Home
How to

YouTube లో అశ్లీల వీడియోలు.. పిల్ల‌లకు క‌న‌బ‌డ‌కుండా ఏం చేయాలి!

ఇంట‌ర్నెట్ వినియోగం పెరుగుతున్న కొద్దీ.. YouTube లోనూ వీడియో స్ట్రీమింగ్ విప‌రీతంగా పెరుగుతోంది. YouTube ద్వారా పిల్ల‌ల‌తో పాటు, పెద్ద‌ల‌కు కూడా ఎంట‌ర్‌టైన్‌మెంట్ అధికంగా ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణం. YouTubeలో పిల్ల‌ల కోసం చాలా వరకు కార్టూన్‌లు, నర్సరీ రైమ్‌లు, చలనచిత్రాలు, టీవీ ఎపిసోడ్‌లు బాగా ప్రసిద్ధి చెందాయి. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు, పిల్లలు నేర్చుకోవడానికి సైన్స్ వీడియోలు మరియు విద్యా సంబంధిత వీడియోలు వంటి అనేక ఉపయోగకరమైన వీడియోలు కూడా ఇందులో ఉన్నాయి.

youtube

ఇదిలా ఉండ‌గా, ఈ ప్లాట్‌ఫాం పిల్ల‌లు వినియోగించేటప్పుడు అశ్లీల వీడియోలు సైతం వారి కంట ప‌డే ప్ర‌మాదం పొంచి ఉంది. ఈ క్ర‌మంలో మీ పిల్లలు యూట్యూబ్‌లో పోర్న్‌ మరియు అశ్లీల వీడియోలను చూడకుండా నిరోధించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. YouTube లో అశ్లీల‌త‌ను నియంత్రించడానికి ప‌లు మార్గాలు ఉన్నాయి. యూట్యూబ్‌లో రెస్ట్రిక్టెడ్ మోడ్ ఆన్ చేసుకోవ‌డం ద్వారా దాన్ని నియంత్రించ‌వ‌చ్చు.

అయితే ఆ రెస్ట్రిక్టెడ్ మోడ్‌ను ఎలా ఆన్ చేయాల‌నే విష‌యాన్ని ఈ రోజు మేము మీ కోసం అందిస్తున్నాం. దీని ద్వారా మీరు YouTubeలో పిల్లలను అశ్లీల వీడియోలకు దూరంగా చేయ‌వ‌చ్చు. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? అందుకోసం ఈ ఆర్టిక‌ల్ పూర్తిగా చ‌ద‌వండి.

మొబైల్‌లో YouTube Restricted Mode ఎలా ఆన్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం:

మొబైల్‌లో YouTube Restricted Mode ఎలా ఆన్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం:

* ముందుగా మీ మొబైల్‌లో యూట్యూబ్ యాప్‌ను ఓపెన్ చేయాలి.
* ఆ త‌ర్వాత యూట్యూబ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
* అనంత‌రం జ‌న‌ర‌ల్ సెట్టింగ్స్‌ను ఎంపిక చేసుకోవాలి.
* జ‌న‌ర‌ల్ సెట్టింగ్స్‌లో మీకు కింద భాగంలో రెస్ట్రిక్టెడ్ మోడ్ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది.
* యాక్టివేట్ రెస్ట్రిక్టెడ్ మోడ్ అనే ఆప్ష‌న్‌ను ఆన్ చేయాలి.
* ఈ ప్ర‌క్రియ పూర్తి అయితే మీ మొబైల్ యూట్యూబ్ రెస్ట్రిక్టెడ్ మోడ్ యాక్టివేట్ అయిన‌ట్లు నిర్ధారించుకోవాలి.

డెస్క్‌టాప్‌లో YouTube Restricted Mode ఎలా ఆన్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం:

డెస్క్‌టాప్‌లో YouTube Restricted Mode ఎలా ఆన్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం:

* ముందుగా వెబ్ బ్రౌజ‌ర్‌లో YouTube.com అని టైప్ చేసి, యూట్యూబ్‌లోకి వెళ్లాలి.
* ఆ త‌ర్వాత పై భాగంలో క‌నిపించే యువ‌ర్ ప్రొఫైల్ అనే సెక్ష‌న్ పై క్లిక్ చేయాలి.
* ఆ త‌ర్వాత మీకు అనేక ఆప్ష‌న్‌లు క‌నిపిస్తాయి. వాటిలో కింద భాగంలో రెస్ట్రిక్టెడ్ మోడ్ సెక్ష‌న్ ఉంటుంది.
* ఆ రెస్ట్రిక్టెడ్ మోడ్ సెక్ష‌న్‌లోకి వెళ్లాలి.
* అనంత‌రం రెస్ట్రిక్టెడ్ మోడ్ యాక్టివేట్ చేయ‌డానికి మీకో ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే రెస్ట్రిక్టెడ్ మోడ్ ఆన్ అవుతుంది.
* ఈ ప్ర‌క్రియ పూర్తి అయితే మీ డెస్క్‌టాప్‌లో యూట్యూబ్ రెస్ట్రిక్టెడ్ మోడ్ యాక్టివేట్ అయిన‌ట్లు నిర్ధారించుకోవాలి.

