వాట్సప్ మెసేజెస్ ,ఫోటోలు,వీడియోలు బ్యాకప్ చేసుకోవడం ఎలా?

వాట్సాప్ వినియోగం దాదాపుగా పెరిగిపోయింది. స్మార్ట్‌ఫోన్‌లతో సహవాసం చేస్తోన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ సేవలను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు.

|

వాట్సాప్ వినియోగం దాదాపుగా పెరిగిపోయింది. స్మార్ట్‌ఫోన్‌లతో సహవాసం చేస్తోన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ సేవలను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. ఇన్‌స్టెంట్ మెసేజింగ్ విభాగంలో అగ్రగామి సర్వీసుగా గుర్తింపు తెచ్చుకున్న వాట్సాప్.. టెక్స్ట్ మెసేజింగ్ దగ్గర నుంచి ఫోటో షేరింగ్ వరకు, ఆడియో కాలింగ్ దగ్గర నుంచి వీడియో కాలింగ్ వరకు అన్ని రకాల కమ్యూనికేషన్ అవసరాలను సెకన్ల వ్యవధిలో తీర్చేస్తోంది.

How to Backup WhatsApp Photos/ Videos

కమ్యూనికేషన్ అవసరాల నిమిత్తం వాట్సాప్‌ను ఎక్కువుగా వినియోగించుకోవటం వల్ల కీలక డేటా మొత్తం వాట్సాప్‌లోనే స్టోర్ అయి ఉంటోంది. పొరపాటున ఫోన్‌ను ఛేంజ్ చేయవల్సి వస్తే వాట్సాప్ డేటాను ఏ విధంగా రికవర్ చేసుకోవాలో తెలియక చాలా మంది యూజర్లు ఆందోళణ చెందుతున్నారు. వాట్సాప్ యూజర్ అకౌంట్‌లో సేవ్ అయి ఉండే ప్రతిఫైల్ కూడా బ్యాకప్ అయి ఉంటుంది.
ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ డేటా ను ఎప్పటికప్పుడు ఆటొమ్యాటిక్ గా బ్యాక్ అప్ తీసుకోవడానికి సెట్టింగ్స్ లోను ఆప్షన్ ఉంది. అలాకాకుండా గూగుల్ డ్రైవ్ లో సేవ్ చేసుకోవచ్చు. ఈ మెయిల్ ద్వారా ఆ డేటాను ఎవరికైనా మెయిల్ చేయవచ్చు.

వాట్సాప్ చాట్ ను గూగుల్ డ్రైవ్ లో బ్యాక్ అప్ చేయడం కోసం...

వాట్సాప్ చాట్ ను గూగుల్ డ్రైవ్ లో బ్యాక్ అప్ చేయడం కోసం...

- వాట్సాప్ ఓపెన్ చేసి Settings >Chats >Chat backupలోకి వెళ్ళండి. ఇది మీ చాట్ ను వెంటనే బ్యాక్ అప్ చేస్తుంది. అయితే ఇలా బ్యాక్ అప్ అయినా డేటా మీ ఫోన్ ఇంటర్నల్ స్తొరజ్ లో సేవ్ అవుతుంది. మీ ఫోన్ కు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి రీస్టోర్ కొడితే డేటా అంతా పోయినట్లే .

- ఇలాంటి పరిస్థితుల్లో మీ డాటాను గూగుల్ డ్రైవ్ లో సేవ్ చేసుకోవడం ఉత్తమం. చాట్ బ్యాక్ అప్ లోనే బ్యాక్ టూ గూగుల్ డ్రైవ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని క్లిక్ చేస్తే బ్యాక్ అప్ డేటా నేరుగా మీ గూగుల్ డ్రైవ్ లో సేవ్ అవుతుంది. ఇప్పటికే గూగుల్ అకౌంట్ లేకపోతే Add Account ఆప్షన్ ను సెలెక్ట్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు . నెట్వర్క్ ప్రిఫెరెన్స్ దగ్గర cellular లేదా WI-FI అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని WI-FI లోకి మార్చుకుంటే ఒకవేళ డేటా ఎక్కువ ఉన్నా ఇబ్బంది ఉండదు. లేదంటే మీకు తెలియకుండానే మొబైల్ డేటా ఖర్చు అవుతుంది.

 

వాట్సాప్ చాట్ ను ఈ మెయిల్ ద్వారా సేవ్ చేయడం కోసం...

వాట్సాప్ చాట్ ను ఈ మెయిల్ ద్వారా సేవ్ చేయడం కోసం...

మీరు సేవ్ చేయాలి అనుకుంటున్న వాట్సాప్ చాట్ లోకి వెళ్లి టాప్ లో కుడి వైపు ఉన్న మూడు డాట్స్ ను క్లిక్ చేస్తే More అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని క్లిక్ చేసి అందులో ఉన్న ఈ మెయిల్ చాట్ ను సెలెక్ట్ చేస్తే మీ డేటా మెయిల్ ద్వారా ఎవరికైనా పంపించవచ్చు. చాట్స్ మాత్రమే కాదు అందులో ఉన్న ఫోటోలు ,వీడియోలు కూడా కావాలంటే Attach Media ను క్లిక్ చేయాలి.

విండోస్ ఫోన్ యూజర్లు ఎలా చేయాలంటే ?

విండోస్ ఫోన్ యూజర్లు ఎలా చేయాలంటే ?

విండోస్ ఫోన్ యూజర్లు కూడా తమ వాట్సాప్ చాట్ హిస్టరీని మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ లో సేవ్ చేసుకోవచ్చు

- విండోస్ 8.1 ఆ తరువాత వచ్చిన ఫోన్లకు మాత్రమే ఈ ఫీచర్ పని చేస్తుంది. అంతే కాదు ఈ ఫోన్ కు వన్ డ్రైవ్ సైన్ ఇన్ అయి ఉండాలి

- వాట్సాప్ ఓపెన్ చేసి more ఆప్షన్ క్లిక్ చేసి icon > settings > chats and calls > backupలోకి వెళ్ళాలి . వీడియోల కూడా బ్యాక్ అప్ తీయాలో లేదో సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ అప్ ఎన్నాళ్లకు ఒకసారి తీయాలని ఫ్రీక్వెన్సీ,వైఫై లేదా మొబైల్ డేటా ద్వారా బ్యాక్ అప్ తీయాలా అనే ప్రిఫెరెన్స్ లు సెలెక్ట్ చేసుకోవాలి.

- మీరు ఒకవేళ మ్యానువల్ గా బ్యాక్ అప్ తీసుకోవాలంటే more ఆప్షన్ క్లిక్ చేసి icon > settings > chats and calls > backupలోకి వెళ్ళాలి అప్పుడు మీ డేటా ఫోన్ ఇంటర్నల్ మెమరీ లో స్టోర్ అవుతుంది. కావాలంటే అక్కడి నుంచి వన్ డ్రైవ్ కు పంపుకోవచ్చు.

 

Best Mobiles in India

English summary
How to Backup WhatsApp Photos/ Videos.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X