ఇంటర్నెట్ వ్యసనాన్ని తగ్గించుకోవటం ఎలా..?
నేటి ఆదునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో ఇంటర్నెట్ గురించి తెలియని వారంటూ ఉండరేమో!. సోషల్ మీడియా పుణ్యమంటూ అంటూ ఇంటర్నెట్ మరింతగా విస్తరించేసింది. మంచి ఉన్నచోటే చెడు కూడా ఉన్నట్లు, ఇంటర్నెట్ ఉపయోగకరమైన కమ్యూనికేషన్ సాధనం అయినప్పటికి ఈ వ్యవస్థ వల్ల దుష్ప్రభావాలు కూడా అనేకం ఉన్నాయి.

Read More : రూ.6,999లో ఏది బెస్ట్ ఫోన్..?
వెబ్ బ్రౌజింగ్‌ను ఓ వ్యసనంలా అలవర్చుకుని ఆ ఊబిలో చిక్కుకుపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని పలు సర్వేలు ఆందోళణ వ్యక్తం చేస్తున్నాయి. అందుకే కాబోలు బెంగుళూరు లాంటి ప్రముఖ నగరాల్లో ఇంటర్నెట్‌కు బానిసైన వారిని రక్షించేందుకు ప్రత్యేక క్లినిక్‌లు ఏర్పడ్డాయి. ఇంటర్నెట్ వ్యసనాన్ని తగ్గించుకునేందుకు పలు సూచనలు...

టిప్ 1
ఇన్‌స్టెంట్ మెసేజింగ్‌కు బదులుగా మొబైల్ కాల్స్‌కు ప్రాధాన్యతనివ్వండి. కంప్యూటర్ ముందు కూర్చొని మీల్స్ చేయకండి.

టిప్ 2
ఇంటర్నెట్ బ్రౌజింగ్ కంటూ రోజు కొంత సమయాన్నే కేటాయించుకోండి. ఇలా చేయటం వల్ల క్రమంగా ఇంటర్నెట్ వ్యసనం నుంచి బయటపడతారు.

టిప్ 3
మిత్రులతో కలిసి తరచూ అవుట్ డోర్ ట్రిప్స్ ప్లాన్ చేసుకోవటం ద్వారా ఇంటర్నెట్ మీద ధ్యాసను తగ్గించుకోవచ్చు.

టిప్ 4
ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు కేటాయించే సమయాన్ని ఇతర పనులకు కేటాయించటం ద్వారా ఇంటర్నెట్ పై దృష్టిని మరల్చుకొవచ్చు.

టిప్ 5
ఇంటర్నెట్ వ్యసనాన్ని తగ్గించుకునే క్రమంలో మీ కుటుంబ సభ్యులకు ఇంటి పనుల్లో సహాయపడండి.

టిప్ 6
పుస్తకాలు చదివేందుకు ఎక్కువ సమయాన్ని కేటాయించటం వల్ల ఇంటర్నెట్ వ్యసనాన్ని తగ్గించుకోవచ్చు.

టిప్ 7
ఇంటర్నెట్‌తో సంబంధంలేని విషయాల పట్ల ఆసక్తిని పెంచుకోండి. తద్వారా, మీ దృష్టి వేరొక పని పై కేంద్రీకృతమవుతుంది.

టిప్ 8
సంకల్పం, ఏకాగ్రత మీలో ఉంటే ఇంటర్నెట్ వ్యసనాన్ని పూర్తిగా మీ నియంత్రణలోకి తీసుకురావచ్చు.


Click it and Unblock the Notifications








