మీ విండోస్ కంప్యూటర్‌లో పనికిరాని ఫైల్స్ పేరుకుపోతున్నాయా..?
పనికిరాని ఫైల్స్ అనేవి కంప్యూటర్‌లో పేరుకుపోవటం వల్ల డివైస్ పనితీరు పూర్తిగా మందగించటం జరుగుతుంది.
పనికిరాని ఫైల్స్ అనేవి కంప్యూటర్‌లో పేరుకుపోవటం వల్ల డివైస్ పనితీరు పూర్తిగా మందగించటం జరుగుతుంది. స్టోరేజ్ స్పేస్‌ను ఆక్రమించేసుకుని నిరుపయోగంగా మారే అన్‌యూజుడ్ ఫైల్స్ వల్ల యూజర్‌కు ఎటువంటి ఉపయోగం ఉండదు. విండోస్ కంప్యూటర్స్‌లో పేరుకుపోయే అన్‌యూజుడ్ ఫైల్స్‌ను ఆటోమెటిక్‌గా క్లియర్ చేసుకునేందుకుగాను ఓ సరికొత్త ఫీచర్‌ను మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Storage Sense పేరుతో సరికొత్త ఫీచర్...
పనికిరాని ఫైల్స్‌ను ఆటిమెటిక్‌గా క్లియర్ చేసేందుకుగాను Storage Sense పేరుతో సరికొత్త ఫీచర్‌ను విండోస్ 10 ద్వారా మైక్రోసాఫ్ట్ పరిచయం చేసింది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే ముందుగా ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. స్టోరేజ్ సెన్స్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలనుకునే యూజర్లు ముందుగా విండోస్ ఐకాన్ పై క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్లిన తరువాత అనేక ఆప్షన్స్ మీకు దర్శనమిస్తాయి. వాటిలో System tabను మీరు సెలక్ట్ చేసుకోవ్సి ఉంటుంది.

ఎప్పటికప్పుడు డిలీట్ కాబడుతుంటాయి...
సిస్టం ట్యాబ్‌ను సెలక్ట్ చేసుకున్న వెంటనే మరో స్ర్కీన్‌లోకి మీరు రీచ్ అవుతారు. ఈ స్ర్కీన్‌లో ఎడమచేతి వైపు క్యాటగిరీస్ పేరుతో ఓ సెక్షన్ మీకు కనిపిస్తుంది. ఈ సెక్షన్‌లో స్టోరేజ్ ఆప్షన్ ఒకటి మీకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మరొకొన్ని ఆప్షన్స్‌తో కూడిన మెనూ ఒకటి స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. ఈ మెనూలో Storage sense అనే ఆప్షన్‌ను మీరు సెలక్ట్ చేసుకుని ఎనేబుల్ చేసుకున్నట్లయితే నిరుపయోగంగా ఉన్న ఫైల్స్ ఎప్పటికప్పుడు డిలీట్ కాబడుతుంటాయి.

కావల్సిన మేర డిలీట్ చేసుకునే వీలు..
మైక్రోసాఫ్ట్ అందిస్తోన్న అత్యత్తమ ఆపరేటింగ్ సిస్టంలలో విండోస్ 10 ఒకటి. ఈ ఓఎస్ ఎప్పటికప్పుడు యూజర్ యాక్టివిటీ హిస్టరీని సేకరించటంతో పాటు దానికి కంప్యూటర్ అలానే క్లౌడ్‌లలో భద్ర పరుస్తుంటుంది. యూజర్లు ఈ డేటాను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ కావల్సిన మేర డిలీట్ చేసుకునే వీలుంటుంది.

హిస్టరీని క్లియర్ చేయాలనుకుంటోన్నట్లయితే..
విండోస్ 10లో బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేయాలనుకుంటోన్నట్లయితే ముందుగా మీ డివైస్‌లోని సెట్టింగ్స్ విభాగంలోకి వెళ్లి ‘ ప్రైవసీ ' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత ఓపెన్ అయ్యే మెనూలో యాక్టివిటీ హిస్టరీ అనే మరో ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని క్లియర్ యాక్టివిటీ హిస్టరీ ఆప్షన్ క్రింద క్రింద కనిపించే క్లియర్ బటన్ పై క్లిక్ చేయటం ద్వారా మీ బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేసుకునే వీలుంటుంది.


Click it and Unblock the Notifications