ఫోన్ కాంటాక్ట్స్‌ను ఎస్డీ కార్డ్‌లోకి బ్యాకప్ చేసుకోవటం ఎలా..?

Written By:

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను అందరూ ఇష్టపడుతారు. ఇందుకు కారణం ఈ ఫోన్‌లలో నిక్షిప్తమైన ఉన్న లెక్కకు మిక్కిలి సౌకర్యవంతమైన ఫీచర్లే. అందుబాటు ధరల్లో అందరికి అమోదయోగ్యంగా మారిన ఆండ్రాయిడ్ ఫోన్‌లలోని డేటాను మరింత సెక్యూర్‌గా ఉంచుకునేందుకు రెగ్యులర్ బేసిస్‌లో బ్యాకప్ అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్‌లో అయినా కాంటాక్ట్స్ అనేవి ముఖ్యమైన డేటాగా చెప్పుకోవచ్చు.

 ఫోన్ కాంటాక్ట్స్‌ను ఎస్డీ కార్డ్‌లోకి బ్యాకప్ చేసుకోవటం ఎలా..?

వీటిని ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోవల్సి ఉంది. ఫోన్‌లోని కాంటాక్ట్స్‌ను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోవటం వల్ల అనుకోకుండా డివైస్ ఫార్మట్ అయినప్పటికి మీ కాంటాక్ట్స్ మాత్రం బ్యాకప్‌లో భద్రంగా ఉంటాయి. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లలోని కాంటాక్ట్‌లను బ్యాకప్ చేసుకునేందుకు రెండు సులువైన పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం....

Read More : సచిన్ ఫోన్‌లు సంచలనం సృష్టిస్తాయా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1 :

ఫోన్ ఎస్డీకార్డ్‌లోకి కాంటాక్ట్‌లను బ్యాకప్ చేసుకోవటం ఎలా..?

మీ ఫోన్‌లోని కాంటాక్స్ యాప్‌ను ఓపెన్ చేయండి. సెట్టింగ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మెనూ ఆప్షన్స్‌తో కూడిన జాబితా మీకు కనిపిస్తుంది. వాటిలో import/export ఆప్షన్ పై క్లిక్ చేయండి.

 

స్టెప్ 2

ఫోన్ ఎస్డీకార్డ్‌లోకి కాంటాక్ట్‌లను బ్యాకప్ చేసుకోవటం ఎలా..?

import/export ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మరో మెనూ ఒపెన్ అవుతుంది. అందులో 'Export to SD card'ను సెలక్ట్ చేసుకోండి.

ఎస్డీ కార్డ్ మెనూ నుంచి

ఫోన్ ఎస్డీకార్డ్‌లోకి కాంటాక్ట్‌లను బ్యాకప్ చేసుకోవటం ఎలా..?

ఈ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం వల్ల మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని కాంటాక్ట్స్ అన్ని మౌంట్ చేయబడిన ఎస్డీ‌కార్డ్‌లోకి బ్యాకప్ కాబడతాయి. ఎస్డీ కార్డ్ మెనూ నుంచి బ్యాకప్ కాబడిన కాంటాక్స్ ఫైల్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ఫైల్‌ను భవిష్యత్ రిఫరెన్స్ కోసం ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ పీసీలో స్టోర్ చేసుకోవచ్చు.

స్టెప్ 1:

ఫోన్ కాంటాక్ట్‌లను జీమెయిల్‌లోకి బ్యాకప్ చేసుకోవటం ఎలా..?

ముందుగా మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని సెట్టింగ్స్ మెనూను ఓపెన్ చేయండి. మెనూలో కనిపించే ఆప్షన్‌లలో Accounts లేదా Accounts & Sync menu ఆప్షన్ పై క్లిక్ చేయండి.

 

స్టెప్ 2

ఫోన్ కాంటాక్ట్‌లను జీమెయిల్‌లోకి బ్యాకప్ చేసుకోవటం ఎలా..?

జీమెయిల్ అకౌంట్‌లోకి వెళ్లి సింక్ కాంటాక్ట్స్ ఆప్షన్‌ను చెక్ చేయండి. కాంటాక్ట్స్ జీమెయిల్‌లోకి సింక్ అవటానికి కొద్ది నిమిషాల సమయం తీసుకుంటుంది. ఇప్పుడు మీ పీసీలో జీమెయిట్ అకౌంట్‌ను ఓపెన్ చేసి కావల్సిన కాంటాక్ట్‌లను బ్యాకప్ చేసుకోండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Backup Android Contacts to SD Card and Gmail in a few Easy Steps!. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot