ఫోన్ SMSలను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోవటం ఎలా..?

|

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను ప్రధానంగా వేధిస్తోన్న సమస్య 'స్టోరేజ్'. ఈ సమస్య కారణంగా చీటికి మాటీకి తమ ఫోన్‌లోని డేటాను ఆండ్రాయిడ్ యూజర్లు డిలీట్ చేయవల్సి వస్తోంది. డేటాను తొలగించే క్రమంలో ముఖ్యమైన ఎస్ఎంఎస్‌ మెసేజ్‌లను కూడా యూజర్లు కోల్పోవల్సి వస్తోంది. ఫోన్ ఎస్ఎంఎస్‌‌లను భద్రపరుచుకునేందుకు అనేక బ్యాకప్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నప్పటికి వాటిని వినియోగించుకోవటంలో మాత్రం చాలా మంది విఫలమవుతున్నారు. ఇక పై అలా జరగకుండా ఆండ్రాయిడ్ ఫోన్‌లోని అన్ని ఎస్ఎంఎస్ మెసేజ్‌లను పూర్తిస్థాయిలో బ్యాకప్ చేసుకునేందుకు పలు తీరైన మార్గాలను ఇక్కడ సూచించటం జరుగుతోంది.

 

మీ వీడియోను యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమ్ చేయటం ఎలా..?మీ వీడియోను యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమ్ చేయటం ఎలా..?

Carbonite SMS Backup and Restore

Carbonite SMS Backup and Restore

ముందుగా Carbonite SMS Backup and Restore అనే యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీ స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసకోవాలి. ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఈ క్రింది ప్రొసీజర్‌ను ఫాలో అవ్వండి.

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్

యాప్ లాంచ్ అయిన వెంటనే వెల్‌కమ్ స్ర్కీన్ ఓపెన్ అవుతంది. ఈ స్ర్కీన్ పై Get Started అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పై టాప్ చేసినట్లయితే తదుపరి పేజీలోకి మీరు డైవర్ట్ కాబడతారు. ఇక్కడ మీ ఫోన్ కంటెంట్‌ను బ్యాకప్ చేసేందుకు అవసరమైన అన్ని పర్మిషన్‌లను యాప్‌కు గ్రాంట్ చేయవల్సి ఉంటుంది. బ్యాకప్ అయిన కంటెంట్‌ను గూగుల్‌డ్రైవ్ లేదా డ్రాప్‌బాక్స్‌లో భద్రపరుచుకునే వీలుంటుంది. ఒకవేళ అలా కాదనుకున్నట్లయితే సపరేట్ ఫోల్డర్‌లోకి కంటెంట్ బ్యాకప్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు.

తిరిగి రిస్టోర్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే...
 

తిరిగి రిస్టోర్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే...

బ్యాకప్ కాబడిన ఆండ్రాయిడ్ ఫోన్ ఎస్ఎంఎస్ మెసేజ్‌లను మీ ఫోన్‌లోకి తిరిగి రిస్టోర్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ముందుగా ఆ ఎస్ఎంఎస్ బ్యాకప్ను మీ ఫోన్‌లోకి కాపీ చేసుకోవల్సి ఉంటుంది. ఆ తరువాత Carbonite SMS Backup and Restore యాప్‌ను మరోమారు ఓపెన్ చేసి టాప్ లెఫ్ట్ కార్నర్‌లో కనిపించే hamburger రూపంలో కనిపించే మెనూ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే Restore అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది.

Local backup location ఆప్షన్‌..

Local backup location ఆప్షన్‌..

ఈ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే మరికొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఒకవేళ మీరు లోకల్ కాపీని వినియోగించుకోవాలనుకుంటున్నట్లయితే Local backup location ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎస్ఎంఎస్ బ్యాకప్ కాపీని గూగుల్ డ్రైవ్ లేదా డ్రాప్‌మాక్స్ డ్రైవ్స్ నుంచి తీసుకోవాలనుకుంటున్నట్లయితే సంబంధిత బటన్ పై క్లిక్ చేయవల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Here is everything you need to know about backing up (and restoring) your phone's SMS archive, which can be saved on the device, mailed to yourself, or saved to the cloud. We used SMS Backup and Restore, which was acquired by Carbonite a few years ago. Just follow these steps to backup SMS on your Android phone.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X