పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్‌కు అప్లయి చేయడం ఎలా ?

ప్రతి ఒక్కరికి వెహికల్ అనేది సర్వసాధారణం అయిన నేపథ్యంలో పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ వస్తే చాలా ఓ పనయిపోతుందని చాలామంది అనుకోవడం సహజం.

|

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరికి వెహికల్ అనేది సర్వసాధారణం అయిన నేపథ్యంలో పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ వస్తే చాలా ఓ పనయిపోతుందని చాలామంది అనుకోవడం సహజం. కాగా కొంతమంది లెర్నర్ లైసెన్స్ ఉంటే చాలని అనుకుంటారు. అయితే ఇది చాలా తప్పు. లెర్నర్స్ లైసెన్స్ అనేది మోటారు వాహనం నేర్చుకునేందుకు అనుమతి మాత్రమే. కనుక లెర్నర్స్ లైసెన్స్ తీసుకున్న ప్రతి ఒక్కరూ నెల రోజుల తర్వాత నుంచి ఆరు నెలలలోపు పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకుని నిర్ణీత పరీక్ష పాసవ్వాల్సి ఉంటుంది. మరి ఏం టెస్టులు పాసవ్వాలి. పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అప్లయి చేయాలి ఇలాంటి విషయాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఎయిర్‌టెల్‌ 1200జీబీ హై స్పీడ్ డేటా ప్లాన్, అపరిమిత కాల్స్ !ఎయిర్‌టెల్‌ 1200జీబీ హై స్పీడ్ డేటా ప్లాన్, అపరిమిత కాల్స్ !

డ్రైవింగ్ లైసెన్స్‌లో రెండు రకాలు..

డ్రైవింగ్ లైసెన్స్‌లో రెండు రకాలు..

సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్‌లో రెండు రకాలు ఉంటాయి.
1. వ్యక్తిగత వాహనాలు నడిపే లైసెన్స్ ( నాన్ కమర్షియల్ )
2. వాణిజ్య వాహనాలు నడిపే లైసెన్స్ ( కమర్షియల్ )
ఇందులో నాన్ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ కు లెర్నర్స్ లైసెన్స్ తీసుకుని 30 రోజులు దాటి ఉండాలి. వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. నాన్ కమర్షియల్ లైసెన్స్ లను 20 ఏళ్ల కాల పరిమితితో జారీ చేస్తారు. ప్రతి ఐదేళ్లకోసారి రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి.
పర్మినెంట్ కమర్షియల్ డీఎల్ తీసుకోవాలంటే అప్పటికే సాధారణ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని రెండు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం కలిగి ఉండాలి. 20 ఏళ్లు నిండిన వారికి మాత్రమే దీన్ని జారీ చేస్తారు. కమర్షియల్ లైసెన్స్ ను మూడేళ్ల కాల పరిమితితో జారీ చేస్తారు. రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఎలా ?

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఎలా ?

రవాణా శాఖ కార్యాలయానికి నేరుగా వెళ్లి పర్మినెంట్డ్రైవింగ్ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్ లో ముందుగా మీకంటూ ఫలానా తేదీన ఫలానా సమయాన్ని బుక్ చేసుకుని... ఆ సమయానికి వెళ్లి పరీక్షలో పాల్గొనవచ్చు.
https://aptransport.in/apcfstonline/ (Andhra pradesh website)
https://aptransport.in/tgcfstonline/ ( Telangana website)

రవాణా శాఖ వెబ్ సైట్ లోకి..

రవాణా శాఖ వెబ్ సైట్ లోకి..

ఏపీ అభ్యర్థులు అయితే, మొదటి లింక్ ద్వారా... తెలంగాణ అభ్యర్థులు అయితే రెండో లింక్ ద్వారా రవాణా శాఖ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. పేజీ పైభాగంలో ఎడమచేతి వైపు లైసెన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే డ్రైవింగ్ టెస్ట్ స్లాట్ అవైలబిలిటీ, డ్రైవింగ్ టెస్ట్ స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ముందుగా స్లాట్ అవైలబిలిటీలోకి వెళ్లి చూస్తే ఏ తేదీల్లో స్లాట్లు అందుబాటులో ఉన్నాయో తెలుస్తుంది.

స్లాట్ బుకింగ్ లోకి వెళ్లి..

స్లాట్ బుకింగ్ లోకి వెళ్లి..

ఆ తర్వాత స్లాట్ బుకింగ్ లోకి వెళ్లి ఒక తేదీని ఎంపిక చేసుకుని వివరాలను నమోదు చేయడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని ప్రింట్ తీసి పెట్టుకోవాలి. నిర్ణీత తేదీ, సమయానికి గంట ముందుగా రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లేటపుడు అన్ని రకాల పత్రాలను తీసుకెళ్లాలి.

