Gmailలో స్పామ్ మెయిల్స్ స‌మ‌స్యా! అయితే పూర్తిగా బ్లాక్ చేయండిలా!

|

చాలా మంది Gmail యూజ‌ర్ల‌కు అత్యంత బాధించే సమస్య స్పామ్ ఇమెయిల్‌లు. మీరు కూడా Gmail యూజ‌ర్ అయితే నేను చెప్పే విష‌యం మీకు ఈ పాటికి అర్థ‌మ‌య్యే ఉంటుంది. నిజానికి, Gmail స్టోరేజీని త్వరగా నిండిపోవ‌డానికి ఈ స్పామ్ మెయిల్స్ అతిపెద్ద కారణం. అయితే, ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌టానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. Gmail స్టోరేజీని ఖాళీ చేయడానికి, మీరు ముందుగా స్పామ్ ఇమెయిల్‌లను తొలగించాలి.. ఆపై వాటిని బ్లాక్ కూడా చేయవచ్చు, ఇది చాలా సులభం.

spam

అన‌వ‌స‌ర ఈ-మెయిల్‌లను తొల‌గించ‌డానికి.. వాటిని ఎంచుకుని డిలీట్ ఐకాన్ పై క్లిక్ చేస్తే చాలు. అదేవిధంగా, మీరు స్పామ్ మెయిల్‌ల‌ను కూడా డెలీట్ చేయ‌డానికి సులభమైన మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్ని మేం మీ కోసం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా అందిస్తున్నాం. మీరు కూడా మీ ఈ-మెయిల్ స్పామ్ మెయిల్స్‌ను బ్లాక్ చేసుకోవాల‌నుకుంటే ఈ ఆర్టిక‌ల్ పూర్తిగా చ‌ద‌వండి.

Gmail లో స్పామ్ మెయిల్స్‌ను బ్లాక్ చేయ‌డం ఎలా!

Gmail లో స్పామ్ మెయిల్స్‌ను బ్లాక్ చేయ‌డం ఎలా!

* ముందుగా Gmail ఓపెన్ చేసి అందులో మీకు వ‌చ్చిన స్పామ్‌ మెయిల్ పైన క్లిక్ చేయాలి.
* మెయిల్‌లోకి వెళ్లిన త‌ర్వాత కుడి వైపు పై భాగంలో More (మ‌రిన్ని) ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి.
* ఆ త‌ర్వాత మ‌న‌కు కొన్ని ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. వాటిలో ఈ మెయిల్ సెండ‌ర్‌ను బ్లాక్ చేయండి అనే ఆప్ష‌న్ కూడా ఉంటుంది.
* ఆ ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవ‌డం ద్వారా ఆ స్పామ్ మెయిల్ సెండర్‌ను మ‌నం బ్లాక్ చేసిన‌ట్ల‌వుతుంది. ఇక నుంచి ఆ సెండ‌ర్ నుంచి మ‌న‌కు స్పామ్ మెయిల్స్ వ‌చ్చే అవ‌కాశం ఉండ‌దు.

ఒక‌వేళ‌, మీరు పొరపాటున ఎవరినైనా అవ‌స‌రం ఉన్న వ్య‌క్తుల్ని బ్లాక్ చేస్తే, అదే ప‌ద్దతిని అనుసరించడం ద్వారా మీరు వారిని అన్‌బ్లాక్ ఆప్ష‌న్ సాయంతో అన్‌బ్లాక్ చేయ‌వచ్చు.

Gmail లో అన‌వ‌స‌ర ఈ-మెయిల్స్‌ను అన్‌స‌బ్‌స్క్రైబ్ చేసుకోండిలా:

Gmail లో అన‌వ‌స‌ర ఈ-మెయిల్స్‌ను అన్‌స‌బ్‌స్క్రైబ్ చేసుకోండిలా:

* ముందుగా Gmail ఓపెన్ చేయాలి.
* ఇన్‌బాక్స్‌లో మీరు ఏ సెండ‌ర్‌ను అయితే అన్‌స‌బ్‌స్క్రైబ్ చేయాల‌నుకుంటున్నారో.. ఆ మెయిల్‌ను ఓపెన్ చేయాలి.
* మెయిల్ పై భాగంలో సెండ‌ర్ పేరు ప‌క్క‌న అన్‌స‌బ్‌స్క్రైబ్ లేదా చేంజ్ ప్రిఫ‌రెన్స్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి.
* ఇలా చేయ‌డం ద్వారా కొద్ది రోజుల‌కు ఆ సెండ‌ర్‌పై మీ స‌బ్‌స్క్రిప్ష‌న్ ర‌ద్దు ప్ర‌క్రియ విజ‌య‌వంతం అవుతుంది.

స్పామ్ ఇమెయిల్‌లను నివారించడానికి తాత్కాలిక ఇమెయిల్ IDని సృష్టించండి

స్పామ్ ఇమెయిల్‌లను నివారించడానికి తాత్కాలిక ఇమెయిల్ IDని సృష్టించండి

మీరు స్పామ్ ఇమెయిల్‌లు లేదా ప్రచార సందేశాలను స్వీకరించకుండా ఉండాలనుకుంటే, మీరు మీ ప్రైమ‌రీ మెయిల్‌ నుండి సైన్ ఇన్ చేయడాన్ని నివారించవచ్చు. దానికి బదులుగా, తాత్కాలిక ఇమెయిల్ IDని ఉపయోగించండి. మీరు వివిధ వెబ్‌సైట్‌ల తాత్కాలిక ఇమెయిల్ IDతో యాక్సెస్ చేయ‌వ‌చ్చు.

అదేవిధంగా, PCలోని Gmailలో కాన్ఫిడెన్షియల్ మోడ్ (సీక్రెట్ మెయిల్స్‌)తో ఉన్న ఇమెయిల్‌ను పంపే విధానం కూడా తెలుసుకుందాం:

అదేవిధంగా, PCలోని Gmailలో కాన్ఫిడెన్షియల్ మోడ్ (సీక్రెట్ మెయిల్స్‌)తో ఉన్న ఇమెయిల్‌ను పంపే విధానం కూడా తెలుసుకుందాం:

* మీ వెబ్ బ్రౌజర్‌లో Gmailని ఓపెన్ చేయండి.
* కంపోజ్ బటన్‌ను క్లిక్ చేయండి.
* విండో దిగువ భాగంలో కుడివైపున కాన్ఫిడెన్షియల్ మోడ్‌ని ఆన్ చేయి ఎంపికను క్లిక్ చేయండి.
* తరువాత గడువు తేదీని ఎంచుకొని పాస్‌కోడ్‌ను సెట్ చేయండి. ముఖ్యంగా మీరు "నో SMS పాస్‌కోడ్" ఎంచుకుంటే కనుక Gmail యాప్‌ని ఉపయోగించే గ్రహీతలు దానిని నేరుగా ఓపెన్ చేయగలరు. Gmail ఉపయోగించని స్వీకర్తలకు పాస్‌కోడ్ ఇమెయిల్ పంపబడుతుంది. అయితే మీరు "SMS పాస్‌కోడ్" ఎంచుకుంటే కనుక గ్రహీతలు టెక్స్ట్ మెసేజ్ ద్వారా పాస్‌కోడ్‌ను పొందుతారు. మీరు గ్రహీత ఫోన్ నంబర్‌ను నమోదు చేశారని నిర్ధారించుకోండి.
* సేవ్ ఎంపిక మీద క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
How to block spam mails in gmail

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X