పార్కింగ్ లొకేషన్‌ మరిచిపోతున్నారా, ఇకపై Google Assistantకు అప్పజెప్పండి

|

2018 ఇంటర్నేషనల్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్‌లో భాగంగా సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన Google Assistant యాప్‌కు సంబంధించి సరికొత్త ఫీచర్లను అనౌన్స్ చేసింది. వాటిలో ఒకటైన ట్రాక్ ఫీచర్ ద్వారా గూగుల్ మ్యాప్స్‌లో పిన్ చేయబడిన మీ వెహికల్ పార్కింగ్ లొకేషన్‌ను గూగుల్ అసిస్టెంట్ యాప్ గుర్తుపెట్టు కోగలుగుతుంది. మనలో చాలా మంది యూజర్లు వెహికల్ పార్క్ చేసిన లొకేషన్‌ను మర్చిపోతుంటారు. ఇటువంటి సమస్యను ఫేస్ చేస్తున్న వారు తమ వెహికల్ పార్కింగ్ లోకేషన్‌ను గూగుల్ మ్యాప్‌లో పిన్ చేసి ఆ పనిని గూగుల్ అసిస్టెంట్‌కు అప్పజెప్పినట్లయితే మీ పార్కింగ్ లొకేషన్‌ను ఖచ్చితమైన రూట్ మ్యాప్‌తో గూగుల్ అసిస్టెంట్ చూపిస్తుంది. ఈ ఫీచర్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎనేబుల్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ క్రింది ప్రొసీజర్‌ను ఫాలో అవ్వండి...

 

యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించిన BSNLయూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించిన BSNL

పార్కింగ్ లొకేషన్‌ మరిచిపోతున్నారా, ఇకపై Assistantకు అప్పజెప్పండి

ముందుగా మీరు చేయవల్సిన పనులు..
పార్కింగ్ లొకేషన్‌ ట్రాకింగ్ ఫీచర్ మీ స్మార్ట్‌ఫోన్‌లో వర్క్ అవ్వాలంటే మీ డివైస్ Android Marshmallow ఆపై వెర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవ్వాల్సి ఉంటుంది. తదుపరి స్టెప్‌లో భాగంగా మీ డివైస్‌లోని గూగుల్ అసిస్టెంట్ అప్లికేషన్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. యాప్‌ను అప్‌డేట్ చేసుకున్న తరువాత ఫోన్ లొకేషన్ సర్వీసెస్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. ఇదే సమయంలో గూగుల్ అసిస్టెంట్ సర్వీసెస్‌ను వాయిస్ కమాండ్స్‌తో కాన్ఫిగర్ చేసుకోవల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన అన్ని పర్మిషన్స్‌ను మీరు గ్రాంట్ చేయవల్సి ఉంటుంది.

వన్‌ప్లస్‌కు దడపుట్టించిన షియోమి,Mi 8 రికార్డు అమ్మకాలువన్‌ప్లస్‌కు దడపుట్టించిన షియోమి,Mi 8 రికార్డు అమ్మకాలు

పార్కింగ్ లొకేషన్‌ను సేవ్ చేసుకునేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..
ముందుగా Ok Google' కమాండ్‌తో గూగుల్ అసిస్టెంట్‌ను ఓపెన్ చేయండి. గూగుల్ అసిస్టెంట్‌ ఓపెన్ అయిన తరువాత 'Remember where I parked' అనే కమాండ్‌ను మీరు అప్లై చేసిన వెంటనే గూగుల్ అసిస్టెంట్ జీపీఎస్‌తో కోఆర్డినేట్ అయి స్పెషల్ పార్కింగ్ పిన్‌ను ఏర్పాటు చేస్తుంది. ఆ తరువాత పార్కింగ్ లోకేషన్‌ను రిట్రీవ్ చేసుకుని నేవిగేషన్ ప్రారంభిస్తుంది.

అందుబాటులో రెండు రకాల ప్రొసీజర్స్...
పార్క్ చేసి ఉన్న కారుకు సంబంధించి లొకేషన్‌ను తెలసుకునేందుకు రెండు రకాల ప్రొసీజర్స్ అందుబాటులో ఉన్నాయి. మొదటి ప్రొసీజర్ లో భాగంగా ముందుగా Ok Google' కమాండ్‌తో గూగుల్ అసిస్టెంట్‌ను ఓపెన్ చేయాలి. యాప్ ఓపెన్ అయిన తరువాత 'Where's my car' అని అడిగినట్లయితే పార్కింగ్ లొకేషన్ కు సంబంధించి టర్న్ బై టర్న్ నేవిగేషన్ స్టార్ట్ అయి పోతుంది. రెండవ ప్రొసీజర్‌లో భాగంగా గూగుల్ మ్యాప్స్‌ను ఓపెన్ చేసి 'Saved parking' కార్డ్ పై టాప్ చేయాలి. ఆ తరువాత స్టార్ట్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే టర్న్ ఆన్ టర్న్ నేవిగేషన్ స్టార్ట్ అవుతుంది.

Best Mobiles in India

English summary
Many of us must have faced this problem of forgetting the location of your parked vehicle. But fret not, now you can ask your Google Assistant to remember your parked vehicle location and it will pin it on your map. If you want to use this feature then follow the steps below.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X