ఫేస్‌బుక్‌లో జరిగే మోసాలను నివారించడం ఎలా?

|

సోషల్ మీడియా ద్వారా ప్రజలు మరొకరితో కమ్యూనికేట్ అయ్యే విధానం తీవ్రంగా మారింది. సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు ప్రపంచంలోని ఏ ప్రాంతం నుండి వచ్చిన వారితోనైనా సరే సంభాషించడానికి ఒక శక్తివంతమైన సాధనంగా అవతరించాయి. ఇవి వ్యాపారాన్ని ప్రభావితం చేసినప్పటికీ ప్రకటనల రంగాన్ని, సమాచారాన్ని పొందటానికి ప్రజలకు సహాయపడుతుంది. అలాగే ఇది దుర్మార్గపు మోసాలకు అత్యంత సాధారణ వేదికలలో ఫేస్‌బుక్‌ కూడా ఒకటిగా మారింది. ఈ మోసాలు కేవలం సోషల్ మీడియా నెట్‌వర్క్‌లోనే కాకుండా ఇంటర్నెట్ అంతటా ఉంటాయి. అయితే ఫేస్‌బుక్‌లో ప్రతి రోజు మిలియన్ల మంది యాక్టీవ్ లో ఉంటారు కావున ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఆన్‌లైన్ మోసాలను మరింత సులభంగా ఉంటుంది.

ఫేస్‌బుక్‌
 

ఫేస్‌బుక్‌లో సర్వసాధారణమైన మోసాలలో కొన్ని ఉన్నాయి. వాటిలో మొదటిది అధికారిక మెసేజ్ వలె కనిపించే ఫేస్‌బుక్ నుండి ఇమెయిల్ టెంప్లేట్‌ను అనుకరించడం ద్వారా మోసగాళ్ళు వినియోగదారులను మోసగించడం. ఇందులో వినియోగదారుడు లింక్‌ను తెరిచి లాగిన్ ఆధారాలను నమోదు చేసిన తర్వాత స్కామర్‌లు అకౌంటును డూప్లికేట్ చేసి విమోచన క్రయధనాన్ని అడుగుతారు. వీడియో మెసేజ్ స్కామ్ అనేది ఈ ప్లాట్‌ఫారమ్‌లోని మోసాలలో మరొకటి. ఇది సాధారణంగా "స్నేహితుడు" నుండి వివరణతో కూడిన వీడియో లింక్‌ను కలిగి ఉంటుంది. ఇది వైరస్ లేదా 'బ్రౌజర్ హైజాకర్' తప్ప మరొకటి కాదు. నోటిఫికేషన్ లేదా మెసేజ్ పాప్ చేసే స్కామ్. ఇది మీ ఫేస్బుక్ అకౌంట్ లో ఎవరో మీకు స్నేహం చేయలేదని తెలిపే ఒక స్కామ్. ఫేస్బుక్ సెప్టెంబర్ 2020 నుండి 'ఈ కార్యకలాపాలను' ప్రకటించడం మానేసింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌

కొంతకాలంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో జరిగే ఇతర ప్రధాన మోసాలలో రిటైల్ అవుట్‌లెట్లలో ఫ్రీ కూపన్లు, లాటరీలు మరియు రొమాన్స్ స్కామ్‌లు వంటివి ఉంటాయి. ఇక్కడ నకిలీ అకౌంటులు సృష్టించబడతాయి లేదా వినియోగదారులను ప్రలోభపెట్టడానికి మరియు వారి వ్యక్తిగత డేటాను దొంగలించి తరువాత డబ్బు సంపాదించడానికి దోపిడీ చేయబడతాయి. చాలా మంది తమ అకౌంటులు సురక్షితమైనవి మరియు బాగా రక్షించబడ్డాయని నమ్ముతున్నప్పటికీ వివిధ రకాల మోసాలలో పడటానికి ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఫేస్‌బుక్‌లో మోసాలను ఎలా నివారించాలో పరిష్కారాల కోసం చూస్తున్నట్లయితే కనుక మీరు పరిగణలోకి తీసుకునే కొన్ని సాధారణ మార్గాలు ఉన్నాయి.

ఫేస్‌బుక్‌ మోసాలను నివారించే మార్గం
 

ఫేస్‌బుక్‌ మోసాలను నివారించే మార్గం

** ఉచిత విషయం ఎల్లప్పుడూ మంచి విషయం కాకపోవచ్చు. కావున ‘ఈ ఉత్పత్తిని ఉచితంగా పొందండి' అనే తెలియని లింక్‌లను ఎప్పుడూ తెరవకపోవడం చాలా మంచిది. ధృవీకరణ బ్యాడ్జ్‌ను విక్రయించాలనుకునే ఎవరికైనా డబ్బు ఇవ్వవద్దని ఫేస్‌బుక్ వినియోగదారులకు సలహా ఇస్తుంది.

** సోషల్ ఇంజనీరింగ్ కొన్నిసార్లు శాపంగా కూడా ఉంటుంది. సాఫ్ట్‌వేర్ ఉపాయాలను ఉపయోగించి సిస్టమ్ భద్రతను దాటవేయడానికి హ్యాకర్లు అధిక సామర్థ్యంను కలిగి ఉంటారు. కొన్ని సమయాల్లో వినియోగదారులు వ్యక్తిగత సమాచారం ఇవ్వడం జరగదు. అందువల్ల మీ స్నేహితుల జాబితాలో లేని అపరిచితులకు వివరాలను అందించకపోవడమే ఉత్తమమం.

** మీ అకౌంటులో మీకు ఏవైనా అనుమానాస్పద కార్యాచరణ కనిపిస్తే కనుక మీ ఫేస్బుక్ ప్రొఫైల్ సెట్టింగులకు వెళ్ళడం ద్వారా మీ లాగిన్ హిస్టరీను తనిఖీ చేసి ప్రైవసీ మరియు లాగిన్ మీద క్లిక్ చేయండి.

** తరువాత ప్రైవసీ సెట్టింగ్‌లను ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇది మీ ప్రొఫైల్‌ను మరియు మీరు ఫేస్‌బుక్‌లో ఎక్కడ ఉన్నారో మీరు విశ్వసించే స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మాత్రమే చూడగలిగేలా మీ ప్రైవసీ సెట్టింగ్‌లను అప్ డేట్ చేయండి.

** ఇమెయిల్‌ల పట్ల జాగ్రత్త వహించండి- అకౌంటులను అనుకరించడం మరియు వ్యక్తిగత ఆధారాలను పొందడం సులభం అయితే, ఫేస్‌బుక్ వినియోగదారుల పాస్‌వర్డ్‌ను ఇమెయిల్ ద్వారా అడగదని తెలుసుకోండి. అధికారిక కంపెనీ ఇమెయిల్ చిరునామాలు @ fb.com తో ముగుస్తాయి.

** చివరిది కాని మీరు నిజమైన ఫేస్‌బుక్ పేజీ యొక్క ఏదైనా మోకాప్‌ను కనుగొంటే లేదా స్కామ్‌ను అనుమానించినట్లయితే కనుక దాన్ని సహాయ కేంద్రం ద్వారా ఫేస్‌బుక్‌కు నివేదించండి.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Avoid Social Media Networks Common Scams on Facebook

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X