Home
How to

వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేషన్‌ గడువు ముగుస్తుందా.. ఆన్‌లైన్‌ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోండి?

వాహనం రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేషన్‌ (RC) గడువు 15 సంవత్సరాలపాటు ఉంటుంది. న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ముగింపు తేదీకి ముందే రెన్యువల్ చేసుకోవడం ఉత్తమం. ఇందుకు ఆన్‌లైన్‌ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు ( How to Renewal Vehicle Registration Certificate ). కేంద్ర మోటార్‌ వెహికల్‌ చట్టం నిబంధనల ప్రకారం ప్రైవేటు వాహనాల రిజిస్ట్రేషన్‌ గడువు 15 సంవత్సరాల వరకు ఉంటుంది. అనంతరం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్‌ చేసుకోవాలి.

వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్‌ రెన్యువల్‌ దరఖాస్తు చేసుకొనేందుకు ఏమేం కావాలి ?
వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేషన్‌ ముగిసే 60 రోజుల ముందుగానే ఫారమ్‌ 25 ను సంబంధిత అధికారులకు సమర్పించాలి. దీంతోపాటు రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకొనే సమయానికి వాహనానికి సంబంధించిన ట్యాక్స్‌లను చెల్లించాలి. దీంతోపాటు రెన్యువల్‌ ఫీజును కూడా చెల్లించాల్సి ఉంటుంది.

how to apply for renewal of vehicle registration certificate through online news

ఈ సర్టిఫికేట్‌లు కావాల్సి ఉంటుంది :
ఆన్‌లైన్ ద్వారా వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్‌ (RC) రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకొనేందుకు ఫారమ్‌ 25, PUC (పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌) సర్టిఫికేట్‌, ప్రస్తుత RC, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌, ప్రస్తుత రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్, రోడ్ ట్యాక్స్‌ కు సంబంధించిన పత్రాలు, వాహన బీమా పత్రాలు, PAN కార్డు వంటి పత్రాలు అందుబాటులో పెట్టుకోవాలి.

స్టెప్‌ 1 : parivahan.gov.in వెబ్‌సైట్‌ నుంచి ఫారమ్‌ 25 ను డౌన్‌ లోడ్‌ చేసుకొవాలి. అందులో అవసరమైన సమాచారాన్ని నింపాలి. మీ సమీపంలోని RTO లో సమర్పించేందుకు సిద్ధం చేయాలి.
స్టెప్‌ 2 : రెన్యువల్‌ కోసం పైన తెలిపిన సర్టిఫికేట్‌ లను అందుబాటులో ఉంచుకోవాలి.

స్టెప్‌ 3 : వాహన తనిఖీకి సంబంధించిన స్లాట్‌ ను ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవాలి.
స్టెప్‌ 4 : వాహనానికి సంబంధించిన అన్ని ట్యాక్స్‌ లు చెల్లించాలి.
స్టెప్‌ 5 : వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేషన్‌ రెన్యువల్‌ దరఖాస్తు ఫీజును RTO లో చెల్లించాలి.
స్టెప్‌ 6 : రవాణా శాఖ కార్యాలయంలో అన్నిరకాల వాహన తనిఖీలు సహా సంబంధిత పత్రాల పరిశీలన అనంతరం కొత్త RC ను పొందవచ్చు.

వాహన RC ను సకాలంలో పూర్తి చేయడం వల్ల అకస్మిక తనిఖీలు సహా ఇతర సందర్భాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాగించవచ్చు. దీంతోపాటు తనిఖీల సమయంలో జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు. ఏదైనా ప్రమాదం జరిగిన సందర్భంలో బీమా సహా ఇతర సేవలను సులభంగా పొందవచ్చు. అందువల్ల వాహన రిజిస్ట్రేషన్‌ ముగిసే నాటికంటే ముందుగానే రెన్యువల్‌ చేసుకోవడం ఉత్తమం.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
how to apply for renewal of vehicle registration certificate through online
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X