి పాస్‌వ‌ర్డ్ అడుగుతుంది.
* ఆ పాస్‌వ‌ర్డ్‌ ఏంటంటే.. మీ పేరులోని నాలుగు అక్ష‌రాలు, మీరు పుట్టిన సంవ‌త్స‌రం అంకెలు టైప్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది.
ఉదాహ‌ర‌ణ‌కు.. మీ పేరు AVINASH, పుట్టిన సంవ‌త్స‌రం 1990 అనుకుంటే, పాస్ వ‌ర్డ్ వ‌చ్చేసి.. పేరులో మొద‌టి 4 అక్ష‌రాలు.. పుట్టిన సంవ‌త్స‌రం అంకెలు క‌లిపి AVIN1990 అని టైప్ చేయాలి. ఇక మీ ఆధార్ మీకు క‌నిపిస్తుంది.
* ఇలా ఈ ప‌ద్ద‌తిని ఉప‌యోగించి ఎవ‌రైనా త‌మ ఆధార్‌కార్డు పోతే.. కొత్త‌ది మ‌ళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

Best Mobiles in India

English summary
How to apply Driving License online in india

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X