Home
How to

Location Tracking తో ఆందోళన చెందుతున్నారా.. సెట్టింగ్స్‌లో ఇలా మార్పులు చేసుకోండి..!

టెక్నాలజీ ప్రస్తుతం చాలా అభివృద్ధి చెందింది. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. తక్కువ ధరకే మెరుగైన ఫీచర్‌లతో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లతో ఇంటి నుంచే చాలా పనులు చేస్తున్నాం. బ్యాంకింగ్‌ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ వరకు అన్నింటికీ ఉపయోగిస్తున్నాం. సోషల్‌ మీడియా, గేమింగ్‌తోపాటు అనేక రకాలుగా ఉపయోగిస్తున్నాం.

అదే స్థాయిలో ప్రైవసీ సమస్యలు :
అయితే అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో ఎంత ఉపయోగం ఉందో.. సుమారుగా అదే స్థాయిలో ప్రైవసీ సమస్యలు కూడా ఉన్నాయి. దీంతోపాటు ఆన్‌లైన్ స్కామ్, హ్యాకింగ్‌ వంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. వీటితోపాటు లొకేషన్‌ ట్రాకింగ్‌ (Location Tracking) చాలా మందికి ఆందోళన కలిగిస్తోంది.

how to avoid Location Tracking in smartphone

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్న చాలా యాప్స్‌ లొకేషన్‌ వివరాలను ట్రాక్‌ చేస్తుంటాయి. దీని ఆధారంగా కొన్నిసార్లు మీకు వివిధ రకాల యాడ్స్‌ కూడా కనిపిస్తాయి. దీంతో చాలా మంది ప్రైవసీ పై ఆందోళన చెందుతుంటారు. లొకేషన్‌ ట్రాకింగ్‌ కొన్నిసార్లు తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం కూడా ఉంటుంది.

ఎలాంటి మార్పులు చేయాలి :
స్మార్ట్‌ఫోన్‌లోని కొన్ని సెట్టింగ్స్‌లో మార్పులు చేయడం వల్ల లొకేషన్ ట్రాకింగ్‌ జరగకుండా కాపాడుకోవచ్చు. దీంతోపాటు యాప్స్‌కు ఇచ్చిన లొకేషన్‌ అనుమతులు కూడా నిలిపివేసేందుకు అవకాశం ఉంటుంది. ఫోన్‌, యాప్ సెట్టింగ్స్‌ మార్పులతో లొకేషన్‌ ట్రాకింగ్‌ను నిలువరించవచ్చు.

ఫోన్‌ సెట్టింగ్స్‌ ద్వారా లొకేషన్‌ ట్రాకింగ్‌ను ఎలా ఆఫ్‌ చేయాలి ?
- తొలుత స్మార్ట్‌ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం గూగుల్‌ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- గూగుల్‌ ఆప్షన్‌లోని మేనేజ్‌ గూగుల్‌ అకౌంట్ పైన ట్యాప్‌ చేయాలి.
- అనంతరం షేరింగ్ లొకేషన్‌ పైన క్లిక్‌ చేయాలి.
- ఆ తర్వాత మీకు కొన్ని వివరాలు కనిపిస్తాయి.
- అక్కడ మీకు అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే వెంటనే ఆఫ్‌ చేసుకోవాలి.స్మార్ట్‌ఫోన్‌ చాటుగా మీ మాటలు వింటోందా.. మీ సీక్రెట్స్‌ ఫోన్‌కు తెలియకూడదంటే ఏం చేయాలి..?

దీంతోపాటు స్మార్ట్‌ఫోన్‌లు ఇన్‌స్టాల్‌ చేసే కొన్ని యాప్స్‌.. లొకేషన్‌ అనుమతులు అడుగుతుంటాయి. అయితే చాలా యాప్‌లకు లొకేషన్‌ అవసరం లేకుండా పనిచేయగలిగినా.. లొకేషన్‌ అనుమతులు అడుగుతుంటాయి. అలాంటి యాప్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి.

యాప్‌ లొకేషన్‌ సెట్టింగ్స్‌లో మార్పులు ఎలా చేయాలి?
- స్మార్ట్‌ఫోన్‌ సెట్టింగ్స్‌ ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయాలి.
- అక్కడ కనిపించే లొకేషన్‌ పైన ట్యాప్‌ చేయాలి.
- అక్కడ లొకేషన్‌ ను వినియోగించుకొనే యాప్‌ లిస్ట్ కనిపిస్తుంది.
- అక్కడే లొకేషన్ పర్మిషన్‌ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోవచ్చు.
- ఇవ్వాలి అనుకుంటే Allow, వద్దు అనుకుండా Deny మరియు యాప్‌ వినియోగించే సమయంలోనే లొకేషన్‌ అనుమతి ఇవ్వాలంటే Allow Access only while using the app ను ఎంచుకోవాలి.

ఇలా చేయడం వల్ల లొకేషన్‌ ట్రాకింగ్‌కు అడ్డుకట్ట పడుతుంది. మరియు అవసరం అయిన యాప్‌లకే అనుమతులు ఇవ్వొచ్చు. దీంతోపాటు ఎప్పటి కప్పుడు యాప్‌ పర్మిషన్‌లను తనిఖీ చేసుకోవాలి. అవసరం అనుకుంటే మార్పులు చేయాలి.

Best Mobiles in India

English summary
how to avoid Location Tracking in smartphone, here are the steps to change settings
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X