WhatsApp చాట్ హిస్టరీని బ్యాకప్ చేసుకోవటం ఎలా..?

వాట్సాప్ వినియోగం దాదాపుగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ లతో సహవాసం చేస్తోన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ సేవలను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు.

|

వాట్సాప్ వినియోగం దాదాపుగా పెరిగిపోయింది. స్మార్ట్‌ఫోన్‌లతో సహవాసం చేస్తోన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ సేవలను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. ఇన్‌స్టెంట్ మెసేజింగ్ విభాగంలో అగ్రగామి సర్వీసుగా గుర్తింపు తెచ్చుకున్న వాట్సాప్.. టెక్స్ట్ మెసేజింగ్ దగ్గర నుంచి ఫోటో షేరింగ్ వరకు, ఆడియో కాలింగ్ దగ్గర నుంచి వీడియో కాలింగ్ వరకు అన్ని రకాల కమ్యూనికేషన్ అవసరాలను సెకన్ల వ్యవధిలో తీర్చేస్తోంది.

కొమియో నుంచి సరికొత్త సీ1 ప్రో కేవలం రూ.5599 మాత్రమే..ఫీచర్లివిగో !కొమియో నుంచి సరికొత్త సీ1 ప్రో కేవలం రూ.5599 మాత్రమే..ఫీచర్లివిగో !

కీలక డేటా మొత్తం వాట్సాప్‌లోనే స్టోర్ అయి ఉంటోంది...

కీలక డేటా మొత్తం వాట్సాప్‌లోనే స్టోర్ అయి ఉంటోంది...

కమ్యూనికేషన్ అవసరాల నిమిత్తం వాట్సాప్‌ను ఎక్కువుగా వినియోగించుకోవటం వల్ల కీలక డేటా మొత్తం వాట్సాప్‌లోనే స్టోర్ అయి ఉంటోంది. పొరపాటున ఫోన్‌ను ఛేంజ్ చేయవల్సి వస్తే వాట్సాప్ డేటాను ఏ విధంగా రికవర్ చేసుకోవాలో తెలియక చాలా మంది యూజర్లు ఆందోళణ చెందుతున్నారు. వాట్సాప్ యూజర్ అకౌంట్‌లో సేవ్ అయి ఉండే ప్రతిఫైల్ కూడా బ్యాకప్ అయి ఉంటుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో స్టోర్ అయి ఉన్న వాట్సాప్ చాట్ హిస్టరీని‌ను ఏ విధంగా రీస్టోర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

 ‘Chat backup’లోకి వెళ్లి..

‘Chat backup’లోకి వెళ్లి..

ముందుగా మీ వాట్సాప్ అకౌంట్‌లోకి వెళ్లి యాప్ మెయిన్ స్ర్కీన్ పై కనిపించే త్రీ డాట్స్ ఐకాన్ పై క్లిక్ చేయండి. టాప్ రైట్ కార్నర్‌లో ఈ ఐకాన్ మీకు కనిపిస్తుంది. ఐకాన్ పై క్లిక్ చేసిన తరువాత సెట్టింగ్స్‌‌ను ఓపెన్ చేసి ‘Chats' పై టాప్ ఇవ్వండి. ఇప్పుడు ‘Chat backup'లోకి వెళ్లి మీ చాట్ హిస్టరీ మొత్తం గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ అయ్యేలా సెట్టింగ్స్ అడ్జస్ట్ చేసుకోండి.

సెట్టింగ్స్‌ను అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది...
 

సెట్టింగ్స్‌ను అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది...

ఈ బ్యాకప్ అనేది రోజుకోసారి అవ్వాలా, వారానికోసారి అవ్వాలా లేక నెలకోసారి అవ్వాలా అన్న దాని పై సెట్టింగ్స్‌ను మాడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాకప్ అనేది వై-ఫై కనెక్షన్‌తో ఉన్నపుడు జరగాలా లేక మొబైల్ డేటా ఆన్ అయి ఉన్నపుడు జరగాలా అనే దాని పై కూడా సెట్టింగ్స్‌ను అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది.

పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్‌లోకి ఛేంజ్ అవుతున్నట్లయితే...

పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్‌లోకి ఛేంజ్ అవుతున్నట్లయితే...

ఒకవేళ మీరు పాత స్మార్ట్‌ఫోన్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌లోకి ఛేంజ్ అవుతున్నట్లయితే, మీ పాత డివైస్‌లోని వాట్సాప్ చాట్ హిస్టరీని రీస్టోర్ చేసుకునేందుకు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ముందుగా మీ పాత్ స్మార్ట్‌ఫోన్‌లో లేటెస్ట్ వెర్షన్ వాట్సాప్ మెసెంజర్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసి మీ డివైస్‌లోని కాంటాక్ట్స్, ఫోటోస్ ఇంకా మీడియా ఫైల్స్‌ను యాక్సిస్ చేసుకునేందుకు అవసరమైన పర్మిషన్‌ను వాట్సాప్‌కు ఇవ్వవల్సి ఉంటుంది.

ఫోన్ నెంబర్‌ను యాప్‌లో వెరిఫై చేసుకున్నట్లయితే..

ఫోన్ నెంబర్‌ను యాప్‌లో వెరిఫై చేసుకున్నట్లయితే..

ఈ ప్రొసీజర్ పూర్తయిన తరువాత మీ కొత్త డివైస్‌లో ఉన్న వాట్సాప్ అప్లికేషన్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోండి. అప్‌డేట్ పూర్తయిన తరువాత మీ ఫోన్ నెంబర్‌ను యాప్‌లో వెరిఫై చేసుకోండి. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో భాగంగా 6 అంకెలతో కూడిన వెరిఫికేషన్ కోడ్ ఒకటి మీ ఫోన్‌కు అందుతుంది. ఈ కోడ్ ఆటోమెటిక్‌గా వెరిఫై కాబడి అకౌంట్ వినియోగానికి సిద్ధమవుతుంది. ఈ ప్రాసెస్ పూర్తయిన వెంటనే ‘Restore backup' పేరుతో మరో ఆప్షన్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. ‘Restore' బటన్ పై క్లిక్ చేసిన వెంటనే మీ వాట్సాప్ మెసేజెస్ అన్ని రీస్టోర్ కాబడతాయి.

 

 

Best Mobiles in India

English summary
How to backup and restore WhatsApp chats on your Android smartphone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X