మీ కంప్యూటర్‌లో ఏదైనా వెబ్‌సై‌ట్‌ను బ్లాక్ చేయాలనుకుంటున్నారా..?

|

ఈ రోజుల్లో ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కామన్ థింగ్‌గా మారిపోయింది. ఏ చిన్న విషయం తెలుసుకోవాలన్నా దాదాపుగా ఇంటర్నెట్ మీదనే ఆధారపడవల్సి వస్తోంది. మంచి ఉన్న చోటే చెడు కూడా ఉన్నట్లు ఇంటర్నెట్‌లో మంచి విషయాలతో పాటు చెడు విషయాలు కూడా విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతన్నాయి. ఇంటర్నెట్‌లో చెడు కంటెంట్‌ను వ్యాప్తి చేసే వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయకుంటే అనేక ప్రమాదాలను ఎదుర్కోవల్సి ఉంటుంది. చెడు వెబ్‌సైట్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. వాటిలో కొన్ని వైరస్‌లను వ్యాప్తి చేస్తే మరికొన్ని మాత్రం అడల్ట్ కంటెంట్ ముసుగులో వ్యక్తిగత డేటాను దొంగిలించేస్తుంటాయి. ఇటువంటి వాటిని బ్లాక్ చేయటం చాలా ఉత్తమం. మీ కంప్యూటర్‌లో ఏదైనా వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయాలనుకుంటున్నట్లయితే ఈ సింపుల్ ప్రొసీజర్‌ను ఫాలో అవ్వండి.

 

Xiaomi యూజర్లకు గుడ్ న్యూస్, సరికొత్తగా పాత సేవలుXiaomi యూజర్లకు గుడ్ న్యూస్, సరికొత్తగా పాత సేవలు

మీ కంప్యూటర్‌లో ఏదైనా వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయాలనుకుంటున్నట్లయితే..

మీ కంప్యూటర్‌లో ఏదైనా వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయాలనుకుంటున్నట్లయితే..

ఇంటర్నెట్‌కు బ్యాక్‌బోన్‌గా చెప్పుకోబడే డీఎన్ఎస్ సిస్టమ్ వెబ్‌సైట్‌లను ఐపీ అడ్రస్‌ల రూపంలో ట్రాన్సలేట్ చేసి వాటిని సులువుగా గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. ఇదే క్రమంలో కంప్యూటర్‌లోని HOSTS ఫైల్ కూడా వెబ్‌సైట్‌ల తాలుకా సమాచారాన్ని లోకల్‌గా స్టోర్ చేసుకుంటుంది. మీ కంప్యూటర్‌లో ఏదైనా వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయాలనుకుంటున్నట్లయితే మీ కంప్యూటర్‌కు సంబందించి అడ్మినిస్ట్రేటర్ యాక్సిస్‌ను మీరు కలిగి ఉండాలి. ముందుగా మీ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ నుంచి పీసీలోకి సైనిన్ అయి C:WindowsSystem32driversetcలోకి వెళ్లాలి.

 ఫైల్‌ను ఎడిట్ చేయలేకపోతున్నట్లయితే...

ఫైల్‌ను ఎడిట్ చేయలేకపోతున్నట్లయితే...

ఇక్కడ "hosts" ఫైల్ పై డబుల్ క్లిక్ చేసి ఫైల్‌లోని లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్‌ను ఓపెన్ చేసేందుకు నోట్
ప్యాడ్‌ను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ఆ తరువాత ఓకె బటన్ పై క్లిక్ చేయాలి. మీ కంప్యూటర్ హోస్ట్
ఫైల్‌కు సంబంధించిన చివరి రెండు లైన్లు "# 127.0.0.1 localhost" and "# ::1 localhost" గా ఉండాలి. ఒక వేళ మీరు ఫైల్‌ను ఎడిట్ చేయలేకపోతున్నట్లయితే file labelled hosts పై
మౌస్‌తో రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

అన్ని pop-upలలో అకౌంట్‌లను సెలక్ట్ చేసుకుని..
 

అన్ని pop-upలలో అకౌంట్‌లను సెలక్ట్ చేసుకుని..

ప్రాపర్టీస్‌లో సెక్యూరిటీ ట్యాబ్ పై క్లిక్ చేసిన అడ్మినిస్ట్రేటర్ అకౌంట్‌ను సెలక్ట్ చేసి ఎడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయవల్సి ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ అయ్యే pop-upలో మరోసారి మీ అకౌంట్‌ను సెలక్ట్ చేసుకుని ఫుల్ కంట్రోల్‌ను చెక్ చేసుకోల్సి ఉంటుంది. ఇలా అన్ని pop-upలలో మీ అకౌంట్‌లను సెలక్ట్ చేసుకుని చెక్ చేసుకోల్సి ఉంటుంది.

వెబ్‌సైట్‌కు అడ్రస్‌కు ముందు 127.0.0.1ను యాడ్ చేసి..

వెబ్‌సైట్‌కు అడ్రస్‌కు ముందు 127.0.0.1ను యాడ్ చేసి..

ఫైల్ క్రిందకు వచ్చిన తరువాత మీరు బ్లాక్ చేయాలనుకుంటోన్న వెబ్‌సైట్‌లకు సంబందించి అడ్రస్‌లను యాడ్ చేయవల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌కు అడ్రస్‌కు ముందు 127.0.0.1ను యాడ్ చేస్తే సరిపోతుంది. ఉదాహరణకు మీరు Googleను బ్లాక్ చేయాలనుకుంటునట్లయితే ఫైల్ క్రింద "127.0.0.1 www.google.com" అని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా లైన్‌కు ఒకటి చొప్పున ఎన్ని వెబ్‌సైట్‌లనైనా బ్లాక్ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ మొత్తం పూర్తయిన తరువాత హోస్ట్స్ ఫైల్‌ను సేవ్ చేసి క్లోజ్ చేయాలి. తదుపరి స్టెప్‌లో భాగంగా కంప్యూటర్‌ను రీబూట్ చేసినట్లయితే మీ కోరుకున్న వెబ్‌సైట్స్ అన్ని బ్లాక్ అయి ఉంటాయి.

Best Mobiles in India

English summary
There are several reasons why you might want to block certain websites on your computer. Some websites could be spreading viruses, contain explicit content or even be trying to steal your personal data.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X