గూగుల్ డ్రైవ్‌లో వాట్సప్ బ్యాకప్ చేయడం ఎలా ? సింపుల్ ట్రిక్స్
ప్రముఖ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్, సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌లు డేటా స్టోరేజీ విషయంలో కొత్త అప్‌డేట్ తీసుకొచ్చాయి.
ప్రముఖ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్, సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌లు డేటా స్టోరేజీ విషయంలో కొత్త అప్‌డేట్ తీసుకొచ్చాయి. వాట్సప్ డేటా స్టోరేజీ విషయంలో తమ యూజర్లకు ఇబ్బందులు కలగకుండా వాట్సప్, గూగుల్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ కొత్త అప్‌డేట్‌తో గూగుల్ డ్రైవ్‌లో వాట్సప్ డేటాను బ్యాకప్ చేస్తే గూగుల్ డ్రైవ్‌లోని స్టోరేజీని వాడుకోదు. వాట్సప్ బ్యాకప్ డేటా మొత్తం గూగుల్ డ్రైవ్‌లో ప్రత్యేకంగా సేవ్ అవుతాయి. మరి బ్యాకప్ ఎలా చేయాలో చూద్దాం.

ట్రిక్ 1
ఆండ్రాయిడ్ వినియోగదారులు ముందుగా వారి మొబైల్ లో ఉన్న వాట్సప్ యాప్ ని ఓపెన్ చేయాలి.

ట్రిక్ 2
పైన ఉన్న మెనూని క్లిక్ చేయాలి. అక్కడ మీకు సెట్టింగ్స్ కనపడుతుంది.

ట్రిక్ 3
ఈ సెట్టింగ్స్ ని ఓపెన్ చేయాలి. అక్కడ చాట్స్ ఆప్సన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే బ్యాకప్ ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి
image source : androidcentral

ట్రిక్ 4
చాట్ హిస్టరీని సేవ్ చేయాలనుకున్న గూగుల్ అకౌంట్‌ని సెలక్ట్ చేసుకోండి, వీడియోలు కూడా బ్యాకప్ కావాలనుకుంటే అవి కూడా సెలక్ట్ చేసుకోండి.
image source : androidcentral

ట్రిక్ 5
బ్యాకప్ నొక్కితే మీ వాట్సప్‌లోని డేటా మొత్తం గూగుల్ డ్రైవ్ లో స్టోర్ అవుతుంది. వాట్సప్ డేటా బ్యాకప్ రెగ్యులర్‌గా చేసుకోవాలనుకుంటే అక్కడే అప్షన్స్(డెయిలీ, వీక్లీ, మంథ్లీ) కూడా ఉంటాయి.

కొత్త అప్ డేట్ ప్రకారం
కొత్త అప్ డేట్ ప్రకారం ఒక్కో అకౌంట్‌కు గూగుల్ డ్రైవ్‌లో 15 జీబీ డేటా ఉచితంగా వినియోగించుకోవచ్చు. కొత్త అప్‌డేట్‌తో వాట్సాప్ బ్యాకప్‌కి గుగుల్ డ్రైవ్‌లోని స్టోరేజీని వాడకుండా, ప్రత్యేకంగా వాట్సప్ డేటా స్టోర్ అవుతుంది.

ఆటోమెటిక్‌గా డెలీట్
అయితే కొత్త మార్పులతో ఏడాది, లేదా అంత కన్నా ఎక్కువ కాలం బ్యాకప్ అప్షన్ వాడనట్టయితే గూగుల్ డ్రైవ్‌లో ఇంతకు ముందు సేవ్ చేసిన వాట్సప్ డేటా ఆటోమెటిక్‌గా డెలీట్ చేయనున్నట్టు వాట్సప్ తెలిపింది.

అక్టోబర్ 30 లోపు మ్యానువల్‌గా..
డేటా డెలీట్ కాకుండా ఉండాలంటే అక్టోబర్ 30 లోపు మ్యానువల్‌గా వాట్సప్ బ్యాకప్ చేసుకోవాలని వాట్సప్ సూచించింది.


Click it and Unblock the Notifications