పత్రాలు ఇవే

పత్రాలు ఇవే

అప్లికేషన్ ఫామ్ నంబర్ 4 తోపాటు పుట్టిన తేదీ, నివాస, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు, లెర్నర్స్ లైసెన్స్, ఇటీవల దిగిన 4 పాస్ పోర్ట్ సైజు ఫొటోలు తీసుకెళ్లాలి. కమర్షియల్ లైసెన్స్ కోసం అయితే అప్పటికే ఉన్న లైసెన్స్ కార్డు, ఏదేనీ గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్ జారీ చేసిన ఫామ్ నంబర్ 5 ట్రెయినింగ్ సర్టిఫికెట్, మెడికల్ సర్టిఫికెట్లను జత చేయాల్సి ఉంటుంది. వాహనంతో పాటు ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సహా అన్ని రకాల పత్రాలను వెంట తీసుకెళ్లాలి.

వేలి ముద్రలు, ఫొటో..

వేలి ముద్రలు, ఫొటో..

రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లిన తర్వాత ముందుగా ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత కౌంటర్లో నిర్ణీత పత్రాలను సిబ్బంది తనిఖీ చేస్తారు. బయో మెట్రిక్ విధానంలో వేలి ముద్రలు, ఫొటోను తీసుకుని చేతికి ఓ బ్యాండ్ వేస్తారు. ఆ తర్వాత మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. డ్రైవింగ్ టెస్ట్ లో ఫెయిల్ అయితే వారం రోజుల తర్వాత మరోసారి పరీక్షకు హాజరు కావచ్చు.

పరీక్షా విధానం

పరీక్షా విధానం

ద్విచక్ర వాహనదారులు తమ వాహనంపై బయల్దేరి 8 ఆకారంలో ఉన్న రోడ్డులో ఒక రౌండ్ వేయాల్సి ఉంటుంది. ప్రారంభమైన దగ్గర నుంచి తిరిగి అక్కడికి చేరుకునే వరకు కాలు కింద మోపరాదు. నిర్ణీత సమయంలోపు ఈ డ్రైవింగ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

అదే లైట్ మోటారు వెహికల్స్ (కారు) లైసెన్స్ కోసం డ్రైవింగ్ టెస్ట్ లో భాగంగా 8 ఆకారంలో ఉన్న రోడ్డులో వాహనాన్ని సమర్థవంతంగా డ్రైవ్ చేయగలగాలి. ఎత్తు వాలులో ఉన్న రోడ్డులో వాహనం వెనక్కి రాకుండా (జారకుండా) ముందుకు నడపాలి. అదే విధంగా 8 ఆకారంలో ఉన్న రోడ్డులో కారును వెనక్కి (రివర్స్ డైరెక్షన్) నడపాల్సి ఉంటుంది.

లైసెన్స్ కార్డు పోతే

లైసెన్స్ కార్డు పోతే

ఒరిజినల్ లైసెన్స్ పొగొట్టుకున్నా, లైసెన్స్ దారుడి రూపురేఖల్లో మార్పులు వచ్చి కొత్త ఫొటోతో అప్ డేట్ చేసుకోదలిచినా లేక కార్డు దెబ్బతిన్నా కొత్త లైసెన్స్ కార్డు తీసుకోవచ్చు. ఇందుకోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి సంబంధిత కౌంటర్ లో ఎల్ఎల్డీ ఫామ్ సమర్పించాలి. దానితోపాటు నివాస, ఫొటో ధ్రువీకరణ పత్రాలను, ఒక పాస్ పోర్ట్ సైజు ఫొటో, దెబ్బతిన్న కార్డును వారికి చూపించి నిర్ణీత ఫీజు చెల్లించిన తర్వాత వేరొక కౌంటర్ లో సిబ్బంది వేలి ముద్రలు, ఫొటో తీసుకున్న తరువాత వారు కొత్త లైసెన్స్ జారీ చేస్తారు.

రెన్యువల్ కు

రెన్యువల్ కు

లైసెన్స్ కాల పరిమితి ముగుస్తున్న క్రమంలో దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి ఫామ్ 9 సమర్పించాలి. అలాగే శారీరక సామర్థ్యాన్ని తెలియజేస్తూ ఫామ్ 1, 50 ఏళ్లు దాటిన వారు, వాణిజ్య వాహనాల లైసెన్స్ దారులు ఫామ్ 1ఏ(మెడికల్ సర్టిఫికెట్), ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డు, రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోలను కౌంటర్ లో సమర్పించాల్సి ఉంటుంది. నిర్ణీత ఫీజు కూడా చెల్లించాలి. కార్డు గడువు తీరి పోయిన 5 ఏళ్ల తర్వాత దరఖాస్తు చేసుకుంటే మాత్రం తిరిగి మళ్లీ డ్రైవింగ్ టెస్ట్ లో పాసవ్వాలి.

Best Mobiles in India

English summary
how to apply for permanent driving license in andhra pradesh More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X