ఫోటోస్, వీడియోలను ‘గూగుల్ ఫోటోస్’లోకి బ్యాకప్ చేసుకోవటం ఎలా..?

|

గూగుల్ అందిస్తోన్న అత్యుత్తమ స్టోరేజ్ సర్వీసుల్లో 'గూగుల్ ఫోటోస్' ఒకటి. ఈ క్లౌడ్ ఆధారిత స్టోరేజ్ సిస్టం ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ పీసీల్లోని ఫోటోస్ ఇంకా వీడియోస్‌ను ఎప్పటికప్పుడు గూగుల్ ఫోటోస్‌లోకి బ్యాకప్ చేసుకోవటం వల్ల డేటా సేఫ్‌గా ఉండటంతో పాటు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీక్షించే వీలుంటుంది. ఆండ్రాయిడ్ డివైసెస్‌లోని ఫోటోస్ అలానే వీడియోస్‌ను గూగుల్ ఫోటోస్‌లోకి బ్యాకప్ చేసుకునేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

 

వాట్సప్‌లో ఈ మెసేజ్ చక్కర్లు కొడుతోంది, దూరంగా ఉండండివాట్సప్‌లో ఈ మెసేజ్ చక్కర్లు కొడుతోంది, దూరంగా ఉండండి

 స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

స్టెప్ 1 : ముందుగా మీ గూగుల్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.
స్టెప్ 2 : అకౌంట్‌లోకి లాగిన్ అయిన తరువాత మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా టాబ్లెట్‌లో గూగుల్ ఫోటోస్ యాప్‌ను ఓపెన్ చేయండి.
స్టెప్ 3 : యాప్ ఓపెన్ అయిన తరువాత మెయిన్ స్ర్కీన్ పై టాప్ లెఫ్ట్ కార్నర్‌లో కనిపించే మెనూ ఐకాన్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 4 : మెనూ ఓపెన్ అయిన తరువాత సెట్టింగ్స్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసకుని Backup & sync'ను ఆన్ చేసుకోండి.

బ్యాకప్ సెట్టింగ్‌ను ఛేంజ్ చేసే సమయంలో..

బ్యాకప్ సెట్టింగ్‌ను ఛేంజ్ చేసే సమయంలో..

ఈ బ్యాకప్ సెట్టింగ్‌ను ఛేంజ్ చేసే సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాలను మీరు గుర్తుపెట్టుకోవల్సి ఉంటుంది. 'Backup & sync' ఆప్షన్ ఆన్‌లో ఉన్నప్పుడు గూగుల్ ఫోటోస్ యాప్‌ను మీ డివైస్ నుంచి డిలీట్ చేసినప్పటికి ఆప్షన్ అనేది ఆన్ అయ్యే ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో 'Backup & sync' ఆప్షన్‌ను టర్నాఫ్ చేయాలనుకుంటున్నట్లయితే మరోసారి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని పై సూచనలను ఫాలో అయితే సరిపోతుంది.

గూగుల్ ఫోటోస్‌లో ఎంత వరకు డేటా‌ను ఉచితంగా అప్‌లోడ్ చేసుకోవచ్చు...
 

గూగుల్ ఫోటోస్‌లో ఎంత వరకు డేటా‌ను ఉచితంగా అప్‌లోడ్ చేసుకోవచ్చు...

గూగుల్ చెబుతోన్న దాని ప్రకారం 15జీబి వరకు స్టోరేజ్ స్పేస్‌ను మనం గూగుల్ ఫోటోస్‌లో ఉచితంగా వినియోగించుకునే వీలుంటుంది. అయితే మీరు పంపే ఫైళ్లకు సంబంధించి సైజ్ ఇంకా క్వాలిటీని రెడ్యూస్ చేసుకోవటం ద్వారా మరింత డేటాను గూగుల్ ఫోటోస్‌లో అప్‌లోడ్ చేసుకునే వీలుంటుంది. ఫైల్ సైజ్‌ను రెడ్యూస్ చేసేందుకు https://photos.google.com/settingsలోకి వెళితే సరిపోతుంది.

అందుబాటులో రెండు ప్లాన్స్..

అందుబాటులో రెండు ప్లాన్స్..

ఫోటో క్వాలిటీ విషయంలో రాజీపడకూడదని అనుకన్నట్లయితే గూగుల్ ఫోటోస్‌లో మరింత స్పేస్ మీరు కొనుగోలు చేయవల్సి ఉంటుంది. గూగుల్ ఫోటోస్‌లో మీరు మరింత స్టోరేజ్ స్పేస్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే మీకు రెండు ప్లాన్‌లు అందుబాటులో ఉంటాయి. మొదటి ప్లాన్‌లో భాగంగా నెలకు రూ.130 చెల్లించినట్లయితే 100జీబి డేటాను ఉపయోగించుకునే వీలుంటుంది. రెండవ ప్లాన్‌లో భాగంగా రూ.650 చెల్లించటం ద్వారా 1TB వరకు స్టోరేజ్‌ను మీరు ఉపయోగించుకోవచ్చు.

Best Mobiles in India

English summary
how-to-backup-photos-and-videos-on-your-android-phone-or-tablet-using-google-photos more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X