Home
How to

LinkedIn లో రాజకీయ కంటెంట్‌ని బ్లాక్ చేయడం ఎలా?

ప్రస్తుత డిజిటల్ యుగంలో ముందుకు సాగడానికి ప్రతిఒక్కరికి కూడా విస్తృతమైన నెట్‌వర్క్ అవసరం ఖచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా అత్యంత అధునాతన నెట్‌వర్క్ మాధ్యమం లింక్డ్ఇన్ ఉపయోగకరంగా ఉంటుంది. లింక్డ్‌ఇన్ ద్వారా ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఏ కంపెనీకి చెందిన వారైనా కనుగొనడం సాధ్యమవుతుంది. జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న వారికి ఇది అతిపెద్ద వేదిక. వివిధ కంపెనీల రిక్రూట్‌మెంట్ నోటీసులు లింక్డ్‌ఇన్ ద్వారా అందుబాటులో ఉంటాయి.

How to Block Political Content on LinkedIn?

భారతదేశంలోని 1.25 బిలియన్ల జనాభాలో దాదాపు 700 మిలియన్ల మందికిపైగా స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. వీరిలో ప్రతి నెలా 155 మిలియన్ల మంది ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉండగా 160 మిలియన్ల మంది వాట్సాప్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. ఈ లెక్కల దృష్ట్యా రాజకీయ పార్టీలు ఆన్‌లైన్ ప్రచారాలకు లేదా సోషల్ మీడియాకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయో అర్థం చేసుకోవడం కష్టం కాదు. లింక్డ్ఇన్ కూడా ఇప్పుడు రాజకీయ కంటెంట్‌తో మరియు వృత్తిపరమైన కంటెంట్‌తో నిండిన ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి. లింక్డ్‌ఇన్‌లోని కొంతమంది వ్యక్తులు అన్ని రకాల కంటెంట్‌ను ఇష్టపడతారు. మరికొందరు రాజకీయ అభిప్రాయాలు లేదా వారి వ్యక్తిగత ఎంపిక లేదా అభిప్రాయాన్ని ప్రభావితం చేసే కంటెంట్‌ను చూడడానికి ఇష్టపడరు. అయితే ఇటువంటి వారి కోసం పొలిటికల్ కంటెంట్‌ను బ్లాక్ చేసే అవకాశం ఉంది. మీ యొక్క లింక్డ్ఇన్ అకౌంటులో పొలిటికల్ కంటెంట్ బ్లాకింగ్ ఫీచర్ అందుబాటులో ఉందో లేదో మరియు మీరు దాన్ని ఎలా ఆన్ చేయవచ్చో చెక్ చేసుకోవడానికి ముందుకు చదవండి.

లింక్డ్‌ఇన్‌లో రాజకీయ కంటెంట్‌ను బ్లాక్ చేసే ఫీచర్ ను కనుగొనే విధానం

How to Block Political Content on LinkedIn?

స్టెప్ 1: ముందుగా వెబ్ బ్రౌజర్ లేదా మొబైల్ యాప్ నుండి మీ లింక్‌డిన్ అకౌంటుకు సైన్ ఇన్ అవ్వండి.

స్టెప్ 2: ఇప్పుడు మీ ప్రొఫైల్ ఫోటో క్రింద సెట్టింగ్‌లు మరియు ప్రైవసీ విభాగంపై క్లిక్ చేయండి.

స్టెప్ 3: అకౌంట్ ప్రిఫరెన్స్ ఎంపికపై నొక్కండి.

స్టెప్ 4: ఇప్పుడు సైట్ ప్రిఫరెన్స్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 5: తరువాత ఫీడ్ ప్రిఫరెన్స్ లకు వెళ్లండి.

స్టెప్ 6: ఫీచర్ అందుబాటులో ఉన్నట్లయితే మీరు 'మీ ఫీడ్‌లో రాజకీయ కంటెంట్‌ని చూడాలనుకుంటున్నారా?" అనే ఎంపికను చూస్తారు.

స్టెప్ 7: మీరు దీన్ని ఎనేబుల్ లేదా డిసేబుల్ చేయడానికి అవును లేదా కాదు టోగుల్‌ని మార్క్ చేయాలి.

లింక్డ్‌ఇన్‌లో రాజకీయ కంటెంట్‌ను ఎలా దాచాలి

స్టెప్ 1: లింక్డ్‌ఇన్‌లో రాజకీయ కంటెంట్‌ను దాచడానికి, ముందుగా మీరు మీ ఫీడ్‌లోని పోస్ట్‌కి ఎగువ కుడివైపున ఉన్న "మోర్" చిహ్నంపై క్లిక్ చేయాలి.

స్టెప్ 2: ఇప్పుడు 'నేను ఈ ఎంపికను చూడకూడదనుకుంటున్నాను'పై నొక్కండి

స్టెప్ 3: మీకు 'నేను రాజకీయ కంటెంట్‌ని చూడకూడదనుకుంటున్నాను.' అనే ఆప్షన్ కనిపిస్తుంది.

స్టెప్ 4: సమర్పించుపై క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
How to Block Political Content on LinkedIn?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X