గూగుల్ వన్ ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ డేటాను బ్యాకప్ చేయడం ఎలా ?
టెక్ దిగ్గజం గూగుల్ ఈ మధ్య క్లౌడ్ స్టోరేజ్ సొల్యూషన్ కోసం గూగు్ వన్ ను లాంచ్ చేసిన సంగతి అందరికీ విదితమే. గూగుల్ డ్రైవ్ తో పాటుగా గుల్ వన్ కూడా యూజర్లకు బ్యాకప్ స్పేస్ ని అందిస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు ఫోటోస్, డాక్యుమెంట్లు, షీట్స్, అన్ని ఈ సర్వీస్ ద్వారా బ్యాకప్ చేసుకోవచ్చు. ఇందులో యూజర్లకు దాదాపు 15జిబి వరకు స్టోరేజ్ ని అందిస్తోంది. అలాగే గూగుల్ డ్రైవ్ నుండి ఆసక్తి ఉంటే ఇంకా ఎక్కువ స్టోరేజ్ ని కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే ఇతర క్లౌడ్ స్టోరేజ్ లను కూడా కొనుగోలు చేయవచ్చు. గూగుల్ ఆండ్రాయిడ్ వాడే యూజర్లు వారి యొక్క డేటాను అంటే మల్టీ మీడియా కంటెంట్, కాంటాక్ట్స్, మెసేజ్, ఇతరాలను బ్యాకప్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఎలాగో ఓ సారి చూద్దాం.

స్టెప్ 1
ముందుగా మీ స్మార్ట్ ఫోన్ నుండి గూగుల్ ప్లే స్టోర్ లో కెళ్లాలి. అక్కడ నుంచి గూగుల్ వన్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో ఉండాలి

స్టెప్ 2
అది డౌన్లోడ్ అయిన తరువాత మీ లాగిన్ ఐడి పాస్ వర్డ్ తో ఓపెన్ చేయాలి. అక్కడ మీకు స్టోరేజ్ ప్లాన్ ఆప్సన్ కనిపిస్తుంది. అందులో హోమ్ స్క్రీన్ మీద బ్యాకప్ ఆప్సన్ ట్యాప్ చేయాి.

స్టెప్ 3
అక్కడ మీకు ఏ కంటెంట్ బ్యాకప్ చేయాలో అడుగుతుంది. అది సెలక్ట్ చేసుకుని తరువాత బటన్ ప్రెస్ చేయాలి. మళ్లీ బ్యాకప్ బటన్ ట్యాప్ చేస్తే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అది పూర్తయ్యే వరకు వెయిట్ చేయండి.

రీస్టోర్ చేయడం ఎలా ?
హోమ్ సెక్షన్ లోకి వెళ్లండి. అక్కడ కనిపించే రిస్టోర్ ఆప్సన్ క్లిక్ చేయండి. క్లియ్ చేయగానే రీస్టోర్ బ్యాకప్ అని కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే మీకు ఏ కంటెంట్ బ్యాకప్ కావాలో అడుగుతుంది.దాన్ని సెలక్ట్ చేసుకుని బ్యాకప్ కొడితే వెంటనే మీ ఫోన్లోకి డేటా రీస్టోర్ అవుతుంది. అయితే ఇది 15జిబి వరకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆ తర్వాత స్పేస్ కోసం కొనుగోలు చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








