స్పామ్ కాల్‌లతో విసిగిపోయారా? అయితే ఇలా బ్లాక్ చేయండి...

|

మొబైల్ మరియు స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రావడంతో ఎవరితో అయినా మాట్లాడడం మరింత సులభం అయింది. కానీ రోజులో కొన్ని ఫోన్ కాల్స్ మాత్రం బాధిస్తూ ఉంటాయి. ఈ డిజిటల్ ప్రపంచంలో అత్యంత బాధించే విషయాలలో స్పామ్ కాల్‌లు లేదా రోబో కాల్‌లు ముందువరుసలో ఉంటాయి. వీటి కారణంగా మీరు ఏదైనా పనిమధ్యలో ఉన్నప్పుడు ఫోన్ చేసి మీకు అక్కరలేని సేవలను అందిస్తున్నట్లు మరియు ఇంకొందరు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. సంక్షిప్తంగా చెప్పాలంటే స్పామ్ కాల్‌లు ఇబ్బందికరమైనవి అయినప్పటికీ కూడా అవి ప్రమాదకరమైనవి కూడా కావచ్చు. అయితే ఈ స్పామ్ కాల్‌లు మిమ్మల్ని ఇంకెప్పుడూ ఇబ్బంది పెట్టకుండా బ్లాక్ చేయడం ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 
How to Block Spam Phone Calls on Your Android Smartphone

ముందుగా స్పామ్ కాల్‌లలో అత్యంత సాధారణ రకాలు ఏమిటో అర్థం చేసుకోవడం ముఖ్యం. మొదటిది రోబో కాల్స్. ఈ కాల్‌లు సాధారణంగా ముందుగా రికార్డ్ చేయబడిన మెసేజ్ల సమాచారంతో స్వయంచాలకంగా తరచు వస్తూ ఉంటాయి. రెండవది టెలిమార్కెటింగ్ కాల్‌లు. దీనితో నిజమైన కంపెనీలు తరచుగా ప్రజలకు తమ ఉత్పత్తులు మరియు సేవలను విక్రయించడానికి కాల్ చేస్తూ ఉంటారు. మూడవది స్కామ్ కాల్స్. ఈ కాల్‌లు ప్రజలను మోసం చేయడం మరియు యూజర్ల ఆర్థిక డేటా వంటి ఇతర విషయాలతోపాటు సున్నితమైన డేటాను బహిర్గతం చేయడానికి వారిని మోసం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో వినియోగదారులను స్పామ్ కాల్‌ల నుండి రక్షించడానికి గూగుల్ వారికి రెండు ఫీచర్లను అందిస్తుంది. ఈ ఫీచర్లు కాలర్ ID మరియు స్పామ్ ప్రొటెక్షన్ లతో డిఫాల్ట్‌గా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఆన్ చేయబడతాయి. అయితే వినియోగదారులు వాటిని ఆఫ్ చేయడానికి ఎంచుకోవచ్చు.

 

Android ఫోన్‌లో స్పామ్ కాల్‌లను బ్లాక్ చేసే విధానం

How to Block Spam Phone Calls on Your Android Smartphone

స్టెప్ 1: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్ యాప్‌ని ఓపెన్ చేయండి.

స్టెప్ 2: ఇప్పుడు 'మోర్' ఎంపిక మీద నొక్కండి, ఆపై సెట్టింగ్‌ల బటన్‌ను ఎంచుకోండి.

స్టెప్ 3: తర్వాత 'స్పామ్ మరియు కాల్ స్క్రీన్' ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 4: ఇప్పుడు కాలర్ & స్పామ్ ID ఆఫ్ చేయబడి ఉంటే కనుక ఆన్ చేసి అమలు చేయండి.

స్పామ్‌ కాల్‌లను గుర్తించే విధానం

How to Block Spam Phone Calls on Your Android Smartphone

గూగుల్ యొక్క కఠినమైన పరిశీలన ద్వారా స్పామ్ కాల్‌లు తప్పినప్పుడు లేదా స్పామర్ చట్టబద్ధంగా కనిపించే నంబర్ నుండి కాల్ చేస్తే కనుక ఆండ్రాయిడ్ వినియోగదారులు ఫోన్ కాల్‌లలో దాన్ని కాల్ స్పామ్‌గా గుర్తించి దాన్ని బ్లాక్ చేయవచ్చు. ఇందుకోసం కింద ఉన్న దశలను అనుసరించండి.

స్టెప్ 1: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్ యాప్‌ని ఓపెన్ చేయండి.

స్టెప్ 2: యాప్ దిగువన రీసెంట్ ట్యాబ్‌ను నొక్కండి.

స్టెప్ 3: ఇప్పుడు మీరు స్పామ్‌గా నివేదించాలనుకుంటున్న కాల్‌ను ఎంచుకోండి.

స్టెప్ 4: ఆపై బ్లాక్ చేయండి లేదా స్పామ్ రిపోర్ట్ చేయండి.

Best Mobiles in India

English summary
How to Block Spam Phone Calls on Your Android Smartphone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X