ఇలా యూట్యూబ్‌లో రెస్ట్రిక్టెడ్ మోడ్ యాక్టివేష‌న్ చేసుకోవ‌డం ద్వారా అశ్లీల వీడియోల‌ను పిల్ల‌ల కంట ప‌డ‌కుండా నిరోధించ‌వ‌చ్చు. మీరు కూడా ఈ విష‌యంలో ఆందోళ‌న చెందుతున్న‌ట్ల‌యితే వెంట‌నే పైన చ‌ర్చించిన‌ ప్ర‌క్రియ ద్వారా యూట్యూబ్‌ను అశ్లీల‌త నుంచి నియంత్ర‌ణ చేయండి.

అదేవిధంగా, ఇప్పుడు యూట్యూబ్‌లో క‌మ్యూనిటీ ట్యాబ్ ఫీచ‌ర్ గురించి, ఆ ఫీచ‌ర్‌ను సాధించాలంటే ఏం చేయాలో అనే విష‌యాల్ని ఇప్పుడు వివ‌రంగా తెలుసుకుందాం:

అదేవిధంగా, ఇప్పుడు యూట్యూబ్‌లో క‌మ్యూనిటీ ట్యాబ్ ఫీచ‌ర్ గురించి, ఆ ఫీచ‌ర్‌ను సాధించాలంటే ఏం చేయాలో అనే విష‌యాల్ని ఇప్పుడు వివ‌రంగా తెలుసుకుందాం:

సాధారణంగా Youtube అంటే వీడియో మాత్ర‌మే పోస్టులు చేస్తార‌ని అంద‌రికీ తెలుసు. కానీ, ఈ కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా మ‌న ఛానెల్‌లో మ‌రో రెండు ర‌కాల పోస్టులు చేయ‌వ‌చ్చు. అవేంటంటే.. ఫేస్‌బుక్ స‌హా ఇత‌ర సామాజిక మాధ్య‌మాల మాదిరి హెడ్‌లైన్ డిస్క్రిప్ష‌న్‌తో ఫోటో పోస్టులు చేయ‌వ‌చ్చు. దాంతో పాటుగా పోల్స్ (క్విజ్ మాదిరి) పోటీలు కూడా ఈ Community Tab Feature ద్వారా మ‌న ఛానెల్‌పై నిర్వ‌హ‌ణ చేయ‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు రాష్ట్రంలో రాబోయే ఎన్నిక‌ల్లో ఏ పార్టీ గెలుస్తుంది.. అనే ప్ర‌శ్న ఇచ్చి దానికి నాలుగు ఆప్ష‌న్ల‌ను జ‌త చేయ‌వ‌చ్చు. త‌ద్వారా మీ స‌బ్‌స్క్రైబ‌ర్ల అభిప్రాయాల‌ను ఈ పోల్‌లో మీరు తెలుసుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ఈ విధంగా క‌మ్యూనిటీ ట్యాబ్ Youtube క్రియేట‌ర్ల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఈ ఫీచ‌ర్ సాధించాలంటే ముందుగా మ‌న స‌బ్‌స్క్రైబ‌ర్ కౌంట్ 500 దాటాలి. ఆ త‌ర్వాత మ‌నం క‌మ్యూనిటీ ట్యాబ్ ఫీచ‌ర్‌ను కోరుతూ యూట్యూబ్‌కు రిక్వెస్ట్ పెట్టుకోవాలి.

క‌మ్యూనిటీ ట్యాబ్ రిక్వెస్ట్ ఎలా పెట్టాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం.

క‌మ్యూనిటీ ట్యాబ్ రిక్వెస్ట్ ఎలా పెట్టాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం.

* ముందుగా Youtube ఛానెల్‌లోకి వెళ్లాలి.
* ఆ త‌ర్వాత ఎడ‌మ‌వైపు మీకు వివిధ ర‌కాల ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. వాటిని స్క్రోల్ డౌన్ చేస్తే చివ‌ర‌న సెండ్ Feedback అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
* సెండ్ ఫీడ్ బ్యాక్ (Send Feedback) ఆప్ష‌న్ సెలెక్ట్ చేసుకున్న వెంట‌నే మీకు ఒక న్యూ టేబుల్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు యూట్యూబ్‌కు ఓ చిన్న డిస్క్రిప్ష‌న్ రాయాలి. "మా ఛానెల్ స‌బ్‌స్క్రైబ‌ర్ కౌంట్ 500 చేరుకుంది. కాబ‌ట్టి మాకు క‌మ్యూనిటీ ట్యాబ్ ఫీచ‌ర్ అందించ‌గ‌ల‌రు." అని ఇంగ్లీష్‌లో రాసి సెండ్ ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి.
* ఈ ప్ర‌క్రియ పూర్తి చేసిన త‌ర్వాత మీ ఛానెల్ కంపెనీ గైడ్‌లైన్స్ అన్ని స‌క్ర‌మంగా పాటిస్తున్న‌ట్ల‌యితే త‌ప్ప‌కుండా వారం లేదా ప‌ది రోజుల్లో క‌మ్యూనిటీ ట్యాబ్ అందుబాటులోకి వ‌స్తుంది.

Best Mobiles in India

English summary
How to block adult content or activating restricted mode on youtube
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X